Psalms · chapter 56 · verse 11
Psalm 56:11 in Telugu
నేను దేవునియందు నమ్మికయుంచి యున్నాను నేను భయపడను నరులు నన్నేమి చేయగలరు?
Nenu devuniyandu nammikayunchi yunnaanu nenu bhayapadanu narulu nannemi cheyagalaru?
Psalm 56:11 in English
- King James Version (KJV)
- In God have I put my trust: I will not be afraid what man can do unto me.
- World English Bible (WEB)
- I have put my trust in God. I will not be afraid. What can man do to me?
- American Standard Version (ASV)
- In God have I put my trust, I will not be afraid; What can man do unto me?
- Bible in Basic English (BBE)
- In God have I put my hope, I will have no fear of what man may do to me.
- Darby Translation (DBY)
- In God have I put my confidence: I will not fear; what can man do unto me?
- Webster's Bible (WBS)
- In God have I put my trust: I will not be afraid what man can do to me.
- Young's Literal Translation (YLT)
- In God I trusted, I fear not what man doth to me,
Read in context
- 9నేను మొఱ్ఱపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు. దేవుడు నా పక్షమున నున్నాడని నాకు తెలియును.
- 10దేవునిబట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను యెహోవానుబట్టి ఆయన వాక్యమును కీర్తించెదను
- 11నేను దేవునియందు నమ్మికయుంచి యున్నాను నేను భయపడను నరులు నన్నేమి చేయగలరు?
- 12దేవా, నీవు మరణములోనుండి నా ప్రాణమును తప్పించియున్నావు నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించు నట్లు జారిపడకుండ నీవు నా పాదములను తప్పించి యున్నావు.
- 13నేను నీకు మ్రొక్కుకొని యున్నాను నేను నీకు స్తుతియాగముల నర్పించెదను.
Cross references
- Psalm 27:1 కీర్తనలు 27:1యెహోవా నాకు వెలుగును రక్షణయునైయున్నాడు, నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతును?
- Isaiah 51:12–13 యెషయా 51:12–13నేను నేనే మిమ్ము నోదార్చువాడను చనిపోవు నరునికి తృణమాత్రుడగు నరునికి ఎందుకు భయపడుదువు? బాధపెట్టువాడు నాశనము చేయుటకు సిద్ధపడునప్పుడు వాని క్రోధమునుబట్టి నిత్యము భయపడుచు, ఆకాశములను వ్యాపింపజేసి భూమి పునాదులనువేసిన యెహోవాను నీ సృష్టికర్తయైన యెహోవాను మరచుదువా? బాధపెట్టువాని క్రోధము ఏమాయెను?
- Isaiah 51:7–8 యెషయా 51:7–8నీతి అనుసరించువారలారా, నా మాట వినుడి నా బోధను హృదయమందుంచుకొన్న జనులారా, ఆలకించుడి మనుష్యులు పెట్టు నిందకు భయపడకుడి వారి దూషణ మాటలకు దిగులుపడకుడి. వస్త్రమును కొరికివేయునట్లు చిమ్మట వారిని కొరికి వేయును బొద్దీక గొఱ్ఱెబొచ్చును కొరికివేయునట్లు వారిని కొరికివేయును అయితే నా నీతి నిత్యము నిలుచును నా రక్షణ తరతరములుండును.
- Psalm 112:7–8 కీర్తనలు 112:7–8వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిర ముగా నుండును వాడు దుర్వార్తకు జడియడు. వాని మనస్సు స్థిరముగానుండును తన శత్రువుల విషయమైన తన కోరిక నెరవేరు వరకు వాడు భయపడడు.