Psalms · chapter 76 · verse 11
Psalm 76:11 in Telugu
మీ దేవుడైన యెహోవాకు మ్రొక్కుకొని మీ మ్రొక్కుబడులను చెల్లించుడి ఆయన చుట్టునున్నవారందరు భయంకరుడగు ఆయనకు కానుకలు తెచ్చి అర్పింపవలెను.
Mee devudaina yehovaaku mrokkukoni mee mrokkubadulanu chellinchudi aayana chuttununnavaarandaru bhayankarudagu aayanaku kaanukalu techchi arpimpavalenu.
Psalm 76:11 in English
- King James Version (KJV)
- Vow, and pay unto the LORD your God: let all that be round about him bring presents unto him that ought to be feared.
- World English Bible (WEB)
- Make vows to the LORD your God, and fulfill them! Let all of his neighbors bring presents to him who is to be feared.
- American Standard Version (ASV)
- Vow, and pay unto Jehovah your God: Let all that are round about him bring presents unto him that ought to be feared.
- Bible in Basic English (BBE)
- Give to the Lord your God what is his by right; let all who are round him give offerings to him who is to be feared.
- Darby Translation (DBY)
- Vow and pay unto Jehovah your God: let all that are round about him bring presents unto him that is to be feared.
- Webster's Bible (WBS)
- Vow, and pay to the LORD your God: let all that are about him bring presents to him that ought to be feared.
- Young's Literal Translation (YLT)
- Vow and complete to Jehovah your God, All ye surrounding him. They bring presents to the Fearful One.
Read in context
- 9దేశములో శ్రమనొందిన వారినందరిని రక్షించుటకై న్యాయపుతీర్పునకు దేవుడు లేచినప్పుడు భూమి భయపడి ఊరకుండెను. (సెలా. )
- 10నరుల ఆగ్రహము నిన్ను స్తుతించును ఆగ్రహశేషమును నీవు ధరించుకొందువు.
- 11మీ దేవుడైన యెహోవాకు మ్రొక్కుకొని మీ మ్రొక్కుబడులను చెల్లించుడి ఆయన చుట్టునున్నవారందరు భయంకరుడగు ఆయనకు కానుకలు తెచ్చి అర్పింపవలెను.
- 12అధికారుల పొగరును ఆయన అణచివేయువాడు భూరాజులకు ఆయన భీకరుడు.
Cross references
- Ecclesiastes 5:4–6 ప్రసంగి 5:4–6నీవు దేవునికి మ్రొక్కుబడి చేసికొనినయెడల దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకుము;బుద్ధిహీనులయందు ఆయన కిష్టము లేదు. నీవు మ్రొక్కుకొనినదాని చెల్లించుము, నీవు మ్రొక్కుకొని చెల్లింపకుండుటకంటె మ్రొక్కుకొన కుండుటయే మేలు. నీ దేహమును శిక్షకు లోపరచు నంత పని నీ నోటివలన జరుగనియ్యకుము; అది పొర పాటుచేత జరిగెనని దూత యెదుట చెప్పకుము; నీ మాటలవలన దేవునికి కోపము పుట్టించి నీవేల నీ కష్టమును వ్యర్థపరచుకొనెదవు?
- Psalm 50:14 కీర్తనలు 50:14దేవునికి స్తుతి యాగము చేయుము మహోన్నతునికి నీ మ్రొక్కుబడులు చెల్లించుము.
- Psalm 68:29 కీర్తనలు 68:29యెరూషలేములోని నీ ఆలయమునుబట్టి రాజులు నీ యొద్దకు కానుకలు తెచ్చెదరు.
- Psalm 89:7 కీర్తనలు 89:7పరిశుద్ధదూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు తన చుట్టునున్న వారందరికంటె భయంకరుడు.
- Numbers 30:2 సంఖ్యాకాండము 30:2ఇది యెహోవా ఆజ్ఞాపించిన సంగతి. ఒకడు యెహోవాకు మ్రొక్కుకొనిన యెడల, లేక తాను బద్ధుడగుటకు ప్రమాణము చేసిన యెడల, అతడు తన మాటతప్పక తన నోటనుండి వచ్చినదంతయు నెరవేర్చ వలెను.
- Genesis 31:42 ఆదికాండము 31:42నా తండ్రి దేవుడు, అబ్రాహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడైయుండనియెడల నిశ్చయముగా నీవు నన్ను వట్టి చేతులతోనే పంపివేసి యుందువు. దేవుడు నా ప్రయాసమును నా చేతుల కష్టమును చూచి, పోయిన రాత్రి నిన్ను గద్దించెనని లాబానుతో చెప్పెను.
- Deuteronomy 16:16 ద్వితీయోపదేశకాండము 16:16ఏటికి మూడు మారులు, అనగా పొంగని రొట్టెలపండుగలోను వారములపండుగలోను పర్ణశాలల పండుగలోను నీ దేవు డైన యెహోవా ఏర్పరచుకొను స్థలమున నీ మగవారందరు ఆయన సన్నిధిని కనబడవలెను.
- Psalm 119:106 కీర్తనలు 119:106నీ న్యాయవిధులను నేననుసరించెదనని నేను ప్రమాణము చేసియున్నాను నా మాట నెర వేర్చుదును.
- 2 Chronicles 32:22–23 2 దినవృత్తాంతములు 32:22–23ఈ ప్రకారము యెహోవా హిజ్కియాను యెరూషలేము కాపురస్థులను అష్షూరు రాజైన సన్హెరీబు చేతిలోనుండియు అందరిచేతిలోనుండియు రక్షించి, అన్నివైపులను వారిని కాపాడినందున అనేకులు యెరూషలేములో యెహోవాకు అర్పణలను యూదా రాజైన హిజ్కియాకు కానుకలను తెచ్చి యిచ్చిరి. అందు వలన అతడు అప్పటినుండి సకల జనముల దృష్టికి ఘనత నొందిన వాడాయెను.