Psalms · chapter 46 · verse 6
Psalm 46:6 in Telugu
జనములు ఘోషించుచున్నవి రాజ్యములు కదలు చున్నవి ఆయన తన కంఠధ్వని వినిపించగా భూమి కరగిపోవుచున్నది.
Janamulu ghoshinchuchunnavi raajyamulu kadalu chunnavi aayana tana kanthadhvani vinipinchagaa bhoomi karagipovuchunnadi.
Psalm 46:6 in English
- King James Version (KJV)
- The heathen raged, the kingdoms were moved: he uttered his voice, the earth melted.
- World English Bible (WEB)
- The nations raged. The kingdoms were moved. He lifted his voice and the earth melted.
- American Standard Version (ASV)
- The nations raged, the kingdoms were moved: He uttered his voice, the earth melted.
- Bible in Basic English (BBE)
- The nations were angry, the kingdoms were moved; at the sound of his voice the earth became like wax.
- Darby Translation (DBY)
- The nations raged, the kingdoms were moved; he uttered his voice, the earth melted.
- Webster's Bible (WBS)
- The heathen raged, the kingdoms were moved: he uttered his voice, the earth melted.
- Young's Literal Translation (YLT)
- Troubled have been nations, Moved have been kingdoms, He hath given forth with His voice, earth melteth.
Read in context
- 4ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నవి.
- 5దేవుడు ఆ పట్టణములో నున్నాడు దానికి చలనము లేదు అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు.
- 6జనములు ఘోషించుచున్నవి రాజ్యములు కదలు చున్నవి ఆయన తన కంఠధ్వని వినిపించగా భూమి కరగిపోవుచున్నది.
- 7సైన్యముల కధిపతియగు యెహోవా మనకు తోడై యున్నాడు. యాకోబుయొక్క దేవుడు మనకు ఆశ్రయమై యున్నాడు.
- 8యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడుడి. ఆయనే భూమిమీద నాశనములు కలుగజేయువాడు.
Cross references
- Amos 9:5 ఆమోసు 9:5ఆయన సైన్యములకధిపతి యగు యెహోవా; ఆయన భూమిని మొత్తగా అది కరిగి పోవును, అందులోని నివాసులందరును ప్రలాపింతురు, నైలునదివలెనే అదియంతయు ఉబుకుచుండును, ఐగుప్తు దేశపు నైలునదివలెనే అది అణగిపోవును.
- Psalm 18:13 కీర్తనలు 18:13యెహోవా ఆకాశమందు గర్జనచేసెను సర్వోన్నతుడు తన ఉరుముధ్వని పుట్టించెను వడగండ్లును మండుచున్న నిప్పులును రాలెను.
- Nahum 1:5 నహూము 1:5ఆయనకు భయపడి పర్వతములు కంపించును, కొండలు కరిగిపోవును, ఆయన యెదుట భూమి కంపించును, లోకమును అందలి నివాసులందరును వణకుదురు.
- Habakkuk 3:5–6 హబక్కూకు 3:5–6ఆయనకు ముందుగా తెగుళ్లు నడుచుచున్నవి ఆయన పాదముల వెంట అగ్ని మెరుపులు వచ్చు చున్నవి ఆయన నిలువబడగా భూమి కంపించును ఆయన చూడగా జనులందరు ఇటు అటు తొలుగు దురు ఆదికాల పర్వతములు బద్దలైపోవును పురాతన గిరులు అణగును పూర్వకాలము మొదలుకొని ఆయన ఈలాగు జరి గించువాడు.
- Micah 1:4 మీకా 1:4ఆయన నడువగా అగ్నికి మైనము కరుగునట్లు పర్వతములు కరిగి పోవును, లోయలు విడిపోవును, వాటముమీద పోసిన నీరు పారునట్లు అవి కరిగి పారును,
- 2 Peter 3:10–12 2 పేతురు 3:10–12అయితే ప్రభువు దినము దొంగవచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించి పోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దానిమీదనున్న కృత్యములును కాలిపోవును ఇవన్నియు ఇట్లు లయమై పోవునవి గనుక, ఆకాశములు రవులుకొని లయమైపోవు నట్టియు, పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోవు నట్టియు, దేవుని దినపు రాకడకొరకు కనిపెట్టుచు, దానిని ఆశతో అపేక్షించుచు, మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్తగలవారై యుండవలెను.
- Joel 2:11 యోవేలు 2:11యెహోవా తన సైన్యమును నడిపించుచు ఉరుమువలె గర్జించుచున్నాడు ఆయన దండు బహు గొప్పదైయున్నది ఆయన ఆజ్ఞను నెరవేర్చునది బలముగలది యెహోవా దినము బహు భయంకరము, దానికి తాళ గలవాడెవడు?
- Amos 9:13 ఆమోసు 9:13రాబోవు దినములలో కోయువారు దున్నువారి వెంటనే వత్తురు; విత్తనము చల్లు వారి వెంటనే ద్రాక్షపండ్లు త్రొక్కువారు వత్తురు; పర్వత ములనుండి మధురమైన ద్రాక్షారసము స్రవించును, కొండ లన్ని రసధారలగును; ఇదే యెహోవా వాక్కు.
- Psalm 2:1–4 కీర్తనలు 2:1–4అన్యజనులు ఏల అల్లరి రేపుచున్నారు? జనములు ఏల వ్యర్థమైనదానిని తలంచుచున్నవి? మనము వారి కట్లు తెంపుదము రండివారి పాశములను మనయొద్ద నుండి పారవేయుదము రండి అని చెప్పుకొనుచు భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికిని విరోధముగా నిలువబడుచున్నారు ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు ప్రభువు వారినిచూచి అపహసించుచున్నాడు
- Isaiah 37:21–36 యెషయా 37:21–36అంతట ఆమోజు కుమారుడైన యెషయా హిజ్కియా యొద్దకు ఈ వర్తమానము పంపెనుఇశ్రాయేలీయుల దేవు డగు యెహోవా సెలవిచ్చునదేమనగా అష్షూరు రాజైన సన్హెరీబు విషయమందు నీవు నా యెదుట ప్రార్థన చేసితివే. అతనిగూర్చి యెహోవా సెలవిచ్చుమాట ఏదనగా సీయోను కుమారియైన కన్యక నిన్ను దూషణ చేయు చున్నది ఆమె నిన్ను అపహాస్యము చేయుచున్నది యెరూషలేము కుమారి నిన్ను చూచి తల ఊచు చున్నది. నీవు ఎవరిని తిరస్కరించితివి? ఎవరిని దూషించితివి? నీవు గర్వించి యెవరిని భయపెట్టితివి? ఇశ్రాయేలీయుల పరిశుద్ధదేవునినే గదా? నీ దూతలచేత యెహోవాను తిరస్కరించి నీ వీలాగు పలికితివి నా రథముల సముదాయముతో నేను పర్వత శిఖర ముల మీదికిని లెబానోను పార్శ్వములకును ఎక్కియున్నాను ఎత్తుగల దాని దేవదారు వృక్షములను శ్రేష్ఠమైన సరళవృక్షములను నరికివేసియున్నాను వాని దూరపు సరిహద్దులలోనున్న సత్రములలోనికిని కర్మెలు ఫలవంతములగు క్షేత్రమైన అడవి లోనికిని ప్రవేశించియున్నాను. నేను త్రవ్వి నీళ్లు పానముచేసియున్నాను నా అరకాలిచేత నేను దిట్టమైన స్థలముల నదుల నన్నిటిని ఎండిపోచేసియున్నాను నేనే పూర్వమందే దీని కలుగజేసితిననియు పురాతన కాలమందే దీని నిర్ణయించితిననియు నీకు వినబడలేదా? ప్రాకారములుగల పట్టణములను నీవు పాడు దిబ్బలుగా చేయుట నా వలననే సంభవించినది. కాబట్టి వాటి కాపురస్థులు బలహీనులై జడిసిరి. విభ్రాంతినొంది పొలములోని గడ్డివలెను కాడవేయని చేలవలెను అయిరి. నీవు కూర్చుండుటయు బయలువెళ్లుటయు లోపలికి వచ్చుటయు నామీదవేయు రంకెలును నాకు తెలిసేయున్నవి. నామీద నీవు వేయు రంకెలును నీవు చేసిన కలహమును నా చెవులలో జొచ్చెను నా గాలము నీ ముక్కునకు తగిలించెదను నా కళ్లెము నీ నోటిలో పెట్టి నిన్ను మళ్లించెదను నీవు వచ్చిన మార్గముననే నిన్ను మళ్లించెదను. మరియు యెషయా చెప్పినదేమనగాహిజ్కియా, నీకిదే సూచనయగును. ఈ సంవత్సరమందు దాని అంతట అదే పండు ధాన్యమును, రెండవ సంవత్సరమందు దానినుండి కలుగు ధాన్యమును మీరు భుజింతురు. మూడవ సంవత్సరమున మీరు విత్తనము విత్తి చేలు కోయుదురు; ద్రాక్షతోటలు నాటి వాటిఫలము ననుభవించుదురు. యూదా వంశములో తప్పించు కొనిన శేషము ఇంకను క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించును. శేషించు వారు యెరూషలేములో నుండి బయలుదేరుదురు, తప్పించు కొనినవారు సీయోను కొండలోనుండి బయలుదేరుదురు; సైన్య ములకధిపతియగు యెహోవా ఆసక్తి దీని నెర వేర్చును. కాబట్టి అష్షూరురాజునుగూర్చి యెహోవా సెలవిచ్చున దేమనగా అతడు ఈ పట్టణములోనికి రాడు; దానిమీద ఒక బాణమైన ప్రయోగింపడు; ఒక కేడెము నైన దానికి కనుపరచడు; దానియెదుట ముట్టడి దిబ్బ కట్టడు. ఈ పట్టణము లోపలికి రాక తాను వచ్చిన మార్గముననే అతడు తిరిగి పోవును; ఇదే యెహోవా వాక్కు. నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును. అంతట యెహోవా దూత బయలుదేరి అష్షూరువారి దండు పేటలో లక్ష యెనుబదియైదువేలమందిని మొత్తెను; ఉదయమున జనులు లేవగా వారందరును మృతకళేబరములుగా ఉండిరి.
- Joshua 2:24 యెహోషువ 2:24మరియు వారుఆ దేశ మంతయు యెహోవా మన చేతికి అప్పగించుచున్నాడు, మన భయముచేత ఆ దేశనివాసులందరికి ధైర్యము చెడి యున్నదని యెహోషువతో ననిరి.
- 2 Chronicles 20:20–24 2 దినవృత్తాంతములు 20:20–24అంతట వారు ఉదయముననే లేచి తెకోవ అరణ్యమునకు పోయిరి; వారు పోవుచుండగా యెహోషాపాతు నిలువబడియూదావారలారా, యెరూషలేము కాపురస్థులారా, నా మాట వినుడి; మీ దేవుడైన యెహో వాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు; ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులగుదురనిచెప్పెను. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరచి, వారు పరిశుద్ధాలంకారములు ధరించి సైన్యము ముందర నడచుచుయెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించెను. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదావారిమీదికి వచ్చిన అమ్మోనీయులమీదను మోయాబీయుల మీదను శేయీరు మన్యవాసులమీదను మాటుగాండ్రను పెట్టెను గనుక వారు హతులైరి. అమ్మోనీయులును మోయాబీయులును శేయీరు మన్యనివాసులను బొత్తిగా చంపి నిర్మూలము చేయవలెనని పొంచియుండి వారిమీద పడిరి; వారు శేయీరు కాపురస్థులను కడముట్టించిన తరువాత తమలో ఒకరి నొకరు చంపుకొనుటకు మొదలుపెట్టిరి. యూదా వారు అరణ్యమందున్న కాపరుల దుర్గము దగ్గరకు వచ్చి సైన్యముతట్టు చూడగా వారు శవములై నేలపడియుండిరి, ఒకడును తప్పించుకొనలేదు.