Romans · chapter 10 · verse 18
Romans 10:18 in Telugu
అయినను నేను చెప్పునదేమనగా, వారు వినలేదా? విన్నారు గదా? వారి స్వరము భూలోకమందంతటికిని, వారిమాటలు భూదిగంతములవరకును బయలువెళ్లెను.
Ayinanu nenu cheppunademanagaa, vaaru vinaledaa? Vinnaaru gadaa? Vaari svaramu bhoolokamandantatikini, vaarimaatalu bhoodigantamulavarakunu bayaluvellenu.
Romans 10:18 in English
- King James Version (KJV)
- But I say, Have they not heard? Yes verily, their sound went into all the earth, and their words unto the ends of the world.
- World English Bible (WEB)
- But I say, didn’t they hear? Yes, most certainly, “Their sound went out into all the earth, their words to the ends of the world.”
- American Standard Version (ASV)
- But I say, Did they not hear? Yea, verily, Their sound went out into all the earth, And their words unto the ends of the world.
- Bible in Basic English (BBE)
- But I say, Did not the word come to their ears? Yes, certainly: Their sound has gone out into all the earth, and their words to the ends of the world.
- Darby Translation (DBY)
- But I say, Have they not heard? Yea, surely, Their voice has gone out into all the earth, and their words to the extremities of the habitable world.
- Webster's Bible (WBS)
- But I say, Have they not heard? Yes verily, their sound went into all the earth, and their words to the ends of the world.
- Young's Literal Translation (YLT)
- but I say, Did they not hear? yes, indeed — 'to all the earth their voice went forth, and to the ends of the habitable world their sayings.'
Read in context
- 16అయినను అందరు సువార్తకు లోబడలేదు ప్రభువా, మేము తెలియజేసిన సమాచారమెవడు నమ్మెను అని యెషయా చెప్పుచున్నాడు గదా?
- 17కాగా వినుట వలన విశ్వాసము కలుగును; వినుట క్రీస్తును గూర్చిన మాటవలన కలుగును.
- 18అయినను నేను చెప్పునదేమనగా, వారు వినలేదా? విన్నారు గదా? వారి స్వరము భూలోకమందంతటికిని, వారిమాటలు భూదిగంతములవరకును బయలువెళ్లెను.
- 19మరియు నేను చెప్పునదేమనగా ఇశ్రాయేలునకు తెలియకుండెనా? జనము కానివారివలన మీకు రోషము పుట్టించెదను, అవివేకమైన జనమువలన మీకు ఆగ్రహము కలుగ జేతును. అని మొదట మోషే చెప్పుచున్నాడు.
- 20మరియు యెషయా తెగించి నన్ను వెదకనివారికి నేను దొరకితిని; నన్ను విచారింపనివారికి ప్రత్యక్షమైతిని అని చెప్పుచున్నాడు.
Cross references
- Psalm 19:4 కీర్తనలు 19:4వాటి కొలనూలు భూమియందంతట వ్యాపించి యున్నది లోకదిగంతములవరకు వాటి ప్రకటనలు బయలువెళ్లు చున్నవివాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను.
- Matthew 24:14 మత్తయి 24:14మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును; అటుతరువాత అంతము వచ్చును.
- Romans 1:8 రోమీయులకు 1:8మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడు చుండుటనుబట్టి, మొదట మీ యందరినిమిత్తము యేసు క్రీస్తుద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు చున్నాను.
- 1 Thessalonians 1:8 1 థెస్సలొనీకయులకు 1:8అక్కడమాత్రమే గాక ప్రతి స్థలమందును దేవునియెడల ఉన్న మీ విశ్వాసము వెల్లడాయెను గనుక, మేమేమియు చెప్పవలసిన అవశ్యములేదు.
- Colossians 1:23 కొలొస్సయులకు 1:23పునాదిమీద కట్టబడినవారై స్థిరముగా ఉండి, మీరు విన్నట్టియు, ఆకాశముక్రింద ఉన్న సమస్తసృష్టికి ప్రకటింపబడినట్టియు ఈ సువార్తవలన కలుగు నిరీక్షణనుండి తొలగిపోక, విశ్వాసమందు నిలిచి యుండినయెడల ఇది మీకు కలుగును. పౌలను నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని.
- Colossians 1:6 కొలొస్సయులకు 1:6ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు, వ్యాపించుచున్నట్టుగా మీరు దేవుని కృపనుగూర్చి విని సత్యముగా గ్రహించిన నాటనుండి మీలో సయితము ఫలించుచు వ్యాపించుచున్నది.
- Mark 16:15 మార్కు 16:15మరియు మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి.
- Matthew 28:19 మత్తయి 28:19కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగాచేయుడి; తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మ మిచ్చుచు
- Matthew 26:13 మత్తయి 26:13సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో, అక్కడ ఈమె చేసినదియు ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నా నని వారితో అనెను.
- Psalm 22:27 కీర్తనలు 22:27భూదిగంతముల నివాసులందరు జ్ఞాపకము చేసికొని యెహోవాతట్టు తిరిగెదరు అన్యజనుల వంశస్థులందరు నీ సన్నిధిని నమస్కారము చేసెదరు
- Isaiah 49:6 యెషయా 49:6నీవు యాకోబు గోత్రపువారిని ఉద్ధరించునట్లును ఇశ్రాయేలులో తప్పింపబడినవారిని రప్పించునట్లును నా సేవకుడవై యుండుట ఎంతో స్వల్పవిషయము; భూదిగంతములవరకు నీవు నేను కలుగజేయు రక్షణకు సాధనమగుటకై అన్యజనులకు వెలుగై యుండునట్లు నిన్ను నియమించి యున్నాను.
- Acts 2:5–11 అపొస్తలుల కార్యములు 2:5–11ఆ కాలమున ఆకాశము క్రిందనుండు ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురముండిరి. ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడివచ్చి, ప్రతి మనుష్యుడు తన తన స్వభాషతో వారు మాటలాడుట విని కలవరపడిరి. అంతట అందరు విభ్రాంతినొంది ఆశ్చర్యపడి ఇదిగో మాటలాడుచున్న వీరందరు గలిలయులు కారా? మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపుభాషతో వీరు మాటలాడుట మనము వినుచున్నామే; ఇదేమి? పార్తీయులు మాదీయులు ఏలామీయులు, మెసొపొతమియ యూదయ కప్పదొకియ, పొంతు ఆసియ ఫ్రుగియ పంపులియ ఐగుప్తు అను దేశములయందలి వారు, కురేనేదగ్గర లిబియ ప్రాంతములయందు కాపురమున్నవారు, రోమానుండి పరవాసులుగా వచ్చినవారు, యూదులు, యూదమత ప్రవిష్టులు, క్రేతీయులు అరబీయులు మొదలైన మన మందరమును, వీరు మన భాషలతో దేవుని గొప్పకార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొనిరి.
Original words (Greek)
- But · G235ἀλλά allá
- say · G3004λέγω légō
- they · G191ἀκούω akoúō
- not · G3756οὐ ou
- heard · G191ἀκούω akoúō
- verily · G3304μενοῦνγε menoûnge
- their · G846αὐτός autós
- sound · G5353φθόγγος phthóngos
- went · G1831ἐξέρχομαι exérchomai
- into · G1519εἰς eis
- all · G3956πᾶς pâs
- earth · G1093γῆ gē
- and · G2532καί kaí
- their · G846αὐτός autós
- words · G4487ῥῆμα rhēma
- unto · G1519εἰς eis
- ends · G4009πέρας péras
- world · G3625οἰκουμένη oikouménē