Psalms · chapter 88 · verse 10
Psalm 88:10 in Telugu
మృతులకు నీవు అద్భుతములు చూపెదవా? ప్రేతలు లేచి నిన్ను స్తుతించెదరా?(సెలా. )
Mrutulaku neevu adbhutamulu choopedavaa? Pretalu lechi ninnu stutinchedaraa?(selaa. )
Psalm 88:10 in English
- King James Version (KJV)
- Wilt thou shew wonders to the dead? shall the dead arise [and] praise thee? Selah.
- World English Bible (WEB)
- Do you show wonders to the dead? Do the departed spirits rise up and praise you? Selah.
- American Standard Version (ASV)
- Wilt thou show wonders to the dead? Shall they that are deceased arise and praise thee? [Selah
- Bible in Basic English (BBE)
- Will you do works of wonder for the dead? will the shades come back to give you praise? (Selah.)
- Darby Translation (DBY)
- Wilt thou do wonders to the dead? shall the shades arise and praise thee? Selah.
- Webster's Bible (WBS)
- Wilt thou show wonders to the dead? shall the dead arise [and] praise thee? Selah.
- Young's Literal Translation (YLT)
- To the dead dost Thou do wonders? Do Rephaim rise? do they thank Thee? Selah.
Read in context
- 8నా నెళవరులను నాకు దూరముగా నీవు ఉంచి యున్నావు నీవు వారి దృష్టికి నన్ను హేయునిగా చేసియున్నావు వెలుపలికి రావల్ల గాకుండ నేను బంధింపబడి యున్నాను
- 9బాధచేత నా కన్ను క్షీణించుచున్నది యెహోవా, ప్రతిదినము నేను నీకు మొఱ్ఱపెట్టు చున్నాను నీవైపు నా చేతులు చాపుచున్నాను.
- 10మృతులకు నీవు అద్భుతములు చూపెదవా? ప్రేతలు లేచి నిన్ను స్తుతించెదరా?(సెలా. )
- 11సమాధిలో నీ కృపను ఎవరైన వివరింతురా? నాశనకూపములో నీ విశ్వాస్యతను ఎవరైన చెప్పు కొందురా?
- 12అంధకారములో నీ అద్భుతములు తెలియనగునా? పాతాళములో నీ నీతి తెలియనగునా?
Cross references
- Psalm 6:5 కీర్తనలు 6:5మరణమైనవారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదుపాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు దురు?
- Isaiah 26:19 యెషయా 26:19మృతులైన నీవారు బ్రదుకుదురు నావారి శవములు సజీవములగును మంటిలో పడియున్నవారలారా, మేల్కొని ఉత్స హించుడి. నీ మంచు ప్రకాశమానమైన మంచు భూమి తనలోని ప్రేతలను సజీవులనుగా చేయును.
- Psalm 30:9 కీర్తనలు 30:9మన్ను నిన్ను స్తుతించునా? నీ సత్యమునుగూర్చి అది వివరించునా?
- Isaiah 38:18–19 యెషయా 38:18–19పాతాళమున నీకు స్తుతి కలుగదు మృతి నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లింపదు సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయిం చరు. సజీవులు, సజీవులే గదా నిన్ను స్తుతించుదురు ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించు చున్నాను. తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియజేతురు యెహోవా నన్ను రక్షించువాడు
- 1 Corinthians 15:52–57 1 కొరింథీయులకు 15:52–57బూర మ్రోగును; అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. క్షయమైన యీ శరీరము అక్షయతను ధరించుకొనవలసి యున్నది; మర్త్యమైన యీ శరీరము అమర్త్యతను ధరించు కొనవలసియున్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు, ఈ మర్త్య మైనది అమర్త్యతను ధరించు కొనినప్పుడు, విజయమందు మరణము మింగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా, నీ విజయమెక్కడ? ఓ మరణమా, నీ ముల్లెక్కడ? మరణపు ముల్లు పాపము; పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక.
- Mark 5:35–36 మార్కు 5:35–36ఆయన ఇంకను మాటలాడుచుండగా, సమాజమందిరపు అధికారి యింటనుండి కొందరు వచ్చినీ కుమార్తె చని పోయినది; నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదువనిరి. యేసు వారు చెప్పినమాట లక్ష్య పెట్టకభయ పడకుము, నమ్మిక మాత్రముంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పి
- Psalm 118:17 కీర్తనలు 118:17నేను చావను సజీవుడనై యెహోవా క్రియలు వివరించెదను.
- Luke 7:12–16 లూకా 7:12–16ఆయన ఆ ఊరి గవినియొద్దకు వచ్చి నప్పుడు, చనిపోయిన యొకడు వెలుపలికి మోసికొని పోబడుచుండెను; అతని తల్లికి అతడొక్కడే కుమారుడు, ఆమె విధవరాలు; ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడ ఉండిరి. ప్రభువు ఆమెను చూచి ఆమెయందుకనికరపడి - ఏడువవద్దని ఆమెతో చెప్పి, దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయుచున్నవారు నిలిచిరి. ఆయన చిన్నవాడా, లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడసాగెను; ఆయన అతనిని అతని తల్లికి అప్పగించెను. అందరు భయాక్రాంతులై మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి యున్నాడనియు, దేవుడు తన ప్రజలకు దర్శనమను గ్రహించి యున్నాడనియు దేవుని మహిమపరచిరి.
- Job 14:7–12 యోబు 14:7–12వృక్షము నరకబడినయెడల అది తిరిగి చిగుర్చుననియుదానికి లేతకొమ్మలు వేయుననియు నమ్మకముకలదు. దాని వేరు భూమిలో పాతదై పోయినను దాని అడుగుమొద్దు మంటిలో చీకిపోయినను నీటి వాసన మాత్రముచేత అది చిగుర్చునులేత మొక్కవలె అది కొమ్మలు వేయును. అయితే నరులు మరణమై కదలలేక పడియుందురు. నరులు ప్రాణము విడిచిన తరువాత వారేమై పోవుదురు? తటాక జలములు ఎట్లు ఇంకిపోవునో నది నీరు ఎట్లు ఎండి హరించిపోవునో ఆలాగుననే నరులు పండుకొని తిరిగి లేవరు. ఆకాశము గతించిపోవువరకు వారు మేలుకొనరు. ఎవరును వారిని నిద్ర లేపజాలరు.
- Ezekiel 37:1–14 యెహెజ్కేలు 37:1–14యెహోవా హస్తము నా మీదికి వచ్చెను. నేను ఆత్మవశుడనైయుండగా యెహోవా నన్ను తోడుకొని పోయి యెముకలతో నిండియున్న యొక లోయలో నన్ను దింపెను. ఆయన వాటిమధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా యెముకలనేకములు ఆ లోయలో కనబడెను, అవి కేవలము ఎండిపోయినవి. ఆయన నరపుత్రుడా, యెండిపోయిన యీ యెముకలు బ్రదుక గలవా? అని నన్నడుగగా ప్రభువా యెహోవా అది నీకే తెలియునని నేనంటిని. అందుకాయన ప్రవచన మెత్తి యెండిపోయిన యీ యెముకలతో ఇట్లనుము ఎండి పోయిన యెముకలారా, యెహోవామాట ఆలకించుడి. ఈ యెముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చున దేమనగా మీరు బ్రదుకునట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను; చర్మము కప్పిమీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీమీద కప్పెదను; మీలో జీవాత్మనుంచగా మీరు బ్రదుకుదురు; అప్పుడునేను యెహోవానై యున్నానని మీరు తెలిసికొందురు. ఆయన నాకిచ్చిన ఆజ్ఞప్రకారము నేను ప్రవచించు చుండగా గడగడమను ధ్వని యొకటి పుట్టెను; అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలిసికొనెను. నేను చూచుచుండగా నరములును మాంసమును వాటిమీదికి వచ్చెను, వాటిపైన చర్మము కప్పెను, అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రమును లేక పోయెను. అప్పడు ఆయన నరపుత్రుడా; జీవాత్మవచ్చునట్లు ప్రవచించి ఇట్లనుము ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా జీవాత్మా, నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రదుకునట్లు వారిమీద ఊపిరి విడువుము. ఆయన నా కాజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను; వారు సజీవులై లేచి లెక్కింప శక్యముకాని మహా సైన్యమై నిలిచిరి. అప్పుడాయన నాతో ఇట్లనెను నరపుత్రుడా, ఈ యెముకలు ఇశ్రాయేలీయులనందరిని సూచించుచున్నవి. వారు మన యెముకలు ఎండి పోయెను, మన ఆశ విఫలమాయెను, మనము నాశనమై పోతివిు అని యనుకొనుచున్నారు కాబట్టి ప్రవచన మెత్తి వారితో ఇట్లనుము ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరచెదను, సమాధులలోనుండి మిమ్మును బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశములోనికి తోడుకొని వచ్చెదను. నా ప్రజలారా, నేను సమాధులను తెరచి సమాధులలోనున్న మిమ్మును బయటికి రప్పించగా నేను యెహోవానై యున్నానని మీరు తెలిసికొందురు, మీరు బ్రదుకునట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశములో మిమ్మును నివసింపజేసెదను, యెహోవానగు నేను మాట ఇచ్చి దానిని నెరవేర్తునని మీరు తెలిసికొందురు; ఇదే యెహోవా వాక్కు.
- Psalm 115:17 కీర్తనలు 115:17మృతులును మౌనస్థితిలోనికి దిగిపోవువారును యెహోవాను స్తుతింపరు