Skip to content
ThuthiThuthiThuthi
Psalms · chapter 25 of 150 · 22 verses

Psalm 25 in Telugu

కీర్తనలు 25

  1. యెహోవా, నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తి కొనుచున్నాను.

    [A Psalm] of David. Unto thee, O LORD, do I lift up my soul.

  2. నా దేవా, నీయందు నమ్మిక యుంచియున్నాను నన్ను సిగ్గుపడనియ్యకుము నా శత్రువులను నన్నుగూర్చి ఉత్సహింప నియ్యకుము

    O my God, I trust in thee: let me not be ashamed, let not mine enemies triumph over me.

  3. నీకొరకు కనిపెట్టువారిలో ఎవడును సిగ్గునొందడు. హేతువు లేకుండనే ద్రోహము చేయువారు సిగ్గు నొందుదురు.

    Yea, let none that wait on thee be ashamed: let them be ashamed which transgress without cause.

  4. యెహోవా, నీ మార్గములను నాకు తెలియజేయుము నీత్రోవలను నాకు తేటపరచుము.

    Shew me thy ways, O LORD; teach me thy paths.

  5. నన్ను నీ సత్యము ననుసరింపజేసి నాకు ఉపదేశము చేయుము. నీవే నా రక్షణకర్తవైన దేవుడవు దినమెల్ల నీకొరకు కనిపెట్టుచున్నాను.

    Lead me in thy truth, and teach me: for thou [art] the God of my salvation; on thee do I wait all the day.

  6. యెహోవా, నీ కరుణాతిశయములను జ్ఞాపకము చేసికొనుము నీ కృపాతిశయములను జ్ఞాపకము చేసికొనుము అవి పూర్వమునుండి యున్నవే గదా.

    Remember, O LORD, thy tender mercies and thy lovingkindnesses; for they [have been] ever of old.

  7. నా బాల్యపాపములను నా అతిక్రమములను జ్ఞాపకము చేసికొనకుము. యెహోవా నీ కృపనుబట్టి నీ దయచొప్పున నన్ను జ్ఞాపకములో ఉంచుకొనుము.

    Remember not the sins of my youth, nor my transgressions: according to thy mercy remember thou me for thy goodness’ sake, O LORD.

  8. యెహోవా ఉత్తముడును యథార్థవంతుడునై యున్నాడు కావున తన మార్గమునుగూర్చి ఆయన పాపులకు ఉపదేశించును.

    Good and upright [is] the LORD: therefore will he teach sinners in the way.

  9. న్యాయవిధులనుబట్టి ఆయన దీనులను నడిపించును తన మార్గమును దీనులకు నేర్పును.

    The meek will he guide in judgment: and the meek will he teach his way.

  10. ఆయన చేసిన నిబంధనను ఆయన నియమించిన శాసనములను గైకొనువారి విషయములో యెహోవా త్రోవలన్నియు కృపాసత్యమయములై యున్నవి

    All the paths of the LORD [are] mercy and truth unto such as keep his covenant and his testimonies.

  11. యెహోవా, నా పాపము బహు ఘోరమైనది నీ నామమునుబట్టి దానిని క్షమింపుము.

    For thy name’s sake, O LORD, pardon mine iniquity; for it [is] great.

  12. యెహోవాయందు భయభక్తులుగలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును.

    What man [is] he that feareth the LORD? him shall he teach in the way [that] he shall choose.

  13. అతని ప్రాణము నెమ్మదిగా ఉండును అతని సంతానము భూమిని స్వతంత్రించుకొనును.

    His soul shall dwell at ease; and his seed shall inherit the earth.

  14. యెహోవా మర్మము ఆయనయందు భయభక్తులు గల వారికి తెలిసియున్నది ఆయన తన నిబంధనను వారికి తెలియజేయును.

    The secret of the LORD [is] with them that fear him; and he will shew them his covenant.

  15. నా కనుదృష్టి యెల్లప్పుడు యెహోవావైపునకే తిరిగియున్నది ఆయన నా పాదములను వలలోనుండి విడిపించును.

    Mine eyes [are] ever toward the LORD; for he shall pluck my feet out of the net.

  16. నేను ఏకాకిని, బాధపడువాడను నా వైపు తిరిగి నన్ను కరుణింపుము.

    Turn thee unto me, and have mercy upon me; for I [am] desolate and afflicted.

  17. నా హృదయవేదనలు అతివిస్తారములు ఇక్కట్టులోనుండి నన్ను విడిపింపుము.

    The troubles of my heart are enlarged: [O] bring thou me out of my distresses.

  18. నా బాధను నా వేదనను కనుగొనుము నా పాపములన్నిటిని క్షమింపుము.

    Look upon mine affliction and my pain; and forgive all my sins.

  19. నా శత్రువులను చూడుము, వారు అనేకులు క్రూరద్వేషముతో వారు నన్ను ద్వేషించుచున్నారు.

    Consider mine enemies; for they are many; and they hate me with cruel hatred.

  20. నేను నీ శరణుజొచ్చి యున్నాను, నన్ను సిగ్గుపడ నియ్యకుము నా ప్రాణమును కాపాడుము, నన్ను రక్షింపుము.

    O keep my soul, and deliver me: let me not be ashamed; for I put my trust in thee.

  21. నీకొరకు నేను కనిపెట్టుచున్నాను యథార్థతయు నిర్దోషత్వమును నన్ను సంరక్షించును గాక.

    Let integrity and uprightness preserve me; for I wait on thee.

  22. దేవా, వారి బాధలన్నిటిలోనుండి ఇశ్రాయేలీయులను విమోచింపుము.

    Redeem Israel, O God, out of all his troubles.

All chapters of Psalms · Telugu Bible · Psalm 25 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.