Psalms · chapter 35 · verse 17
Psalm 35:17 in Telugu
ప్రభువా, నీవెన్నాళ్లు చూచుచు ఊరకుందువు? వారు నాశనము చేయకుండ నా ప్రాణమును రక్షిం పుము నా ప్రాణమును సింహముల నోటనుండి విడిపింపుము
Prabhuvaa, neevennaallu choochuchu oorakunduvu? Vaaru naashanamu cheyakunda naa praanamunu rakshim pumu naa praanamunu sinhamula notanundi vidipimpumu
Psalm 35:17 in English
- King James Version (KJV)
- Lord, how long wilt thou look on? rescue my soul from their destructions, my darling from the lions.
- World English Bible (WEB)
- Lord, how long will you look on? Rescue my soul from their destruction, my precious life from the lions.
- American Standard Version (ASV)
- Lord, how long wilt thou look on? Rescue my soul from their destructions, My darling from the lions.
- Bible in Basic English (BBE)
- Lord, how long will you be looking on? take my soul from their destruction, my life from the lions.
- Darby Translation (DBY)
- Lord, how long wilt thou look on? Rescue my soul from their destructions, my only one from the young lions.
- Webster's Bible (WBS)
- LORD, how long wilt thou look on? rescue my soul from their destructions, my darling from the lions.
- Young's Literal Translation (YLT)
- Lord, how long dost thou behold? Keep back my soul from their desolations, From young lions my only one.
Read in context
- 15నేను కూలియుండుట చూచి వారు సంతోషించి గుంపుకూడిరి నీచులును నేనెరుగనివారును నా మీదికి కూడివచ్చి మానక నన్ను నిందించిరి.
- 16విందుకాలమునందు దూషణలాడు వదరుబోతులవలె వారు నా మీద పండ్లుకొరికిరి.
- 17ప్రభువా, నీవెన్నాళ్లు చూచుచు ఊరకుందువు? వారు నాశనము చేయకుండ నా ప్రాణమును రక్షిం పుము నా ప్రాణమును సింహముల నోటనుండి విడిపింపుము
- 18అప్పుడు మహాసమాజములో నేను నిన్ను స్తుతించెదను బహు జనులలో నిన్ను నుతించెదను.
- 19నిర్హేతుకముగా నాకు శత్రువులైనవారిని నన్నుగూర్చి సంతోషింపనియ్యకుము నిర్నిమిత్తముగా నన్ను ద్వేషించువారిని కన్ను గీటనియ్యకుము.
Cross references
- Habakkuk 1:13 హబక్కూకు 1:13నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కళంకమైనది గదా; బాధించువారుచేయు బాధను నీవు దృష్టింపజాలవు గదా; కపటులను నీవు చూచియు, దుర్మార్గులు తమకంటె ఎక్కువ నీతిపరులను నాశనము చేయగా నీవు చూచియు ఎందుకు ఊరకున్నావు?
- Psalm 22:20–21 కీర్తనలు 22:20–21ఖడ్గమునుండి నా ప్రాణమును కుక్కల బలమునుండి నా ప్రాణమును తప్పింపుము. సింహపు నోటనుండి నన్ను రక్షింపుము గురుపోతుల కొమ్ములలోనుండి నన్ను రక్షించి నాకుత్తరమిచ్చి యున్నావు
- Psalm 57:4 కీర్తనలు 57:4నా ప్రాణము సింహములమధ్య నున్నది కోపోద్రేకుల మధ్యను నేను పండుకొనుచున్నాను వారి దంతములు శూలములు అవి అంబులు వారి నాలుక వాడిగల కత్తి.
- Psalm 74:9–10 కీర్తనలు 74:9–10సూచకక్రియలు మాకు కనబడుటలేదు, ఇకను ప్రవక్తయు లేకపోయెను. ఇది ఎంతకాలము జరుగునో దాని నెరిగినవాడు మాలో ఎవడును లేడు. దేవా, విరోధులు ఎందాక నిందింతురు? శత్రువులు నీ నామమును నిత్యము దూషింతురా?
- Psalm 94:3–4 కీర్తనలు 94:3–4యెహోవా, భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించుదురు? భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించుదురు? వారు వదరుచు కఠోరమైన మాటలు పలుకుచున్నారు దోషము చేయువారందరు బింకములాడు చున్నారు.
- Psalm 89:46 కీర్తనలు 89:46యెహోవా, ఎంతవరకు నీవు దాగియుందువు? నిత్యము దాగియుందువా? ఎంతవరకు నీ ఉగ్రత అగ్నివలె మండును?
- Psalm 10:14 కీర్తనలు 10:14నీవు దీనిని చూచి యున్నావు గదా, వారికి ప్రతికారము చేయుటకై నీవు చేటును పగను కనిపెట్టి చూచుచున్నావునిరాధారులు తమ్మును నీకు అప్పగించుకొందురు తండ్రిలేనివారికి నీవే సహాయుడవై యున్నావు
- Psalm 6:3 కీర్తనలు 6:3నా ప్రాణము బహుగా అదరుచున్నది. యెహోవా, నీవు ఎంతవరకు కరుణింపక యుందువు?
- Psalm 142:6–7 కీర్తనలు 142:6–7నేను చాలా క్రుంగియున్నాను నా మొఱ్ఱకు చెవి యొగ్గుము నన్ను తరుమువారు నాకంటె బలిష్ఠులు వారి చేతిలో నుండి నన్ను విడిపింపుము. నేను నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించునట్లు చెరసాలలోనుండి నా ప్రాణమును తప్పింపుము అప్పుడు నీవు నాకు మహోపకారము చేసియుండుట చూచి నీతిమంతులు నన్నుబట్టి అతిశయపడుదురు.
- Psalm 69:14–15 కీర్తనలు 69:14–15నేను దిగిపోకుండ ఊబిలోనుండి నన్ను తప్పించుము నా పగవారిచేతిలోనుండి అగాధజలములలోనుండి నన్ను తప్పించుము. నీటివరదలు నన్ను ముంచనియ్యకుము అగాధసముద్రము నన్ను మింగనియ్యకుము గుంట నన్ను మింగనియ్యకుము.
- Psalm 13:1–2 కీర్తనలు 13:1–2యెహోవా, ఎన్నాళ్లవరకు నన్ను మరచిపోవుదువు? నిత్యము మరచెదవా? నాకెంతకాలము విముఖుడవై యుందువు? ఎంతవరకు నా మనస్సులో నేను చింతపడుదును?ఎంతవరకు నా హృదయములో పగలంతయు దుఃఖా క్రాంతుడనై యుందును?ఎంతవరకు నాశత్రువు నామీద తన్ను హెచ్చించుకొనును?