Psalms · chapter 144 · verse 13
Psalm 144:13 in Telugu
మా కొట్లు నింపబడి పలువిధములైన ద్రవ్యములకు నిధులుగా ఉన్నవి మా గొఱ్ఱెలు వేలకొలదిగాను పదివేలకొలదిగాను మా గడ్డి బీళ్లలో పిల్లలు వేయుచున్నవి.
Maa kotlu nimpabadi paluvidhamulaina dravyamulaku nidhulugaa unnavi maa gorrelu velakoladigaanu padivelakoladigaanu maa gaddi beellalo pillalu veyuchunnavi.
Psalm 144:13 in English
- King James Version (KJV)
- [That] our garners [may be] full, affording all manner of store: [that] our sheep may bring forth thousands and ten thousands in our streets:
- World English Bible (WEB)
- Our barns are full, filled with all kinds of provision. Our sheep produce thousands and ten thousands in our fields.
- American Standard Version (ASV)
- [When] our garners are full, affording all manner of store, [And] our sheep bring forth thousands and ten thousands in our fields;
- Bible in Basic English (BBE)
- Our store-houses are full of all good things; and our sheep give birth to thousands and ten thousands in our fields.
- Darby Translation (DBY)
- Our granaries full, affording all manner of store; our sheep bringing forth thousands, ten thousands in our pastures;
- Webster's Bible (WBS)
- [That] our granaries [may be] full, affording all manner of store; [that] our sheep may bring forth thousands and ten thousands in our streets:
- Young's Literal Translation (YLT)
- Our garners [are] full, bringing out from kind to kind, Our flocks are bringing forth thousands, Ten thousands in our out-places,
Read in context
- 11నన్ను తప్పింపుము అన్యుల చేతిలోనుండి నన్నువిడి పింపుము వారి నోరు వట్టి మాటలాడుచున్నది వారి కుడిచేయి అబద్ధముతో కూడియున్నది.
- 12మా కుమారులు తమ ¸యౌవన కాలమందు ఎదిగిన మొక్కలవలె ఉన్నారు మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూలకంబములవలె ఉన్నారు.
- 13మా కొట్లు నింపబడి పలువిధములైన ద్రవ్యములకు నిధులుగా ఉన్నవి మా గొఱ్ఱెలు వేలకొలదిగాను పదివేలకొలదిగాను మా గడ్డి బీళ్లలో పిల్లలు వేయుచున్నవి.
- 14మా యెడ్లు గొప్ప బరువులు మోయగలవి మా వీధులలో చొరబడుటయైనను ఉరుకులెత్తుట యైనను లేదు వాటిలో శ్రమగలవారి మొఱ్ఱ వినబడుటయైనను లేదు
- 15ఇట్టి స్థితిగలవారు ధన్యులు. యెహోవా తమకు దేవుడుగాగల జనులు ధన్యులు.
Cross references
- Deuteronomy 7:13–14 ద్వితీయోపదేశకాండము 7:13–14ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభి వృద్ధిచేసి, నీకిచ్చెదనని నీ పితరులతో ప్రమాణముచేసిన దేశములో నీ గర్భఫలమును, నీ భూఫలమైన నీ సస్యమును, నీ ద్రాక్షారసమును, నీ నూనెను, నీ పశువుల మందలను, నీ గొఱ్ఱెల మందలను, మేకల మందలను దీవించును. సమస్త జనములకంటె ఎక్కువగా నీవు ఆశీర్వదింప బడుదువు. నీలో మగవానికేగాని ఆడు దానికేగాని గొడ్డుతనముండదు, నీ పశువులలోనైననుండదు.
- Deuteronomy 28:8 ద్వితీయోపదేశకాండము 28:8నీ కొట్లలోను నీవు చేయు ప్రయత్నము లన్నిటి లోను నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించును.
- Leviticus 26:10 లేవీయకాండము 26:10మీరు చాలాకాలము నిలువైయున్న పాతగిలిన ధాన్య మును తినెదరు; క్రొత్తది వచ్చినను పాతది మిగిలి యుండును.
- Deuteronomy 28:4 ద్వితీయోపదేశకాండము 28:4నీ గర్భఫలము నీ భూఫలము నీ పశువుల మందలు నీ దుక్కి టెద్దులు నీ గొఱ్ఱె మేకల మందలు దీవింపబడును;
- Psalm 107:37–38 కీర్తనలు 107:37–38వాటివలన సస్యఫలసమృద్ధి పొందునట్లును ఆయన ఆకలికొనినవారిని అచ్చట కాపురముంచెను మరియు ఆయన వారిని ఆశీర్వదింపగా వారు అధిక ముగా సంతానాభివృద్ధి నొందిరి ఆయన వారి పశువులను తగ్గిపోనియ్యలేదు
- Leviticus 26:5 లేవీయకాండము 26:5మీ ద్రాక్ష పండ్ల కాలమువరకు మీ నూర్పు సాగుచుండును, మీరు తృప్తిగా భుజించి మీ దేశములో నిర్భయముగా నివసించెదరు.
- Malachi 3:10 మలాకీ 3:10నా మందిరములో ఆహారముండునట్లు పదియవభాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసికొనిరండి; దీని చేసి మీరు నన్ను శోధించినయెడల నేను ఆకాశపువాకిండ్లను విప్పి, పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చు చున్నాడు.
- Deuteronomy 8:3 ద్వితీయోపదేశకాండము 8:3ఆహారమువలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాటవలన నరులు బ్రదుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి, నీవేగాని నీ పితరులేగాని యెన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించెను.
- Luke 12:16–20 లూకా 12:16–20మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడతడునా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తానాలోచించుకొని నేనీలాగు చేతును; నా కొట్లు విప్పి, వాటికంటె గొప్పవాటిని కట్టించి, అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతోప్రాణమా, అనేక సంవత్సరములకు, విస్తార మైన ఆస్తి నీకు సమకూర్చబడియున్నది; సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పు కొందునను కొనెను. అయితే దేవుడు వెఱ్ఱివాడా, యీ రాత్రి నీ ప్రాణము నడుగుచున్నారు; నీవు సిద్ధపరచినవి ఎవని వగునని ఆతనితో చెప్పెను.
- Genesis 30:29–31 ఆదికాండము 30:29–31అందుకు యాకోబు అతని చూచి నేను నీకెట్లు కొలువు చేసితినో నీ మందలు నాయొద్ద ఎట్లుండెనో అది నీకు తెలియును; నేను రాకమునుపు నీకుండినది కొంచెమే; అయితే అది బహుగా అభివృద్ధి పొందెను; నేను పాదముపెట్టిన చోటెల్ల యెహోవా నిన్ను ఆశీర్వదించెను; నేను నా యింటి వారికొరకు ఎప్పుడు సంపాద్యము చేసికొందుననెను. అప్పుడతడు నేను నీకేమి ఇయ్యవలెనని యడిగినందుకు యాకోబు నీవు నాకేమియు ఇయ్యవద్దు; నీవు నాకొరకు ఈ విధముగా చేసినయెడల నేను తిరిగి నీ మందను మేపి కాచెదను.