Psalms · chapter 94 · verse 15
Psalm 94:15 in Telugu
నీతిని స్థాపించుటకై న్యాయపుతీర్పు జరుగును యథార్థహృదయులందరు దాని ననుసరించెదరు.
Neetini sthaapinchutakai nyaayaputeerpu jarugunu yathaarthahrudayulandaru daani nanusarinchedaru.
Psalm 94:15 in English
- King James Version (KJV)
- But judgment shall return unto righteousness: and all the upright in heart shall follow it.
- World English Bible (WEB)
- For judgment will return to righteousness. All the upright in heart shall follow it.
- American Standard Version (ASV)
- For judgment shall return unto righteousness; And all the upright in heart shall follow it.
- Bible in Basic English (BBE)
- But decisions will again be made in righteousness; and they will be kept by all whose hearts are true.
- Darby Translation (DBY)
- For judgment shall return unto righteousness, and all the upright in heart shall follow it.
- Webster's Bible (WBS)
- But judgment shall return to righteousness: and all the upright in heart shall follow it.
- Young's Literal Translation (YLT)
- For to righteousness judgment turneth back, And after it all the upright of heart,
Read in context
- 13భక్తిహీనులకు గుంట త్రవ్వబడువరకు నీతిమంతుల కష్టదినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగజేయుదువు.
- 14యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు.
- 15నీతిని స్థాపించుటకై న్యాయపుతీర్పు జరుగును యథార్థహృదయులందరు దాని ననుసరించెదరు.
- 16దుష్టులమీదికి నా పక్షమున ఎవడు లేచును? దోషము చేయువారికి విరోధముగా నా పక్షమున ఎవడు నిలుచును?
- 17యెహోవా నాకు సహాయము చేసియుండని యెడల నా ప్రాణము శీఘ్రముగా మౌనమందు నివసించి యుండును.
Cross references
- Micah 7:9 మీకా 7:9నేను యెహోవా దృష్టికి పాపము చేసితిని గనుక ఆయన నా పక్షమున వ్యాజ్యె మాడి నా పక్షమున న్యాయము తీర్చువరకు నేను ఆయన కోపాగ్నిని సహింతును; ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును, ఆయన నీతిని నేను చూచెదను.
- Psalm 37:34 కీర్తనలు 37:34యెహోవాకొరకు కనిపెట్టుకొని యుండుము ఆయన మార్గము ననుసరించుము భూమిని స్వతంత్రించుకొనునట్లు ఆయన నిన్ను హెచ్చించును భక్తిహీనులు నిర్మూలము కాగా నీవు చూచెదవు.
- Psalm 97:2 కీర్తనలు 97:2మేఘాంధకారములు ఆయనచుట్టు నుండును నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారము.
- Psalm 125:3–5 కీర్తనలు 125:3–5నీతిమంతులు పాపము చేయుటకు తమ చేతులు చాప కుండునట్లు భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాస్థ్యము మీద నుండదు. యెహోవా, మంచివారికి మేలు చేయుము యథార్థహృదయులకు మేలు చేయుము. తమ వంకరత్రోవలకు తొలగిపోవువారిని పాపముచేయువారితో కూడ యెహోవాకొనిపోవును ఇశ్రాయేలుమీద సమాధానముండును గాక.
- Malachi 3:18 మలాకీ 3:18అప్పుడు నీతిగలవా రెవరో దుర్మార్గులెవరో దేవుని సేవించు వారెవరో ఆయనను సేవించనివారెవరో మీరు తిరిగి కనుగొందురు.
- Psalm 58:11 కీర్తనలు 58:11కావున నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగు ననియు నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకములో నున్నాడనియు మనుష్యులు ఒప్పుకొందురు.
- Revelation 15:3–4 ప్రకటన 15:3–4వారు ప్రభువా, దేవా, సర్వాధికారీ, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి; యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములును సత్యములునై యున్నవి; ప్రభువా, నీవు మాత్రము పవిత్రుడవు, నీకు భయపడని వాడెవడు? నీ నామమును మహిమపరచనివాడెవడు? నీ న్యాయవిధులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనములందరు వచ్చి నీ సన్నిధిని నమస్కారముచేసెదరని చెప్పుచు, దేవుని దాసుడగు మోషే కీర్తనయు గొఱ్ఱెపిల్ల కీర్తనయు పాడుచున్నారు.
- Psalm 94:2–3 కీర్తనలు 94:2–3భూలోక న్యాయాధిపతీ లెమ్ము గర్విష్టులకు ప్రతిఫలమిమ్ము యెహోవా, భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించుదురు? భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించుదురు?
- Psalm 9:16 కీర్తనలు 9:16యెహోవా ప్రత్యక్షమాయెను, ఆయన తీర్పు తీర్చియున్నాడు. దుష్టులు తాముచేసికొనిన దానిలో చిక్కియున్నారు(హిగ్గాయోన్ సెలా. )
- Psalm 7:8–9 కీర్తనలు 7:8–9యెహోవా జనములకు తీర్పు తీర్చువాడు యెహోవా, నా నీతినిబట్టియు నా యథార్థతను బట్టియు నా విషయములోనాకు న్యాయము తీర్చుము. హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతిగల దేవా,
- Job 23:11–12 యోబు 23:11–12నా పాదములు ఆయన అడుగుజాడలు విడువకనడచినవి నేను ఇటు అటు తొలగక ఆయన మార్గము నను సరించితిని. ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరుగలేదు ఆయన నోటిమాటలను నా స్వాభిప్రాయముకంటె ఎక్కువగా ఎంచితిని.
- James 5:7–11 యాకోబు 5:7–11సహోదరులారా, ప్రభువు రాకడవరకు ఓపిక కలిగి యుండుడి; చూడుడి; వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దానికొరకు కనిపెట్టును గదా ప్రభువురాక సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగియుండుడి, మీ హృదయములను స్థిరపరచు కొనుడి. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండు నిమిత్తము ఒకనిమీదనొకడు సణగకుడి; ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు. నా సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను, శ్రమానుభవ మునకును ఓపికకును మాదిరిగా పెట్టుకొనుడి. సహించిన వారిని ధన్యులనుకొనుచున్నాము గదా? మీరు యోబు యొక్క సహనమునుగూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలిసికొని యున్నారు.