Psalms · chapter 129 · verse 2
Psalm 129:2 in Telugu
నా ¸యౌవనకాలము మొదలుకొని నాకు అధిక బాధలు కలుగజేయుచు వచ్చిరి. అయినను వారు నన్ను జయింపలేకపోయిరి.
Naa ¸yauvanakaalamu modalukoni naaku adhika baadhalu kalugajeyuchu vachchiri. Ayinanu vaaru nannu jayimpalekapoyiri.
Psalm 129:2 in English
- King James Version (KJV)
- Many a time have they afflicted me from my youth: yet they have not prevailed against me.
- World English Bible (WEB)
- many times they have afflicted me from my youth up, yet they have not prevailed against me.
- American Standard Version (ASV)
- Many a time have they afflicted me from my youth up: Yet they have not prevailed against me.
- Bible in Basic English (BBE)
- Great have been my troubles from the time when I was young, but my troubles have not overcome me.
- Darby Translation (DBY)
- Many a time have they afflicted me from my youth; yet they have not prevailed against me.
- Webster's Bible (WBS)
- Many a time have they afflicted me from my youth: yet they have not prevailed against me.
- Young's Literal Translation (YLT)
- Often they distressed me from my youth, Yet they have not prevailed over me.
Read in context
- 1ఇశ్రాయేలు ఇట్లనును నా యౌవనకాలము మొదలుకొని పగవారు నాకు అధిక బాధలు కలుగజేయుచు వచ్చిరి
- 2నా ¸యౌవనకాలము మొదలుకొని నాకు అధిక బాధలు కలుగజేయుచు వచ్చిరి. అయినను వారు నన్ను జయింపలేకపోయిరి.
- 3దున్నువారు నా వీపుమీద దున్నిరి వారు చాళ్లను పొడుగుగా చేసిరి.
- 4యెహోవా న్యాయవంతుడు భక్తిహీనులు కట్టిన త్రాళ్లు ఆయన తెంపియున్నాడు.
Cross references
- Revelation 12:8–9 ప్రకటన 12:8–9ఆ ఘటసర్పమును దాని దూతలును యుద్ధము చేసిరి గాని గెలువ లేకపోయిరి గనుక పరలోకమందు వారికిక స్థలము లేకపోయెను. కాగా సర్వలోకమును మోస పుచ్చుచు, అపవాదియనియు సాతాననియు పేరుగల ఆదిసర్పమైన ఆ మహా ఘటసర్పము పడద్రోయబడెను. అది భూమిమీద పడ ద్రోయబడెను; దాని దూతలు దానితో కూడ పడద్రోయబడిరి.
- Psalm 34:19 కీర్తనలు 34:19నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటి అన్నిటిలోనుండి యెహోవా వానిని విడిపించును.
- Matthew 16:18 మత్తయి 16:18మరియు నీవు పేతురువు; ఈ బండమీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని యెదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను.
- 2 Corinthians 4:8–9 2 కొరింథీయులకు 4:8–9ఎటుబోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడువారము కాము; అపాయములో నున్నను కేవలము ఉపాయము లేనివారము కాము; తరుమబడు చున్నను దిక్కులేనివారము కాము; పడద్రోయబడినను నశించువారము కాము.
- John 16:33 యోహాను 16:33నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును; అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి యున్నాననెను.
- Psalm 118:13 కీర్తనలు 118:13నేను పడునట్లు నీవు నన్ను గట్టిగా తోసితివి యెహోవా నాకు సహాయము చేసెను.
- Psalm 42:1 కీర్తనలు 42:1దుప్పి నీటివాగులకొరకు ఆశపడునట్లు దేవా, నీకొరకు నా ప్రాణము ఆశపడుచున్నది.
- Psalm 125:1 కీర్తనలు 125:1యెహోవాయందు నమ్మిక యుంచువారు కదలక నిత్యము నిలుచు సీయోను కొండవలెనుందురు.
- Job 5:19 యోబు 5:19ఆరు బాధలలోనుండి ఆయన నిన్ను విడిపించును ఏడు బాధలు కలిగినను నీకు ఏ కీడును తగులదు.
- Romans 8:35–39 రోమీయులకు 8:35–39క్రీస్తు ప్రేమనుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమయైనను బాధయైనను హింసయైనను కరవైనను వస్త్రహీనతయైనను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనలను ఎడబాపునా? ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా నిన్ను బట్టి దినమెల్ల మేము వధింపబడినవారము వధకు సిద్ధమైన గొఱ్ఱెలమని మేము ఎంచబడిన వారము. అయినను మనలను ప్రేమించినవాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవియైనను రాబోవున వియైనను అధికారులైనను ఎత్తయినను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను, మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమనుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను.