Psalms · chapter 74 · verse 14
Psalm 74:14 in Telugu
మకరముయొక్క శిరస్సును నీవు ముక్కలుగా గొట్టి తివి అరణ్యవాసులకు దానిని ఆహారముగా ఇచ్చితివి.
Makaramuyokka shirassunu neevu mukkalugaa gotti tivi aranyavaasulaku daanini aahaaramugaa ichchitivi.
Psalm 74:14 in English
- King James Version (KJV)
- Thou brakest the heads of leviathan in pieces, [and] gavest him [to be] meat to the people inhabiting the wilderness.
- World English Bible (WEB)
- You broke the heads of Leviathan in pieces. You gave him as food to people and desert creatures.
- American Standard Version (ASV)
- Thou brakest the heads of leviathan in pieces; Thou gavest him to be food to the people inhabiting the wilderness.
- Bible in Basic English (BBE)
- The heads of the great snake were crushed by you; you gave them as food to the fishes of the sea.
- Darby Translation (DBY)
- Thou didst break in pieces the heads of leviathan, thou gavest him to be meat to those that people the desert.
- Webster's Bible (WBS)
- Thou didst break the head of leviathan in pieces, [and] didst give him [to be] food to the people inhabiting the wilderness.
- Young's Literal Translation (YLT)
- Thou hast broken the heads of leviathan, Thou makest him food, For the people of the dry places.
Read in context
- 12పురాతనకాలము మొదలుకొని దేవుడు నా రాజై యున్నాడు దేశములో మహారక్షణ కలుగజేయువాడు ఆయనే.
- 13నీ బలముచేత సముద్రమును పాయలుగా చేసితివి జలములలో భుజంగముల శిరస్సులను నీవు పగుల గొట్టితివి.
- 14మకరముయొక్క శిరస్సును నీవు ముక్కలుగా గొట్టి తివి అరణ్యవాసులకు దానిని ఆహారముగా ఇచ్చితివి.
- 15బుగ్గలను నదులను పుట్టించితివి నిత్యము ప్రవహించు నదులను నీవు ఇంక జేసితివి
- 16పగలు నీదే రాత్రినీదే సూర్యచంద్రులను నీవే నిర్మించితివి.
Cross references
- Isaiah 27:1 యెషయా 27:1ఆ దినమున యెహోవా గట్టిదై గొప్పదై బలమైన తన ఖడ్గము పట్టుకొనును తీవ్రసర్పమైన మకరమును వంకరసర్పమైన మకరమును ఆయన దండించును సముద్రముమీదనున్న మకరమును సంహరించును.
- Psalm 72:9 కీర్తనలు 72:9అరణ్యవాసులు అతనికి లోబడుదురు. అతని శత్రువులు మన్ను నాకెదరు.
- Job 41:1–34 యోబు 41:1–34నీవు మకరమును గాలముతో బయటికి లాగగలవా?దాని నాలుకకు త్రాడువేసి లాగగలవా? నీవు దాని ముక్కుగుండ సూత్రము వేయగలవా? దాని దవడకు గాలము ఎక్కింపగలవా? అది నీతో విన్నపములు చేయునా? మృదువైన మాటలు నీతో పలుకునా? నీవు శాశ్వతముగా దానిని దాసునిగా చేసికొనునట్లు అది నీతో నిబంధనచేయునా? నీవు ఒక పిట్టతో ఆటలాడునట్లు దానితో ఆట లాడెదవా? నీ కన్యకలు ఆడుకొనుటకై దాని కట్టివేసెదవా? బెస్తవారు దానితో వ్యాపారము చేయుదురా? వారు దానిని తునకలు చేసి వర్తకులతో వ్యాపారము చేయుదురా? దాని ఒంటినిండ ఇనుప శూలములు గుచ్చగలవా? దాని తలనిండ చేప అలుగులు గుచ్చగలవా? దానిమీద నీ చెయ్యి వేసి చూడుము దానితో కలుగు పోరు నీవు జ్ఞాపకము చేసికొనిన యెడల నీవు మరల ఆలాగున చేయకుందువు. దాని చూచినప్పుడు మనుష్యులు దానిని వశపరచు కొందుమన్న ఆశ విడిచెదరు దాని పొడ చూచిన మాత్రముచేతనే యెవరికైనను గుండెలు అవిసిపోవును గదా. దాని రేపుటకైనను తెగింపగల శూరుడు లేడు. అట్లుండగా నా యెదుట నిలువగలవాడెవడు? నేను తిరిగి ఇయ్యవలసి యుండునట్లు నాకెవడైనను ఏమైనను ఇచ్చెనా? ఆకాశవైశాల్యమంతటి క్రింద నున్నదంతయు నాదే గదా దాని అవయవములను గూర్చియైనను దాని మహాబల మునుగూర్చియైనను దాని చక్కని తీరునుగూర్చి యైనను పలుకక మౌనముగా నుండను. ఎవడైన దాని పై కవచమును లాగివేయగలడా? దాని రెండు దవడల నడిమికి ఎవడైన రాగలడా? దాని ముఖద్వారములను తెరవగలవాడెవడు? దాని పళ్లచుట్టు భయకంపములు కలవు దాని గట్టిపొలుసులు దానికి అతిశయాస్పదము ఎవరును తీయలేని ముద్రచేత అవి సంతనచేయబడి యున్నవి. అవి ఒకదానితో ఒకటి హత్తుకొని యున్నవి. వాటి మధ్యకు గాలి యేమాత్రమును జొరనేరదు. ఒకదానితో ఒకటి అతకబడి యున్నవి భేదింప శక్యము కాకుండ అవి యొకదానితో నొకటి కలిసికొని యున్నవి. అది తుమ్మగా వెలుగు ప్రకాశించును దాని కన్నులు ఉదయకాలపు కనురెప్పలవలె నున్నవి దాని నోటనుండి జ్వాలలు బయలుదేరును అగ్ని కణములు దానినుండి లేచును. ఉడుకుచున్న కాగులోనుండి, జమ్ముమంటమీద కాగు చున్న బానలోనుండి పొగ లేచునట్లు దాని నాసికారంధ్రములలోనుండి లేచును. దాని ఊపిరి నిప్పులను రాజబెట్టును దాని నోటనుండి జ్వాలలు బయలుదేరును దాని మెడ బలమునకు స్థానము భయము దానియెదుట తాండవమాడుచుండును దాని ప్రక్కలమీద మాంసము దళముగా ఉన్నది అది దాని ఒంటిని గట్టిగా అంటియున్నది అది ఊడి రాదు. దాని గుండె రాతివలె గట్టిగా నున్నది అది తిరుగటి క్రింది దిమ్మంత కఠినము. అది లేచునప్పుడు బలిష్ఠులు భయపడుదురు అధిక భయముచేత వారు మైమరతురు. దాని చంపుటకై ఒకడు ఖడ్గము దూయుట వ్యర్థమే ఈటెలైనను బాణములైనను పంట్రకోలలైనను అక్క రకు రావు. ఇది ఇనుమును గడ్డిపోచగాను ఇత్తడిని పుచ్చిపోయిన కఱ్ఱగాను ఎంచును. బాణము దానిని పారదోలజాలదు వడిసెల రాళ్లు దాని దృష్టికి చెత్తవలె ఉన్నవి. దుడ్డుకఱ్ఱలు గడ్డిపరకలుగా ఎంచబడును అది వడిగా పోవుచుండు ఈటెను చూచి నవ్వును. దాని క్రిందిభాగములు కరుకైన చిల్లపెంకులవలె ఉన్నవి. అది బురదమీద నురిపిడికొయ్యవంటి తన దేహమును పరచుకొనును. కాగు మసలునట్లు మహాసముద్రమును అది పొంగ జేయును సముద్రమును తైలమువలె చేయును. అది తాను నడచిన త్రోవను తన వెనుక ప్రకాశింప జేయును చూచినవారికి సముద్రము నెరసిన వెండ్రుకలుగా తోచును. అది భయములేనిదిగా సృజింపబడినది భూమిమీద దానివంటిదేదియు లేదు. అది గొప్పవాటినన్నిటిని తిరస్కరించును గర్వించిన జంతువులన్నిటికి అది రాజు.
- Psalm 104:25–26 కీర్తనలు 104:25–26అదిగో విశాలమైన మహాసముద్రము అందులో లెక్కలేని జలచరములు దానిలో చిన్నవి పెద్దవి జీవరాసులున్నవి. అందులో ఓడలు నడుచుచున్నవి దానిలో ఆటలాడుటకు నీవు నిర్మించిన మకరము లున్నవి.
- Job 3:8 యోబు 3:8దినములు అశుభదినములని చెప్పువారు దానిని శపించుదురు గాకభుజంగమును రేపుటకు నేర్పుగలవారు దానిని శపించుదురు గాక.
- Numbers 14:9 సంఖ్యాకాండము 14:9మెట్టుకు మీరు యెహోవామీద తిరుగబడకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారమగుదురు, వారి నీడ వారి మీదనుండి తొలగిపోయెను. యెహోవా మనకు తోడై యున్నాడు, వారికి భయపడకుడనిరి. ఆ సర్వసమాజము వారిని రాళ్లతో కొట్టి చంపవలెననగా
- Revelation 20:2 ప్రకటన 20:2అతడు ఆదిసర్పమును, అనగా అపవాదియు సాతానును అను ఆ ఘటసర్పమును పట్టుకొని వెయ్యి సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేసి,
- Exodus 12:35–36 నిర్గమకాండము 12:35–36ఇశ్రాయేలీయులు మోషే మాట చొప్పునచేసి ఐగుప్తీయులయొద్ద వెండి నగలను బంగారు నగలను వస్త్రములను అడిగి తీసికొనిరి. యెహోవా ప్రజల యెడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేసెను గనుక వారు వారికి కావలసిన వాటిని ఇచ్చిరి. అట్లు వారు ఐగుప్తీయులను దోచుకొనిరి.
- Exodus 14:30 నిర్గమకాండము 14:30ఆ దినమున యెహోవా ఐగుప్తీయుల చేతిలోనుండి ఇశ్రాయేలీయులను రక్షించెను. ఇశ్రాయేలీయులు చచ్చిన ఐగుప్తీయులను సముద్రతీరమున చూచిరి.