Psalms · chapter 77 · verse 7
Psalm 77:7 in Telugu
ప్రభువు నిత్యము విడనాడునా? ఆయన ఇకెన్నడును కటాక్షింపడా?
Prabhuvu nityamu vidanaadunaa? Aayana ikennadunu kataakshimpadaa?
Psalm 77:7 in English
- King James Version (KJV)
- Will the Lord cast off for ever? and will he be favourable no more?
- World English Bible (WEB)
- “Will the Lord reject us forever? Will he be favorable no more?
- American Standard Version (ASV)
- Will the Lord cast off for ever? And will he be favorable no more?
- Bible in Basic English (BBE)
- Will the Lord put me away for ever? will he be kind no longer?
- Darby Translation (DBY)
- Will the Lord cast off for ever? and will he be favourable no more?
- Webster's Bible (WBS)
- Will the LORD cast off for ever? and will he be favorable no more?
- Young's Literal Translation (YLT)
- To the ages doth the Lord cast off? Doth He add to be pleased no more?
Read in context
- 5తొల్లిటి దినములను, పూర్వకాల సంవత్సరములను నేను మనస్సునకు తెచ్చుకొందును.
- 6నేను పాడిన పాట రాత్రియందు జ్ఞాపకము చేసి కొందును హృదయమున ధ్యానించుకొందును. దేవా, నా ఆత్మ నీ తీర్పుమార్గము శ్రద్ధగా వెదకెను.
- 7ప్రభువు నిత్యము విడనాడునా? ఆయన ఇకెన్నడును కటాక్షింపడా?
- 8ఆయన కృప ఎన్నటికిలేకుండ మానిపోయెనా? ఆయన సెలవిచ్చిన మాట తరతరములకు తప్పి పోయెనా?
- 9దేవుడు కటాక్షింప మానెనా? ఆయన కోపించి వాత్సల్యత చూపకుండునా?(సెలా. )
Cross references
- Psalm 85:1 కీర్తనలు 85:1యెహోవా, నీవు నీ దేశము ఎడల కటాక్షము చూపియున్నావు చెరకుపోయిన యాకోబు సంతతిని నీవు వెనుకకు రప్పించియున్నావు.
- Lamentations 3:31–32 విలాపవాక్యములు 3:31–32ప్రభువు సర్వకాలము విడనాడడు. ఆయన బాధపెట్టినను తన కృపాసమృద్ధినిబట్టి జాలిపడును.
- Romans 11:1–2 రోమీయులకు 11:1–2ఆలాగైనయెడల నేనడుగునదేమనగా, దేవుడు తనప్రజలను విసర్జించెనా? అట్లనరాదు. నేనుకూడ ఇశ్రాయేలీయుడను, అబ్రాహాము సంతానమందలి బెన్యామీను గోత్రమునందు పుట్టినవాడను. తాను ముందెరిగిన తన ప్రజలను దేవుడు విసర్జింపలేదు. ఏలీయానుగూర్చిన భాగములో లేఖనము చెప్పునది మీరెరుగరా?
- Psalm 89:46 కీర్తనలు 89:46యెహోవా, ఎంతవరకు నీవు దాగియుందువు? నిత్యము దాగియుందువా? ఎంతవరకు నీ ఉగ్రత అగ్నివలె మండును?
- Psalm 85:5 కీర్తనలు 85:5ఎల్లకాలము మామీద కోపగించెదవా? తరతరములు నీ కోపము సాగించెదవా?
- Psalm 37:24 కీర్తనలు 37:24యెహోవా అతని చెయ్యి పట్టుకొని యున్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక యుండడు.
- Psalm 89:38 కీర్తనలు 89:38ఇట్లు సెలవిచ్చి యుండియు నీవు మమ్ము విడనాడి విసర్జించియున్నావు నీ అభిషిక్తునిమీద నీవు అధికకోపము చూపి యున్నావు.
- Psalm 13:1–2 కీర్తనలు 13:1–2యెహోవా, ఎన్నాళ్లవరకు నన్ను మరచిపోవుదువు? నిత్యము మరచెదవా? నాకెంతకాలము విముఖుడవై యుందువు? ఎంతవరకు నా మనస్సులో నేను చింతపడుదును?ఎంతవరకు నా హృదయములో పగలంతయు దుఃఖా క్రాంతుడనై యుందును?ఎంతవరకు నాశత్రువు నామీద తన్ను హెచ్చించుకొనును?
- Psalm 79:5 కీర్తనలు 79:5యెహోవా, ఎంతవరకు కోపపడుదువు? ఎల్లప్పుడును కోపపడుదువా? నీ రోషము అగ్నివలె ఎల్లప్పుడును మండునా?
- Psalm 44:9 కీర్తనలు 44:9అయితే ఇప్పుడు నీవు మమ్మును విడనాడి అవమాన పరచియున్నావు. మాసేనలతోకూడ నీవు బయలుదేరకయున్నావు.
- Psalm 74:1 కీర్తనలు 74:1దేవా, నీవు నిత్యము మమ్మును విడనాడితివేమి? నీవు మేపు గొఱ్ఱెలమీద నీ కోపము పొగరాజు చున్నదేమి?
- Jeremiah 23:24–26 యిర్మీయా 23:24–26యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా నాకు కనబడకుండ రహస్య స్థలములలో దాగగలవాడెవడైన కలడా? నేను భూమ్యాకాశములయందంతట నున్నవాడను కానా? యిదే యెహోవా వాక్కు. కలకంటిని కలకంటిని అని చెప్పుచు నా నామమున అబద్ధములు ప్రకటించు ప్రవక్తలు పలికిన మాట నేను వినియున్నాను. ఇక నెప్పటివరకు ఈలాగున జరుగుచుండును? తమ హృదయకాపట్యమును బట్టి అబద్ధములు ప్రకటించు ప్రవక్తలు దీని నాలోచింపరా?