Psalms · chapter 68 · verse 11
Psalm 68:11 in Telugu
ప్రభువు మాట సెలవిచ్చుచున్నాడు దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు.
Prabhuvu maata selavichchuchunnaadu daanini prakatinchu streelu goppa sainyamugaa unnaaru.
Psalm 68:11 in English
- King James Version (KJV)
- The Lord gave the word: great [was] the company of those that published [it].
- World English Bible (WEB)
- The Lord announced the word. The ones who proclaim it are a great company.
- American Standard Version (ASV)
- The Lord giveth the word: The women that publish the tidings are a great host.
- Bible in Basic English (BBE)
- The Lord gives the word; great is the number of the women who make it public.
- Darby Translation (DBY)
- The Lord gives the word: great the host of the publishers.
- Webster's Bible (WBS)
- The LORD gave the word: great [was] the company of those that published [it] .
- Young's Literal Translation (YLT)
- The Lord doth give the saying, The female proclaimers [are] a numerous host.
Read in context
- 9దేవా, నీ స్వాస్థ్యముమీద నీవు వర్షము సమృద్ధిగా కురిపించితివి అది అలసియుండగా నీవు దానిని బలపరచితివి.
- 10నీ సమూహము దానిలో నివసించును దేవా, నీ అనుగ్రహముచేత దీనులకు సదుపాయము కలుగజేసితివి.
- 11ప్రభువు మాట సెలవిచ్చుచున్నాడు దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు.
- 12సేనల రాజులు పారిపోయెదరు పారిపోయెదరు ఇంట నిలిచినది దోపుడుసొమ్ము పంచుకొనును.
- 13గొఱ్ఱెల దొడ్లమధ్యను మీరు పండుకొనగా గువ్వల రెక్కలు వెండితో కప్పబడినట్లున్నది వాటి యీకెల రెక్కలు పచ్చని బంగారుతో కప్ప బడినట్టున్నది.
Cross references
- Exodus 15:20 నిర్గమకాండము 15:20మరియు అహరోను సహోదరియు ప్రవక్త్రియునగు మిర్యాము తంబురను చేత పట్టుకొనెను. స్త్రీలందరు తంబురలతోను నాట్యములతోను ఆమె వెంబడి వెళ్లగా
- Psalm 40:3 కీర్తనలు 40:3తనకు స్తోత్రరూపమగు క్రొత్తగీతమును మన దేవుడు నా నోట నుంచెను. అనేకులు దాని చూచి భయభక్తులుగలిగి యెహోవా యందు నమ్మికయుంచెదరు.
- Psalm 68:25 కీర్తనలు 68:25కీర్తనలు పాడువారు ముందర నడచిరి. తంతివాద్యములు వాయించువారు వెనుక వచ్చెదరు.
- Exodus 17:9–16 నిర్గమకాండము 17:9–16మోషే యెహోషువతోమనకొరకు మనుష్యులను ఏర్పరచి వారిని తీసికొని బయలువెళ్లి అమాలేకీయులతో యుద్ధముచేయుము; రేపు నేను దేవుని కఱ్ఱను చేతపట్టుకొని ఆ కొండ శిఖరముమీద నిలిచెదననెను. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను; మోషే అహరోను, హూరు అనువారు ఆ కొండ శిఖర మెక్కిరి మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి; మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి, మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసికొని వచ్చి అతడు దానిమీద కూర్చుండుటకై దానివేసిరి. అహరోను హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించువరకు నిలుకడగా ఉండెను. అట్లు యెహోషువ కత్తివాడిచేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను. అప్పుడు యెహోవా మోషేతో నిట్లనెనునేను అమాలేకీయుల పేరు ఆకాశముక్రింద నుండకుండ బొత్తిగా తుడిచి వేయుదును గనుక జ్ఞాపకార్థముగా గ్రంధములో దీని వ్రాసి యెహోషువకు వినిపించుము. తరువాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సీ అని పేరు పెట్టి అమాలేకీయులు తమచేతిని యెహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి గనుక యెహోవాకు అమాలేకీయులతో తరతరములవరకు యుద్ధమనెను.
- Exodus 14:15 నిర్గమకాండము 14:15అంతలో యెహోవా మోషేతో - నీవేల నాకు మొఱ పెట్టుచున్నావు? సాగిపోవుడి అని ఇశ్రాయేలీయులతో చెప్పుము.
- Judges 4:6–31 న్యాయాధిపతులు 4:6–31ఆమె నఫ్తాలి కెదెషులోనుండి అబీనోయము కుమారుడైన బారాకును పిలువనంపించి అతనితో ఇట్లనెనునీవువెళ్లి నఫ్తాలీయుల లోను జెబూలూనీయులలోను పదివేలమంది మనుష్యులను తాబోరు కొండయొద్దకు రప్పించుము; నేను నీ దగ్గరకు యాబీను సేనాధిపతియైన సీసెరాను అతని రథములను అతని సైన్యమను కీషోను ఏటియొద్దకు కూర్చి నీ చేతికి అత నిని అప్పగించెదనని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చియుండలేదా? అని దెబోరా చెప్పగా బారాకు నీవు నాతోకూడ వచ్చిన యెడల నేను వెళ్లెదను గాని నీవు నాతో కూడ రాని యెడల నేను వెళ్లనని ఆమెతో చెప్పెను. అప్పుడు ఆమెనీతో నేను అగత్యముగా వచ్చెదను; అయితే నీవు చేయు ప్రయాణమువలన నీకు ఘనతకలుగదు, యెహోవా ఒక స్త్రీచేతికి సీసెరాను అప్పగించునని చెప్పి తాను లేచి బారాకుతో కూడ కెదెషు నకు వెళ్లెను. బారాకు జెబూలూనీయులను నఫ్తాలీయు లను కెదెషు నకు పిలిపించినప్పుడు పదివేలమంది మనుష్యులు అతనివెంట వెళ్లిరి; దెబోరాయు అతనితోకూడ పోయెను. అంతకులోగా కయీనీయుడైన హెబెరు మోషే మామ యైన హోబాబు సంతతివారైన కయీనీయులనుండి వేరు పడి కెదెషునొద్దనున్న జయనన్నీములోని మస్తకివృక్షము నొద్ద తన గుడారమును వేసికొనియుండెను. అబీనో యము కుమారుడైన బారాకు తాబోరుకొండమీదికిపోయె నని సీసెరాకు తెలుపబడినప్పుడు సీసెరా తన రథములన్ని టిని తన తొమ్మిదివందల ఇనుప రథములను అన్యుల హరో షెతునుండి కీషోను వాగువరకు తన పక్షముగా నున్న సమస్త జనమును పిలిపింపగా దెబోరాలెమ్ము, యెహోవా సీసెరాను నీ చేతికి అప్పగించిన దినము ఇదే, యెహోవా నీకు ముందుగా బయలుదేరునుగదా అని బారాకుతో చెప్పినప్పుడు, బారాకు ఆ పదివేలమంది మనుష్యులను వెంటబెట్టుకొని తాబోరు కొండ మీదినుండి దిగి వచ్చెను. బారాకు వారిని హతము చేయునట్లు యెహోవా సీసెరాను అతని రథములన్నిటిని అతని సర్వ సేనను కలవరపరచగా సీసెరా తన రథము దిగి కాలినడకను పారిపోయెను. బారాకు ఆ రథములను సేనను అన్యుల హరోషెతువరకు తరుమగా సీసెరాయొక్క సర్వసేనయు కత్తివాత కూలెను, ఒక్కడైనను మిగిలియుండలేదు హాసోరురాజైన యాబీనుకును కయీనీయుడైన హెబెరు వంశస్థులకును సమాధానము కలిగియుండెను గనుక సీసెరా కాలినడకను కయీనీయుడగు హెబెరు భార్యయైన యాయేలు గుడారమునకు పారిపోయెను. అప్పుడు యాయేలు సీసెరాను ఎదుర్కొన బోయి అతనిని చూచి నా యేలినవాడా నాతట్టు తిరుగుము, తిరుగుము భయ పడకుమని చెప్పినందున అతడు ఆమె గుడారమును జొచ్చెను. ఆమె గొంగళితో అతని కప్పగా అతడుదప్పికొనియున్నాను, దయచేసి దాహమునకు కొంచెము నీళ్లిమ్మని ఆమెనడిగెను. ఆమె ఒక పాలబుడ్డి విప్పి అతనికి దాహమిచ్చి అతని కప్పుచుండగా అతడుగుడారపు ద్వారమున నిలిచి యుండుము; ఎవడేకాని లోపలికివచ్చియిక్కడ నెవడైననున్నాడా అని నిన్నడిగినయెడల నీవుఎవడును లేడని చెప్పవలెననెను. పిమ్మట హెబెరు భార్యయైన యాయేలు గుడారపు మేకు తీసికొని సుత్తె చేతపట్టు కొని అతనియొద్దకు మెల్లగా వచ్చి అతనికి అలసట చేత గాఢనిద్ర కలిగియుండగా నేలకు దిగునట్లు ఆ మేకును అతని కణతలలో దిగగొట్టగా అతడు చచ్చెను బారాకు సీసెరాను తరుముచుండగా యాయేలు అతనిని ఎదుర్కొన వచ్చిరమ్ము, నీవు వెదకుచున్న మనుష్యుని నీకు చూపిం చెదననగా అతడు వచ్చినప్పుడు సీసెరా చచ్చి పడి యుండెను, ఆ మేకు అతని కణతలలో నుండెను. ఆ దినమున దేవుడు ఇశ్రాయేలీయులయెదుట కనాను రాజైన యాబీనును అణచెను. తరువాత వారు కనాను రాజైన యాబీనును సంహరించువరకు ఇశ్రాయేలీయుల చెయ్యి కనాను రాజైన యాబీనుకు విరోధముగా అంతకంతకు హెచ్చుచువచ్చెను.
- Revelation 19:13 ప్రకటన 19:13రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని యుండెను. మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడియున్నది.
- Ephesians 4:11 ఎఫెసీయులకు 4:11మనమందరము విశ్వాసవిషయములోను దేవుని కుమారునిగూర్చిన జ్ఞానవిషయములోను ఏకత్వముపొంది సంపూర్ణపురుషులమగువరకు,
- 1 Samuel 18:6 1 సమూయేలు 18:6దావీదు ఫిలిష్తీయుని హతముచేసి తిరిగి వచ్చినప్పుడు, స్త్రీలు ఇశ్రాయేలీయుల ఊళ్లన్నిటిలోనుండి తంబురల తోను సంభ్రమముతోను వాద్యములతోను పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొనుటకై వచ్చిరి