Zechariah · chapter 11 · verse 4
Zechariah 11:4 in Telugu
నా దేవుడైన యెహోవా సెలవిచ్చునదేమనగా వధకేర్పడిన గొఱ్ఱెల మందను మేపుము.
Naa devudaina yehovaa selavichchunademanagaa vadhakerpadina gorrela mandanu mepumu.
Zechariah 11:4 in English
- King James Version (KJV)
- Thus saith the LORD my God; Feed the flock of the slaughter;
- World English Bible (WEB)
- The LORD my God says: “Feed the flock of slaughter.
- American Standard Version (ASV)
- Thus said Jehovah my God: Feed the flock of slaughter;
- Bible in Basic English (BBE)
- This is what the Lord my God has said: Take care of the flock of death;
- Darby Translation (DBY)
- Thus saith Jehovah my God: Feed the flock of slaughter,
- Webster's Bible (WBS)
- Thus saith the LORD my God; Feed the flock of the slaughter;
- Young's Literal Translation (YLT)
- Thus said Jehovah my God: 'Feed the flock of the slaughter,
Read in context
- 2దేవదారు వృక్షములు కూలెను, వృక్షరాజములు పాడైపోయెను; సరళవృక్షములారా, అంగలార్చుడి చిక్కని అడవి నరక బడెను; సింధూరవృక్షములారా, అంగలార్చుడి.
- 3గొఱ్ఱె బోయల రోదన శబ్దము వినబడుచున్నది, ఏలయనగా వారి అతిశయాస్పదము లయమాయెను. కొదమ సింహ ముల గర్జనము వినబడుచున్నది, ఏలయనగా యొర్దాను యొక్క మహారణ్యము పాడైపోయెను.
- 4నా దేవుడైన యెహోవా సెలవిచ్చునదేమనగా వధకేర్పడిన గొఱ్ఱెల మందను మేపుము.
- 5వాటిని కొనువారు వాటిని చంపియు నిరపరాధులమని యనుకొందురు; వాటిని అమ్మినవారు మాకు బహు ద్రవ్యము దొరుకుచున్నది, యెహోవాకు స్తోత్రమని చెప్పుకొందురు; వాటిని కాయువారు వాటి యెడల కనికరము చూపరు.
- 6ఇదే యెహోవా వాక్కునేనికను దేశనివాసులను కనికరింపక ఒకరిచేతికి ఒకరిని, వారి రాజుచేతికి వారినందరిని అప్పగింతును, వారు దేశ మును, నాశనముచేయగా వారి చేతిలోనుండి నేనెవరిని విడిపింపను.
Cross references
- Zechariah 11:7 జెకర్యా 11:7కాబట్టి నేను సౌందర్యమనునట్టియు బంధ కమనునట్టియు రెండు కఱ్ఱలు చేతపట్టుకొని వధకేర్పడిన గొఱ్ఱెలను ముఖ్యముగా వాటిలో మిక్కిలి బలహీనమైన వాటిని మేపుచువచ్చితిని.
- Matthew 23:37 మత్తయి 23:37యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును నీయొద్దకు పంపబడినవారిని రాళ్లతో కొట్టుచును ఉండు దానా, కోడి తన పిల్లలను రెక్కలక్రింది కేలాగు చేర్చు కొనునో ఆలాగే నేనును నీ పిల్లలను ఎన్నోమారులు చేర్చు కొనవలెనని యుంటిని గాని మీరు ఒల్లకపోతిరి.
- Romans 15:8 రోమీయులకు 15:8నేను చెప్పునదేమనగా, పితరులకు చేయబడిన వాగ్దానముల విషయములో దేవుడు సత్యవంతుడని స్థాపించుటకును, అన్యజనులు ఆయన కనికరమును గూర్చి దేవుని మహిమపరచుటకును క్రీస్తు సున్నతి గలవారికి పరిచారకుడాయెను.
- Isaiah 49:4–5 యెషయా 49:4–5అయిననువ్యర్థముగా నేను కష్టపడితిని ఫలమేమియు లేకుండ నా బలమును వృథాగా వ్యయపరచి యున్నాననుకొంటిని నాకు న్యాయకర్త యెహోవాయే, నా బహుమానము నా దేవునియొద్దనే యున్నది. యెహోవా దృష్టికి నేను ఘనుడనైతిని నా దేవుడు నాకు బలమాయెను కాగా తనకు సేవకుడనైయుండి తనయొద్దకు యాకోబును తిరిగి రప్పించుటకు ఇశ్రాయేలు ఆయనయొద్దకు సమకూర్చబడుటకు నన్ను గర్భమున పుట్టించిన యెహోవా ఈలాగు సెల విచ్చుచున్నాడు
- Isaiah 40:9–11 యెషయా 40:9–11సీయోనూ, సువార్త ప్రటించుచున్నదానా, ఉన్నతపర్వతము ఎక్కుము యెరూషలేమూ, సువార్త ప్రకటించుచున్నదానా, బలముగా ప్రకటించుము భయపడక ప్రకటింపుమి - ఇదిగో మీ దేవుడు అని యూదా పట్టణములకు ప్రకటించుము. ఇదిగో తన బాహువే తన పక్షమున ఏలుచుండగా ప్రభువగు యెహోవా తానే శక్తిసంపన్నుడై వచ్చును ఆయన ఇచ్చు బహుమానము ఆయనయొద్దనున్నది ఆయన చేయు ప్రతికారము ఆయనకు ముందుగానడచుచున్నది. గొఱ్ఱెలకాపరివలె ఆయన తన మందను మేపును తన బాహువుతో గొఱ్ఱెపిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును పాలిచ్చువాటిని ఆయన మెల్లగా నడిపించును.
- Matthew 15:24 మత్తయి 15:24ఆయనఇశ్రాయేలు ఇంటివారై నశించిన గొఱ్ఱెలయొద్దకే గాని మరి ఎవరియొద్దకును నేను పంపబడ లేదనెను
- Ephesians 1:3 ఎఫెసీయులకు 1:3మన ప్రభువైన యేసుక్రీస్తుయొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోకవిషయములలో ఆత్మసంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకనుగ్రహించెను.
- Zechariah 14:5 జెకర్యా 14:5కొండలమధ్య కనబడులోయ ఆజీలువరకు సాగగా మీరు ఆ కొండలోయలోనికి పారిపోవుదురు. యూదారాజైన ఉజ్జియా దినములలో కలిగిన భూకంపమునకు మీరు భయపడి పారిపోయినట్లు మీరు పారిపోవు దురు, అప్పుడు నీతోకూడ పరిశుద్దులందరును వచ్చెదరు. నా దేవుడైన యెహోవా ప్రత్యక్షమగును.
- John 20:17 యోహాను 20:17యేసు ఆమెతో నేను ఇంకను తండ్రియొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు; అయితే నా సహోదరులయొద్దకు వెళ్లినా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవు చున్నానని వారితో చెప్పుమనెను.
- Ezekiel 34:23–24 యెహెజ్కేలు 34:23–24వాటిని మేపుటకై నేను నా సేవకుడైన దావీదును వాటిమీద కాపరినిగా నియమించెదను, అతడు వాటికి కాపరిగా ఉండి వాటిని మేపును. యెహోవానైన నేను వారికి దేవుడనై యుందును, నా సేవకుడైన దావీదు వారిమధ్య అధిపతిగా ఉండును, యెహోవానైన నేను మాటయిచ్చియున్నాను.
- Luke 19:41–44 లూకా 19:41–44ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై యేడ్చి నీవును ఈ నీ దినమందైనను సమాధానసంబంధమైన సంగతులను తెలిసికొనినయెడల నీకెంతో మేలు; గాని యిప్పుడవి నీ కన్నులకు మరుగు చేయబడియున్నవి. (ప్రభువు) నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టు గట్టు కట్టి ముట్టడివేసి, అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి, నీలోనున్న నీ పిల్లలతో కూడ నిన్ను నేల కలిపి నీలో రాతిమీద రాయి నిలిచియుండ నియ్యని దినములు వచ్చునని చెప్పెను.
- Micah 5:4 మీకా 5:4ఆయన నిలిచి యెహోవా బలము పొంది తన దేవుడైన యెహోవా నామ మహాత్మ్యమును బట్టి తన మందను మేపును. కాగా వారు నిలుతురు, ఆయన భూమ్యంతములవరకు ప్రబలుడగును,