Psalms · chapter 70 · verse 4
Psalm 70:4 in Telugu
నిన్ను వెదకువారందరు నిన్నుగూర్చి ఉత్సహించి సంతోషించుదురు గాక. నీ రక్షణను ప్రేమించువారందరు దేవుడు మహిమపరచబడును గాక అని నిత్యము చెప్పుకొందురు గాక.
Ninnu vedakuvaarandaru ninnugoorchi utsahinchi santoshinchuduru gaaka. Nee rakshananu preminchuvaarandaru devudu mahimaparachabadunu gaaka ani nityamu cheppukonduru gaaka.
Psalm 70:4 in English
- King James Version (KJV)
- Let all those that seek thee rejoice and be glad in thee: and let such as love thy salvation say continually, Let God be magnified.
- World English Bible (WEB)
- Let all those who seek you rejoice and be glad in you. Let those who love your salvation continually say, “Let God be exalted!”
- American Standard Version (ASV)
- Let all those that seek thee rejoice and be glad in thee; And let such as love thy salvation say continually, Let God be magnified.
- Bible in Basic English (BBE)
- Let all those who are looking for you be glad and have joy in you; let the lovers of your salvation ever say, May God be great.
- Darby Translation (DBY)
- Let all those that seek thee be glad and rejoice in thee, and let such as love thy salvation say continually, Let God be magnified!
- Webster's Bible (WBS)
- Let all those that seek thee rejoice and be glad in thee: and let such as love thy salvation say continually, Let God be magnified.
- Young's Literal Translation (YLT)
- Let all those seeking Thee joy and be glad in Thee, And let those loving Thy salvation Say continually, 'God is magnified.'
Read in context
- 2నా ప్రాణము తీయగోరువారు సిగ్గుపడి అవమానమొందుదురుగాక. నాకు కీడుచేయగోరువారు వెనుకకు మళ్లింపబడి సిగ్గునొందుదురు గాక.
- 3ఆహా ఆహా అని పలుకువారు తమకు కలిగిన అవమానమును చూచి విస్మయ మొందు దురుగాక
- 4నిన్ను వెదకువారందరు నిన్నుగూర్చి ఉత్సహించి సంతోషించుదురు గాక. నీ రక్షణను ప్రేమించువారందరు దేవుడు మహిమపరచబడును గాక అని నిత్యము చెప్పుకొందురు గాక.
- 5నేను శ్రమల పాలై దీనుడనైతిని దేవా, నన్ను రక్షించుటకు త్వరపడి రమ్ము నాకు సహాయము నీవే నారక్షణకర్తవు నీవే యెహోవా, ఆలస్యము చేయకుమీ.
Cross references
- Psalm 40:16 కీర్తనలు 40:16నిన్ను వెదకువారందరు నిన్నుగూర్చి ఉత్సహించి సంతోషించుదురు గాక నీ రక్షణ ప్రేమించువారు యెహోవా మహిమ పరచబడును గాక అని నిత్యము చెప్పుకొందురు గాక.
- Lamentations 3:25 విలాపవాక్యములు 3:25తన్ను ఆశ్రయించువారియెడల యెహోవా దయాళుడు తన్ను వెదకువారియెడల ఆయన దయచూపువాడు.
- Isaiah 65:13–14 యెషయా 65:13–14కావున ప్రభువగు యెహోవా ఈలాగు సెలవిచ్చు చున్నాడు ఆలకించుడి నా సేవకులు భోజనముచేయుదురు గాని మీరు ఆకలిగొనెదరు నా సేవకులు పానము చేసెదరు గాని మీరు దప్పిగొనెదరు. నా సేవకులు సంతోషించెదరు గాని మీరు సిగ్గుపడెదరు నా సేవకులు హృదయానందముచేత కేకలు వేసెదరుగాని మీరు చింతాక్రాంతులై యేడ్చెదరు మనోదుఃఖముచేత ప్రలాపించెదరు.
- Psalm 35:27 కీర్తనలు 35:27నా నిర్దోషత్వమునుబట్టి ఆనందించువారు ఉత్సాహధ్వనిచేసి సంతోషించుదురు గాక తన సేవకుని క్షేమమును చూచి ఆనందించు యెహోవా ఘనపరచబడును గాక అని వారు నిత్యము పలుకుదురు.
- Isaiah 61:10 యెషయా 61:10శృంగారమైనపాగా ధరించుకొనిన పెండ్లికుమారుని రీతిగాను ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లికుమార్తెరీతి గాను ఆయన రక్షణవస్త్రములను నాకు ధరింపజేసి యున్నాడు నీతి అను పైబట్టను నాకు ధరింపజేసియున్నాడు కాగా యెహోవానుబట్టి మహానందముతో నేను ఆనందించుచున్నాను నా దేవునిబట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది
- Psalm 97:12 కీర్తనలు 97:12నీతిమంతులారా, యెహోవాయందు సంతోషించుడి ఆయన పరిశుద్ధనామమునుబట్టి ఆయనకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించుడి.
- John 16:20 యోహాను 16:20మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకము సంతోషించును; మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
- Psalm 5:11 కీర్తనలు 5:11నిన్ను ఆశ్రయించువారందరు సంతోషించుదురునీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యముఆనందధ్వని చేయుదురు.