Skip to content
ThuthiThuthiThuthi
Psalms · chapter 77 of 150 · 20 verses

Psalm 77 in Telugu

కీర్తనలు 77

  1. నేను ఎలుగెత్తి దేవునికి మొఱ్ఱపెట్టుదును ఆయనకు మనవి చేయుదును దేవుడు నాకు చెవియొగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయుదును.

    To the chief Musician, to Jeduthun, A Psalm of Asaph. I cried unto God with my voice, [even] unto God with my voice; and he gave ear unto me.

  2. నా ఆపత్కాలమందు నేను ప్రభువును వెదకితిని రాత్రివేళ నా చెయ్యి వెనుకకు తీయకుండ చాప బడియున్నది. నా ప్రాణము ఓదార్పు పొందనొల్లక యున్నది.

    In the day of my trouble I sought the Lord: my sore ran in the night, and ceased not: my soul refused to be comforted.

  3. దేవుని జ్ఞాపకము చేసికొనునప్పుడు నేను నిట్టూర్పు విడుచుచున్నాను నేను ధ్యానించునప్పుడు నా ఆత్మ క్రుంగిపోవుచున్నది (సెలా. )

    I remembered God, and was troubled: I complained, and my spirit was overwhelmed. Selah.

  4. నీవు నా కన్నులు మూతపడనీయవు. నేను కలవరపడుచు మాటలాడలేక యున్నాను.

    Thou holdest mine eyes waking: I am so troubled that I cannot speak.

  5. తొల్లిటి దినములను, పూర్వకాల సంవత్సరములను నేను మనస్సునకు తెచ్చుకొందును.

    I have considered the days of old, the years of ancient times.

  6. నేను పాడిన పాట రాత్రియందు జ్ఞాపకము చేసి కొందును హృదయమున ధ్యానించుకొందును. దేవా, నా ఆత్మ నీ తీర్పుమార్గము శ్రద్ధగా వెదకెను.

    I call to remembrance my song in the night: I commune with mine own heart: and my spirit made diligent search.

  7. ప్రభువు నిత్యము విడనాడునా? ఆయన ఇకెన్నడును కటాక్షింపడా?

    Will the Lord cast off for ever? and will he be favourable no more?

  8. ఆయన కృప ఎన్నటికిలేకుండ మానిపోయెనా? ఆయన సెలవిచ్చిన మాట తరతరములకు తప్పి పోయెనా?

    Is his mercy clean gone for ever? doth [his] promise fail for evermore?

  9. దేవుడు కటాక్షింప మానెనా? ఆయన కోపించి వాత్సల్యత చూపకుండునా?(సెలా. )

    Hath God forgotten to be gracious? hath he in anger shut up his tender mercies? Selah.

  10. అందుకునేనీలాగు అనుకొనుచున్నాను మహోన్నతుని దక్షిణహస్తము మార్పునొందెననుకొను టకు నాకు కలిగిన శ్రమయే కారణము.

    And I said, This [is] my infirmity: [but I will remember] the years of the right hand of the most High.

  11. యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగిన నీ ఆశ్చర్యకార్యములను నేను మనస్సునకు తెచ్చుకొందును

    I will remember the works of the LORD: surely I will remember thy wonders of old.

  12. నీ కార్యమంతయు నేను ధ్యానించుకొందును నీ క్రియలను నేను ధ్యానించుకొందును.

    I will meditate also of all thy work, and talk of thy doings.

  13. దేవా, నీమార్గము పరిశుద్ధమైనది. దేవునివంటి మహా దేవుడు ఎక్కడనున్నాడు?

    Thy way, O God, [is] in the sanctuary: who [is so] great a God as [our] God?

  14. ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడవు నీవే జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరచుకొని యున్నావు.

    Thou [art] the God that doest wonders: thou hast declared thy strength among the people.

  15. నీ బాహుబలమువలన యాకోబు యోసేపుల సంతతి వారగు నీ ప్రజలను నీవు విమోచించియున్నావు.

    Thou hast with [thine] arm redeemed thy people, the sons of Jacob and Joseph. Selah.

  16. దేవా, జలములు నిన్ను చూచెను జలములు నిన్ను చూచి దిగులుపడెను అగాధజలములు గజగజలాడెను.

    The waters saw thee, O God, the waters saw thee; they were afraid: the depths also were troubled.

  17. మేఘరాసులు నీళ్లు దిమ్మరించెను. అంతరిక్షము ఘోషించెను. నీ బాణములు నలుదిక్కుల పారెను.

    The clouds poured out water: the skies sent out a sound: thine arrows also went abroad.

  18. నీ ఉరుముల ధ్వని సుడిగాలిలో మ్రోగెను మెరుపులు లోకమును ప్రకాశింపజేసెను భూమి వణకి కంపించెను.

    The voice of thy thunder [was] in the heaven: the lightnings lightened the world: the earth trembled and shook.

  19. నీ మార్గము సముద్రములో నుండెను. నీ త్రోవలు మహా జలములలో ఉండెను. నీ యడుగుజాడలు గుర్తింపబడక యుండెను.

    Thy way [is] in the sea, and thy path in the great waters, and thy footsteps are not known.

  20. మాషే అహరోనులచేత నీ ప్రజలను మందవలె నడి పించితివి.

    Thou leddest thy people like a flock by the hand of Moses and Aaron.

All chapters of Psalms · Telugu Bible · Psalm 77 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.