Ruth · chapter 4 · verse 15
Ruth 4:15 in Telugu
నిన్ను ప్రేమించి యేడుగురు కుమారులకంటె నీ కెక్కువగానున్న నీ కోడలు ఇతని కనెను; ఇతడు నీ ప్రాణము నోదార్చి ముసలితనమున నీకు పోషకుడగునని నయోమితో చెప్పిరి.
Ninnu preminchi yeduguru kumaarulakante nee kekkuvagaanunna nee kodalu itani kanenu; itadu nee praanamu nodaarchi musalitanamuna neeku poshakudagunani nayomito cheppiri.
Ruth 4:15 in English
- King James Version (KJV)
- And he shall be unto thee a restorer of [thy] life, and a nourisher of thine old age: for thy daughter in law, which loveth thee, which is better to thee than seven sons, hath born him.
- World English Bible (WEB)
- He shall be to you a restorer of life and sustain you in your old age; for your daughter-in-law, who loves you, who is better to you than seven sons, has given birth to him.”
- American Standard Version (ASV)
- And he shall be unto thee a restorer of life, and a nourisher of thine old age, for thy daughter-in-law, who loveth thee, who is better to thee than seven sons, hath borne him.
- Bible in Basic English (BBE)
- He will be a giver of new life to you, and your comforter when you are old, for your daughter-in-law, who, in her love for you, is better than seven sons, has given birth to him.
- Darby Translation (DBY)
- And he shall be to thee a restorer of thy life, and a nourisher of thine old age; for thy daughter-in-law who loves thee, who is better to thee than seven sons, has borne him.
- Webster's Bible (WBS)
- And he shall be to thee a restorer of [thy] life, and a nourisher of thy old age: for thy daughter-in-law, who loveth thee, who is better to thee than seven sons, hath borne him.
- Young's Literal Translation (YLT)
- and he hath been to thee for a restorer of life, and for a nourisher of thine old age, for thy daughter-in-law who hath loved thee — who is better to thee than seven sons — hath borne him.'
Read in context
- 13కాబట్టి బోయజు రూతును పెండ్లిచేసికొని ఆమె యొద్దకు పోయినప్పుడు యెహోవా ఆమె గర్భవతి యగునట్లు అనుగ్రహించెను గనుక ఆమె కుమారునికనెను.
- 14అప్పుడు స్త్రీలుఈ దినమున నీకు బంధువుడు లేకుండ చేయని యెహోవా స్తుతినొందుగాక; ఆయన నామము ఇశ్రాయేలీయులలో ప్రకటింపబడునుగాక.
- 15నిన్ను ప్రేమించి యేడుగురు కుమారులకంటె నీ కెక్కువగానున్న నీ కోడలు ఇతని కనెను; ఇతడు నీ ప్రాణము నోదార్చి ముసలితనమున నీకు పోషకుడగునని నయోమితో చెప్పిరి.
- 16అప్పుడు నయోమిఆ బిడ్డను తీసికొని కౌగిట నుంచుకొని వానికి దాదిగా నుండెను.
- 17ఆమె పొరుగు స్త్రీలునయోమికొరకు కుమారుడు పుట్టెనని చెప్పి అతనికి ఓబేదను పేరు పెట్టిరి. అతడు దావీదునకు తండ్రి యైన యెష్షయియొక్క తండ్రి.
Cross references
- Isaiah 46:4 యెషయా 46:4ముదిమి వచ్చువరకు నిన్ను ఎత్తికొనువాడను నేనే తల వెండ్రుకలు నెరయువరకు నిన్ను ఎత్తికొనువాడను నేనే నేనే చేసియున్నాను చంకపెట్టుకొనువాడను నేనే నిన్ను ఎత్తికొనుచు రక్షించువాడను నేనే.
- Psalm 55:22 కీర్తనలు 55:22నీ భారము యెహోవామీద మోపుము ఆయనే నిన్ను ఆదుకొనును నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు.
- Genesis 45:11 ఆదికాండము 45:11ఇకను అయిదు కరవు సంవత్సరములు వచ్చును గనుక నీకును నీ యింటి వారికిని నీకు కలిగినదంతటికిని పేదరికము రాకుండ అక్కడ నిన్ను పోషించెదనన్నాడని చెప్పుడి.
- Ruth 2:11–12 రూతు 2:11–12నీవు నీ తలిదండ్రులను నీ జన్మభూమిని విడిచి, యింతకుముందు నీవు ఎరుగని జనము నొద్దకు వచ్చితివి. యెహోవా నీవు చేసినదానికి ప్రతిఫలమిచ్చును; ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కలక్రింద సురక్షితముగా నుండునట్లు నీవు వచ్చితివి; ఆయన నీకు సంపూర్ణమైన బహుమాన మిచ్చునని ఆమెకుత్తర మిచ్చెను.
- Genesis 47:12 ఆదికాండము 47:12మరియు యోసేపు తన తండ్రిని తన సహోదరులను తన తండ్రి కుటుంబపు వారినందరిని వారివారి పిల్లల లెక్కచొప్పున వారికి ఆహారమిచ్చి సంరక్షించెను.
- Proverbs 18:24 సామెతలు 18:24బహుమంది చెలికాండ్రు గలవాడు నష్టపడును సహోదరునికంటెను ఎక్కువగా హత్తియుండు స్నేహితుడు కలడు.
- 1 Samuel 1:8 1 సమూయేలు 1:8ఆమె పెనిమిటియైన ఎల్కానాహన్నా, నీ వెందుకు ఏడ్చు చున్నావు? నీవు భోజనము మానుట ఏల? నీకు మనో విచారమెందుకు కలిగినది? పదిమంది కుమాళ్లకంటె నేను నీకు విశేషమైనవాడను కానా? అని ఆమెతో చెప్పుచు వచ్చెను.
- Ruth 1:16–18 రూతు 1:16–18అందుకు రూతునా వెంబడి రావద్దనియు నన్ను విడిచి పెట్టుమనియు నన్ను బ్రతిమాలుకొనవద్దు. నీవు వెళ్లు చోటికే నేను వచ్చెదను, నీవు నివసించుచోటనే నేను నివసించెదను, నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు; నీవు మృతి బొందుచోటను నేను మృతిబొందెదను, అక్కడనే పాతిపెట్టబడెదను. మరణము తప్ప మరి ఏదైనను నిన్ను నన్ను ప్రత్యేకించినయెడల యెహోవా నాకు ఎంత కీడైన చేయునుగాక అనెను. తనతోకూడ వచ్చుటకు ఆమెకు మనస్సుకుదిరినదని నయోమి తెలిసి కొనినప్పుడు అందునుగురించి ఆమెతో మాటలాడుట మానెను గనుక వారిద్దరు బేత్లెహేమునకు వచ్చువరకు ప్రయాణము చేసిరి.