Psalms · chapter 25 · verse 10
Psalm 25:10 in Telugu
ఆయన చేసిన నిబంధనను ఆయన నియమించిన శాసనములను గైకొనువారి విషయములో యెహోవా త్రోవలన్నియు కృపాసత్యమయములై యున్నవి
Aayana chesina nibandhananu aayana niyaminchina shaasanamulanu gaikonuvaari vishayamulo yehovaa trovalanniyu krupaasatyamayamulai yunnavi
Psalm 25:10 in English
- King James Version (KJV)
- All the paths of the LORD [are] mercy and truth unto such as keep his covenant and his testimonies.
- World English Bible (WEB)
- All the paths of the LORD are loving kindness and truth to such as keep his covenant and his testimonies.
- American Standard Version (ASV)
- All the paths of Jehovah are lovingkindness and truth Unto such as keep his covenant and his testimonies.
- Bible in Basic English (BBE)
- All the ways of the Lord are mercy and good faith for those who keep his agreement and his witness.
- Darby Translation (DBY)
- All the paths of Jehovah are loving-kindness and truth for such as keep his covenant and his testimonies.
- Webster's Bible (WBS)
- All the paths of the LORD [are] mercy and truth to such as keep his covenant and his testimonies.
- Young's Literal Translation (YLT)
- All the paths of Jehovah [are] kindness and truth, To those keeping His covenant, And His testimonies.
Read in context
- 8యెహోవా ఉత్తముడును యథార్థవంతుడునై యున్నాడు కావున తన మార్గమునుగూర్చి ఆయన పాపులకు ఉపదేశించును.
- 9న్యాయవిధులనుబట్టి ఆయన దీనులను నడిపించును తన మార్గమును దీనులకు నేర్పును.
- 10ఆయన చేసిన నిబంధనను ఆయన నియమించిన శాసనములను గైకొనువారి విషయములో యెహోవా త్రోవలన్నియు కృపాసత్యమయములై యున్నవి
- 11యెహోవా, నా పాపము బహు ఘోరమైనది నీ నామమునుబట్టి దానిని క్షమింపుము.
- 12యెహోవాయందు భయభక్తులుగలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును.
Cross references
- James 5:11 యాకోబు 5:11సహించిన వారిని ధన్యులనుకొనుచున్నాము గదా? మీరు యోబు యొక్క సహనమునుగూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలిసికొని యున్నారు.
- Romans 8:28 రోమీయులకు 8:28దేవుని ప్రేమించువారికి, అనగా ఆయన సంకల్పముచొప్పున పిలువబడినవారికి, మేలుకలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని యెరుగుదుము.
- Hebrews 8:8–12 హెబ్రీయులకు 8:8–12అయితే ఆయన ఆక్షేపించి వారితో ఈలాగు చెప్పుచున్నాడు ప్రభువు ఇట్లనెను ఇదిగో యొక కాలము వచ్చు చున్నది. అప్పటిలో ఇశ్రాయేలు ఇంటివారితోను యూదా ఇంటివారితోను నేను క్రొత్తనిబంధన చేయుదును. అది నేను ఐగుప్తుదేశములోనుండి వీరి పితరులను వెలుపలికి రప్పించుటకైవారిని చెయ్యి పట్టుకొనిన దినమునవారితో నేను చేసిన నిబంధనవంటిది కాదు. ఏమనగావారు - వారు నా నిబంధనలో నిలువలేదు గనుక నేను వారిని అలక్ష్యము చేసితినని ప్రభువు చెప్పుచున్నాడు. ఆ దినములైన తరువాత ఇశ్రాయేలు ఇంటివారితో నేను చేయబోవు నిబంధన యేదనగా, వారి మనస్సులో నా ధర్మవిధులను ఉంచెదను వారి హృదయములమీద వాటిని వ్రాయుదును నేను వారికి దేవుడునై యుందును వారు నాకు ప్రజలై యుందురు. వారిలో ఎవడును ప్రభువును తెలిసికొనుడని తన పట్టణస్థునికైనను తన సహోదరునికైనను ఉపదేశముచేయడు వారిలో చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరును నన్ను తెలిసికొందురు. నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇకను ఎన్నడును జ్ఞాపకము చేసికొననని ప్రభువు సెలవిచ్చుచున్నాడు.
- Psalm 40:11 కీర్తనలు 40:11యెహోవా, నీవు నీ వాత్సల్యమును నాకు దూరము చేయవు నీ కృపాసత్యములు ఎప్పుడును నన్ను కాపాడునుగాక
- Psalm 103:17–18 కీర్తనలు 103:17–18ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడల ననుస రించి నడచుకొను వారిమీద యెహోవాయందు భయభక్తులు గలవారిమీద ఆయన కృప యుగయుగములు నిలుచును ఆయన నీతి వారికి పిల్లపిల్ల తరమున నిలుచును.
- John 1:17 యోహాను 1:17ధర్మశాస్త్రము మోషేద్వారా అను గ్రహింపబడెను; కృపయు సత్యమును యేసు క్రీస్తుద్వారా కలిగెను.
- Romans 2:13 రోమీయులకు 2:13ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతి మంతులు కారుగాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడుదురు.
- Psalm 119:75–76 కీర్తనలు 119:75–76యెహోవా, నీ తీర్పులు న్యాయమైనవనియు విశ్వాస్యతగలవాడవై నీవు నన్ను శ్రమపరచితివనియు నేనెరుగుదును. నీ సేవకునికి నీవిచ్చిన మాటచొప్పున నీ కృప నన్ను ఆదరించును గాక.
- Psalm 91:14 కీర్తనలు 91:14అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతని తప్పించెదను అతడు నా నామము నెరిగినవాడు గనుక నేనతని ఘనపరచెదను
- Genesis 5:24 ఆదికాండము 5:24హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడతని తీసికొనిపోయెను గనుక అతడు లేకపోయెను.
- Hosea 14:9 హోషేయ 14:9జ్ఞానులు ఈ సంగతులు వివేచింతురు, బుద్ధిమంతులు వాటిని గ్రహిం తురు; ఏలయనగా యెహోవా మార్గములు చక్కనివి, నీతి మంతులు దాని ననుసరించి నడచుకొందురు గాని తిరుగు బాటు చేయువారి దారికి అది అడ్డము గనుక వారు తొట్రిల్లుదురు.
- Isaiah 25:1 యెషయా 25:1యెహోవా, నీవే నా దేవుడవు నేను నిన్ను హెచ్చించెదను నీ నామమును స్తుతించె దను నీవు అద్భుతములు చేసితివి, సత్యస్వభావము ననుస రించి నీవు పూర్వకాలమున చేసిన నీ ఆలోచనలు నెరవేర్చితివి