Psalms · chapter 148 · verse 1
Psalm 148:1 in Telugu
యెహోవాను స్తుతించుడి. ఆకాశవాసులారా, యెహోవాను స్తుతించుడి ఉన్నతస్థలముల నివాసులారా, ఆయనను స్తుతించుడి
Yehovaanu stutinchudi. Aakaashavaasulaaraa, yehovaanu stutinchudi unnatasthalamula nivaasulaaraa, aayananu stutinchudi
Psalm 148:1 in English
- King James Version (KJV)
- Praise ye the LORD. Praise ye the LORD from the heavens: praise him in the heights.
- World English Bible (WEB)
- Praise the LORD! Praise the LORD from the heavens! Praise him in the heights!
- American Standard Version (ASV)
- Praise ye Jehovah. Praise ye Jehovah from the heavens: Praise him in the heights.
- Bible in Basic English (BBE)
- Give praise to the Lord. Let the Lord be praised from the heavens: give him praise in the skies.
- Darby Translation (DBY)
- Hallelujah! Praise Jehovah from the heavens; praise him in the heights.
- Webster's Bible (WBS)
- Praise ye the LORD. Praise ye the LORD from the heavens: praise him in the hights.
- Young's Literal Translation (YLT)
- Praise ye Jah! Praise ye Jehovah from the heavens, Praise ye Him in high places.
Read in context
- 1యెహోవాను స్తుతించుడి. ఆకాశవాసులారా, యెహోవాను స్తుతించుడి ఉన్నతస్థలముల నివాసులారా, ఆయనను స్తుతించుడి
- 2ఆయన దూతలారా, మీరందరు ఆయనను స్తుతించుడి ఆయన సైన్యములారా, మీరందరు ఆయనను స్తుతించుడి
- 3సూర్యచంద్రులారా, ఆయనను స్తుతించుడి కాంతిగల నక్షత్రములారా, మీరందరు ఆయనను స్తుతించుడి.
Cross references
- Psalm 89:5 కీర్తనలు 89:5యెహోవా, ఆకాశవైశాల్యము నీ ఆశ్చర్యకార్యములను స్తుతించుచున్నది పరిశుద్ధదూతల సమాజములో నీ విశ్వాస్యతను బట్టి నీకు స్తుతులు కలుగుచున్నవి.
- Psalm 69:34 కీర్తనలు 69:34భూమ్యాకాశములు ఆయనను స్తుతించును గాక సముద్రములును వాటియందు సంచరించు సమస్త మును ఆయనను స్తుతించును గాక.
- Revelation 19:1–6 ప్రకటన 19:1–6అటుతరువాత బహు జనులశబ్దమువంటి గొప్పస్వరము పరలోకమందు ఈలాగు చెప్పగా వింటిని ప్రభువును స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును; ఆయన తీర్పులు సత్యములును న్యాయములునై యున్నవి; తన వ్యభిచారముతో భూలోకమును చెరిపిన గొప్ప వేశ్యకు ఆయన తీర్పు తీర్చి తన దాసుల రక్తమునుబట్టి దానికి ప్రతిదండన చేసెను; మరి రెండవసారి వారుప్రభువును స్తుతించుడి అనిరి. ఆ పట్టణపు పొగ యుగయుగములు పైకి లేచుచున్నది. అప్పుడు ఆ యిరువది నలుగురు పెద్దలును నాలుగు జీవులును సాగిలపడి ఆమేన్, ప్రభువును స్తుతించుడి అని చెప్పుచు సింహాసనాసీనుడగు దేవునికి నమస్కారము చేసిరి. మరియు మన దేవుని దాసులారా, ఆయనకు భయపడువారలారా, కొద్దివారేమి గొప్పవారేమి మీరందరు ఆయనను స్తుతించుడి అని చెప్పుచున్న యొక స్వరము సింహాసనమునొద్దనుండి వచ్చెను. అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన యొక స్వరముసర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు
- Luke 2:13–14 లూకా 2:13–14వెంటనే పరలోక సైన్యసమూహము ఆ దూతతో కూడనుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుష్యులకు భూమిమీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను.
- Isaiah 49:13 యెషయా 49:13శ్రమనొందిన తన జనులయందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చియున్నాడు ఆకాశమా, ఉత్సాహధ్వని చేయుము భూమీ, సంతోషించుము పర్వతములారా, ఆనందధ్వని చేయుడి.
- Matthew 21:9 మత్తయి 21:9జనసమూహములలో ఆయనకు ముందు వెళ్లుచుండినవారును వెనుక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి.
- Psalm 146:1 కీర్తనలు 146:1యెహోవాను స్తుతించుడి. నా ప్రాణమా, యెహోవాను స్తుతింపుము