Psalms · chapter 60 · verse 10
Psalm 60:10 in Telugu
దేవా, నీవు మమ్ము విడనాడియున్నావు గదా? దేవా, మా సేనలతోకూడ నీవు బయలుదేరుట మాని యున్నావు గదా?
Devaa, neevu mammu vidanaadiyunnaavu gadaa? Devaa, maa senalatokooda neevu bayaluderuta maani yunnaavu gadaa?
Psalm 60:10 in English
- King James Version (KJV)
- [Wilt] not thou, O God, [which] hadst cast us off? and [thou], O God, [which] didst not go out with our armies?
- World English Bible (WEB)
- Haven’t you, God, rejected us? You don’t go out with our armies, God.
- American Standard Version (ASV)
- Hast not thou, O God, cast us off? And thou goest not forth, O God, with our hosts.
- Bible in Basic English (BBE)
- Have not you put us away, O God? and you have not gone out with our armies.
- Darby Translation (DBY)
- [Wilt] not thou, O God, who didst cast us off? and didst not go forth, O God, with our armies?
- Webster's Bible (WBS)
- [Wilt] thou not, O God, [who] hadst cast us off? and [thou] , O God, [who] didst not go out with our armies?
- Young's Literal Translation (YLT)
- Is it not Thou, O God? hast Thou cast us off? And dost Thou not go forth, O God, with our hosts!
Read in context
- 8మోయాబు నేను కాళ్లు కడుగుకొను పళ్లెము ఎదోముమీద నా చెప్పు విసరివేయుదును ఫిలిష్తియా, నన్నుగూర్చి ఉత్సాహధ్వనిచేయుము.
- 9కోటగల పట్టణములోనికి నన్నెవడు తోడుకొని పోవును? ఎదోములోనికి నన్నెవడు నడిపించును?
- 10దేవా, నీవు మమ్ము విడనాడియున్నావు గదా? దేవా, మా సేనలతోకూడ నీవు బయలుదేరుట మాని యున్నావు గదా?
- 11మనుష్యుల సహాయము వ్యర్థము శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయుము.
- 12దేవుని వలన మేము శూరకార్యములు జరిగించెదము మా శత్రువులను అణగద్రొక్కువాడు ఆయనే.
Cross references
- Joshua 7:12 యెహోషువ 7:12కాబట్టి ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులై తమ శత్రువులయెదుట నిలువలేక తమ శత్రువుల యెదుట వెనుకకు తిరిగిరి. శాపగ్రస్తులైనవారు మీ మధ్యనుండకుండ మీరు వారిని నిర్మూలము చేసితేనే తప్ప నేను మీకు తోడైయుండను.
- Psalm 108:11 కీర్తనలు 108:11దేవా, నీవు మమ్మును విడనాడి యున్నావుగదా? దేవా, మా సేనలతోకూడ నీవు బయలుదేరుట మాని యున్నావుగదా?
- Psalm 60:1 కీర్తనలు 60:1దేవా, మమ్ము విడనాడియున్నావు మమ్ము చెదరగొట్టి యున్నావు నీవు కోపపడితివి మమ్ము మరల బాగుచేయుము.
- Deuteronomy 1:42 ద్వితీయోపదేశకాండము 1:42యెహోవా నాతో ఇట్లనెనుయుద్ధమునకు పోకుడి; నేను మీ మధ్యనుండను గనుక వెళ్లకుడి; మీరు వెళ్లినను మీ శత్రువులయెదుట హతము చేయబడుదురని వారితో చెప్పుము.
- Deuteronomy 20:4 ద్వితీయోపదేశకాండము 20:4వణకకుడి, వారి ముఖము చూచి బెదరకుడి, మీకొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మును రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే.
- Joshua 10:42 యెహోషువ 10:42ఇశ్రా యేలు దేవుడైన యెహోవా ఇశ్రాయేలీయుల పక్షముగా యుద్ధము చేయుచుండెను గనుక ఆ సమస్త రాజుల నంద రిని వారి దేశములను యెహోషువ ఒక దెబ్బతోనే పట్టు కొనెను.
- Isaiah 12:1–2 యెషయా 12:1–2ఆ దినమున మీరీలాగందురు యెహోవా, నీవు నామీద కోపపడితివి నీ కోపము చల్లారెను నిన్ను స్తుతించుచున్నాను నీవు నన్ను ఆదరించి యున్నావు. ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను యెహోవా యెహోవాయే నాకు బలము ఆయనే నా కీర్తనకాస్పదము ఆయన నాకు రక్షణాధారమాయెను
- Psalm 44:5–9 కీర్తనలు 44:5–9నీవలన మా విరోధులను అణచివేయుదుము నీ నామమువలననే, మామీదికి లేచువారిని మేము త్రొక్కి వేయుదుము. నేను నా వింటిని నమ్ముకొనను నా కత్తియు నన్ను రక్షింపజాలదు మా శత్రువుల చేతిలోనుండి మమ్మును రక్షించు వాడవు నీవే మమ్మును ద్వేషించువారిని సిగ్గుపరచువాడవు నీవే. దినమెల్ల మేము దేవునియందు అతిశయపడుచున్నాము నీ నామమునుబట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. (సెలా. ) అయితే ఇప్పుడు నీవు మమ్మును విడనాడి అవమాన పరచియున్నావు. మాసేనలతోకూడ నీవు బయలుదేరకయున్నావు.
- 1 Chronicles 10:1–14 1 దినవృత్తాంతములు 10:1–14ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధముచేయగా ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులయెదుట నిలువలేక పారిపోయి హతులై గిల్బోవ పర్వతమందు పడిరి. ఫిలిష్తీ యులు సౌలును అతని కుమారులను తరిమి సౌలు కుమారులైన యోనాతానును, అబీనాదాబును మల్కీషూవను హతముచేసిరి. యుద్ధములో సౌలు ఓడిపోవుచుండెను. అతడు అంబులు వేయువారి కంటబడి వారిచేత బహు గాయముల నొందెను. అప్పుడు సౌలుఈ సున్నతి లేని జనులు వచ్చి నాకు మానభంగము చేయకుండ నీవు నీ కత్తిదూసి నన్ను పొడిచివేయుమని తన ఆయుధములను మోయువానితోననగా, వాడు బహుగా భయపడి ఆలాగు చేయుటకు ఒప్పలేదు గనుక సౌలు తన కత్తిమీదపడెను. సౌలు చనిపోయెనని ఆయుధములను మోయువాడు తెలిసి కొని తానును కత్తిని పట్టుకొని దానిమీదపడి చచ్చెను. ఆ ప్రకారమే సౌలును అతని ముగ్గురు కుమారులును చచ్చిరి. మరియు అతని యింటి వారందరును చచ్చిరి. జనులు పారిపోయిరనియు, సౌలును అతని కుమారులును చనిపోయిరనియు, లోయలోని ఇశ్రాయేలీయులందరు తెలిసికొని తమ పట్టణములు విడిచి పారిపోగా ఫిలిష్తీయులు వచ్చి వాటిలో కాపురముండిరి. హతులైనవారిని దోచుకొనుటకై ఫిలిష్తీయులు మరునాడు వచ్చినప్పుడు వారు సౌలును అతని కుమారులును గిల్బోవ పర్వతమందు చచ్చి పడియుండుట చూచి అతని కవచమును దోచుకొని, అతని తలను అతని ఆయుధ ములను తీసికొని పోయి ఫిలిష్తీయుల దేశమంతట వాటిని త్రిప్పి, జరిగినదానిని విగ్రహములకును జనులకును చాటించిరి. వారు అతని ఆయుధములను తమ దేవుని గుడిలో పెట్టి అతని తలను దాగోను గుడిలో తగిలించిరి. ఫిలిష్తీయులు సౌలునకు చేసినదంతయు యాబేష్గిలాదువారు విని నప్పుడు పరాక్రమశాలులైనవారందరును లేచిపోయి, సౌలు శవమును అతని కుమారుల శవములను తీసికొని యాబేషునకువచ్చి వారి యెముకలను యాబేషునందలి సిందూరవృక్షము క్రింద పాతిపెట్టి యేడుదినములు ఉప వాసముండిరి. ఈ ప్రకారము యెహోవా ఆజ్ఞగైకొనక ఆయన దృష్టి యెదుట ద్రోహము చేసినందుకును, యెహోవాయొద్ద విచారణచేయక కర్ణపిశాచముల యొద్ద విచారణచేయుదానిని వెదకినందుకును సౌలు హతమాయెను. అందునిమిత్తము యెహోవా అతనికి మరణశిక్ష విధించి రాజ్యమును యెష్షయి కుమారుడైన దావీదు వశము చేసెను.
- Psalm 20:7 కీర్తనలు 20:7కొందరు రథములను బట్టియు కొందరు గుఱ్ఱములను బట్టియు అతిశయపడుదురు మనమైతే మన దేవుడైన యెహోవా నామమునుబట్టి అతిశయపడుదము.
- Jeremiah 33:24–26 యిర్మీయా 33:24–26తాను ఏర్పరచుకొనిన రెండు కుటుంబములను యెహోవా విసర్జించెననియు, నా ప్రజలు ఇకమీదట తమ యెదుట జనముగా ఉండరనియు వారిని తృణీకరించుచు ఈ జనులు చెప్పుకొను మాట నీకు వినబడుచున్నది గదా. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు పగటినిగూర్చియు రాత్రినిగూర్చియు నేను చేసిన నిబంధన నిలకడగా ఉండని యెడల భూమ్యా కాశములనుగూర్చిన విధులను నియమించువాడను నేను కానియెడల, అబ్రాహాము ఇస్సాకు యాకోబుల సంతానమును ఏలుటకు అతని సంతాన సంబంధియైన యేలికను ఏర్పరచుకొనక నేను యాకోబు సంతానపువాడగు నా సేవకుడైన దావీదు సంతానమును విసర్జింతును. నిశ్చయ ముగా నేను వారియెడల జాలిపడి చెరలోనుండి వారిని రప్పించెదను.
- 1 Samuel 4:6–7 1 సమూయేలు 4:6–7ఫిలిష్తీయులు ఆ కేకలు విని, హెబ్రీయుల దండులో ఈ గొప్ప కేకలధ్వని యేమని అడిగి, యెహోవా నిబంధన మందసము దండులోనికి వచ్చెనని తెలిసికొని జడిసి దేవుడు దండులోనికి వచ్చెనని అనుకొని అయ్యో మనకు శ్రమ, ఇంతకుమునుపు వారీలాగు సంభ్రమింపలేదు,