Psalms · chapter 41 · verse 3
Psalm 41:3 in Telugu
రోగశయ్యమీద యెహోవా వానిని ఆదరించును రోగము కలుగగా నీవే వానిని స్వస్థపరచుదువు.
Rogashayyameeda yehovaa vaanini aadarinchunu rogamu kalugagaa neeve vaanini svasthaparachuduvu.
Psalm 41:3 in English
- King James Version (KJV)
- The LORD will strengthen him upon the bed of languishing: thou wilt make all his bed in his sickness.
- World English Bible (WEB)
- The LORD will sustain him on his sickbed, and restore him from his bed of illness.
- American Standard Version (ASV)
- Jehovah will support him upon the couch of languishing: Thou makest all his bed in his sickness.
- Bible in Basic English (BBE)
- The Lord will be his support on his bed of pain: by you will all his grief be turned to strength.
- Darby Translation (DBY)
- Jehovah will sustain him upon the bed of languishing: thou turnest all his bed in his sickness.
- Webster's Bible (WBS)
- The LORD will strengthen him upon the bed of languishing: thou wilt make all his bed in his sickness.
- Young's Literal Translation (YLT)
- Jehovah supporteth on a couch of sickness, All his bed Thou hast turned in his weakness.
Read in context
- 1బీదలను కటాక్షించువాడు ధన్యుడు ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును.
- 2యెహోవా వానిని కాపాడి బ్రదికించును భూమిమీద వాడు ధన్యుడగును వానిశత్రువుల యిచ్ఛకు నీవు వానిని అప్పగింపవు.
- 3రోగశయ్యమీద యెహోవా వానిని ఆదరించును రోగము కలుగగా నీవే వానిని స్వస్థపరచుదువు.
- 4యెహోవా నీ దృష్టియెదుట నేను పాపము చేసియున్నాను నన్ను కరుణింపుము నా ప్రాణమును స్వస్థపరచుము అని మనవి చేసియున్నాను.
- 5అయితే నా శత్రువులు నా విషయమై చెడ్డమాట లాడుచున్నారు వాడు ఎప్పుడు చచ్చును? వాని పేరు ఎప్పుడు మాసిపోవును? అని చెప్పుకొనుచున్నారు.
Cross references
- 2 Kings 20:5–6 2 రాజులు 20:5–6నీవు తిరిగి నా ప్రజలకు అధిపతియైన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుమునీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చున దేమనగానీవు కన్నీళ్లు విడుచుట చూచితిని; నీ ప్రార్థన నేనంగీకరించి యున్నాను; నేను నిన్ను బాగుచేసెదను; మూడవ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కి పోవుదువు. ఇంక పదునయిదు సంవత్సరముల ఆయుష్యము నీకిచ్చెదను; మరియు నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును ఈ పట్టణమును నేను కాపాడుచు, నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండ నేను విడిపించెదను.
- Psalm 73:26 కీర్తనలు 73:26నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గమును స్వాస్థ్యమునై యున్నాడు.
- Philippians 2:26–27 ఫిలిప్పీయులకు 2:26–27అతడురోగి యాయెనని మీరు వింటిరి గనుక అతడు మిమ్మునందరిని చూడ మిగుల అపేక్షగలవాడై విచారపడుచుండెను. నిజముగా అతడు రోగియై చావునకు సిద్ధమై యుండెను గాని దేవుడతనిని కనికరించెను; అతనిమాత్రమే గాక నాకు దుఃఖముమీద దుఃఖము కలుగకుండుటకై నన్నును కనికరించెను.
- 2 Corinthians 4:16–17 2 కొరింథీయులకు 4:16–17కావున మేము అధైర్యపడము; మా బాహ్య పురుషుడు కృశించుచున్నను, ఆంతర్యపురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. మేము దృశ్యమైనవాటిని చూడక అదృశ్యమైనవాటినే నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మాకొరకు అంత కంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగ జేయుచున్నది.
- 2 Kings 1:16 2 రాజులు 1:16అతడు వచ్చి రాజును చూచివిచారణచేయుటకు ఇశ్రాయేలు వారిమధ్య దేవుడన్న వాడు లేడనుకొని నీవు ఎక్రోను దేవతయగు బయల్జెబూబునొద్ద విచారణచేయుటకై దూతలను పంపితివే; నీవెక్కిన మంచముమీదనుండి దిగి రాకుండ నిశ్చయముగా నీవు మరణమవుదువు అని చెప్పెను.
- 2 Kings 1:6 2 రాజులు 1:6వారుఒక మనుష్యుడు మాకు ఎదురుపడిమిమ్మును పంపిన రాజునొద్దకు తిరిగిపోయి అతనికి ఈ సంగతి తెలియ జేయుడియెహోవా సెలవిచ్చునదేమనగాఇశ్రాయేలులో దేవుడన్నవాడు లేడనుకొని ఎక్రోను దేవతయగు బయల్జె బూబునొద్ద విచారణచేయుటకు నీవు దూతలను పంపు చున్నావే; నీవెక్కిన మంచముమీద నుండి దిగి రాకుండ నిశ్చయముగా నీవు మరణమవుదువు అని అతడు పలికెనని వారు చెప్పగా