Psalms · chapter 112 · verse 7
Psalm 112:7 in Telugu
వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిర ముగా నుండును వాడు దుర్వార్తకు జడియడు.
Vaani hrudayamu yehovaanu aashrayinchi sthira mugaa nundunu vaadu durvaartaku jadiyadu.
Psalm 112:7 in English
- King James Version (KJV)
- He shall not be afraid of evil tidings: his heart is fixed, trusting in the LORD.
- World English Bible (WEB)
- He will not be afraid of evil news. His heart is steadfast, trusting in the LORD.
- American Standard Version (ASV)
- He shall not be afraid of evil tidings: His heart is fixed, trusting in Jehovah.
- Bible in Basic English (BBE)
- He will have no fear of evil news; his heart is fixed, for his hope is in the Lord.
- Darby Translation (DBY)
- He shall not be afraid of evil tidings; his heart is fixed confiding in Jehovah;
- Webster's Bible (WBS)
- He shall not be afraid of evil tidings: his heart is fixed, trusting in the LORD.
- Young's Literal Translation (YLT)
- Of an evil report he is not afraid, Prepared is His heart, confident in Jehovah.
Read in context
- 5దయాళులును అప్పిచ్చువారును భాగ్యవంతులు న్యాయవిమర్శలో వారి వ్యాజ్యెము గెలుచును
- 6అట్టివారు ఎప్పుడును కదలింపబడరు నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో నుందురు.
- 7వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిర ముగా నుండును వాడు దుర్వార్తకు జడియడు.
- 8వాని మనస్సు స్థిరముగానుండును తన శత్రువుల విషయమైన తన కోరిక నెరవేరు వరకు వాడు భయపడడు.
- 9వాడు దాతృత్వము కలిగి బీదలకిచ్చును వాని నీతి నిత్యము నిలుచును వాని కొమ్ము ఘనత నొంది హెచ్చింపబడును.
Cross references
- Isaiah 26:3–4 యెషయా 26:3–4ఎవనిమనస్సు నీమీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణశాంతిగలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీయందు విశ్వాసముంచి యున్నాడు. యెహోవా యెహోవాయే నిత్యాశ్రయదుర్గము యుగయుగములు యెహోవాను నమ్ముకొనుడి.
- Proverbs 1:33 సామెతలు 1:33నా ఉపదేశము నంగీకరించువాడు సురక్షితముగా నివసించును వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా నుండును.
- Psalm 57:7 కీర్తనలు 57:7నా హృదయము నిబ్బరముగా నున్నది దేవా, నా హృదయము నిబ్బరముగా నున్నది నేను పాడుచు స్తుతిగానము చేసెదను.
- Psalm 118:6 కీర్తనలు 118:6యెహోవా నా పక్షమున నున్నాడు నేను భయ పడను నరులు నాకేమి చేయగలరు?
- John 14:1 యోహాను 14:1మీ హృదయమును కలవరపడనియ్యకుడి; దేవుని యందు విశ్వాసముంచుచున్నారు నాయందును విశ్వాస ముంచుడి.
- Proverbs 3:25–26 సామెతలు 3:25–26ఆకస్మికముగా భయము కలుగునప్పుడు దుర్మార్గులకు నాశనము వచ్చునప్పుడు నీవు భయపడవద్దు యెహోవా నీకు ఆధారమగును నీ కాలు చిక్కుబడకుండునట్లు ఆయన నిన్ను కాపాడును.
- Psalm 34:4 కీర్తనలు 34:4నేను యెహోవాయొద్ద విచారణచేయగా ఆయన నాకుత్తరమిచ్చెను నాకు కలిగిన భయములన్నిటిలోనుండి ఆయన నన్ను తప్పించెను.
- Psalm 56:3–4 కీర్తనలు 56:3–4నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. దేవునిబట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను దేవునియందు నమ్మికయుంచి యున్నాను నేను భయపడను శరీరధారులు నన్నేమి చేయగలరు?
- Psalm 64:10 కీర్తనలు 64:10నీతిమంతులు యెహోవానుబట్టి సంతోషించుచు ఆయన శరణుజొచ్చెదరు యథార్థహృదయులందరు అతిశయిల్లుదురు.
- Psalm 118:8–9 కీర్తనలు 118:8–9మనుష్యులను నమ్ముకొనుటకంటె యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకొనుటకంటె యెహోవాను ఆశ్రయించుట మేలు.
- Psalm 27:1–3 కీర్తనలు 27:1–3యెహోవా నాకు వెలుగును రక్షణయునైయున్నాడు, నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతును? నా శరీరమాంసము తినుటకై దుష్టులు నామీదికి వచ్చినప్పుడు నన్ను బాధించు శత్రువులు నామీదికి వచ్చినప్పుడు వారు తొట్రిల్లికూలిరి నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు నామీదికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడువకుందును.
- Psalm 62:8 కీర్తనలు 62:8జనులారా, యెల్లప్పుడు ఆయనయందు నమ్మిక యుంచుడి ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి దేవుడు మనకు ఆశ్రయము. (సెలా. )