Zechariah · chapter 11 · verse 6
Zechariah 11:6 in Telugu
ఇదే యెహోవా వాక్కునేనికను దేశనివాసులను కనికరింపక ఒకరిచేతికి ఒకరిని, వారి రాజుచేతికి వారినందరిని అప్పగింతును, వారు దేశ మును, నాశనముచేయగా వారి చేతిలోనుండి నేనెవరిని విడిపింపను.
Ide yehovaa vaakkunenikanu deshanivaasulanu kanikarimpaka okarichetiki okarini, vaari raajuchetiki vaarinandarini appagintunu, vaaru desha munu, naashanamucheyagaa vaari chetilonundi nenevarini vidipimpanu.
Zechariah 11:6 in English
- King James Version (KJV)
- For I will no more pity the inhabitants of the land, saith the LORD: but, lo, I will deliver the men every one into his neighbour’s hand, and into the hand of his king: and they shall smite the land, and out of their hand I will not deliver [them].
- World English Bible (WEB)
- For I will no more pity the inhabitants of the land,” says the LORD; “but, behold, I will deliver every one of the men into his neighbor’s hand and into the hand of his king. They will strike the land, and out of their hand I will not deliver them.”
- American Standard Version (ASV)
- For I will no more pity the inhabitants of the land, saith Jehovah; but, lo, I will deliver the men every one into his neighbor’s hand, and into the hand of his king; and they shall smite the land, and out of their hand I will not deliver them.
- Bible in Basic English (BBE)
- For I will have no more pity for the people of the land, says the Lord; but I will give up everyone into his neighbour's hand and into the hand of his king: and they will make the land waste, and I will not keep them safe from their hands.
- Darby Translation (DBY)
- For I will no more pity the inhabitants of the land, saith Jehovah, and behold, I will deliver men, every one into his neighbour's hand, and into the hand of his king; and they shall smite the land, and I will not deliver out of their hand.
- Webster's Bible (WBS)
- For I will no more pity the inhabitants of the land, saith the LORD: but lo, I will deliver the men every one into his neighbor's hand, and into the hand of his king: and they shall smite the land, and out of their hand I will not deliver [them] .
- Young's Literal Translation (YLT)
- For I have pity no more on inhabitants of the land, An affirmation of Jehovah, And lo, I am causing man to come forth, Each into the hand of his neighbour, And into the hand of his king, And they have beaten down the land, And I do not deliver out of their hand.'
Read in context
- 4నా దేవుడైన యెహోవా సెలవిచ్చునదేమనగా వధకేర్పడిన గొఱ్ఱెల మందను మేపుము.
- 5వాటిని కొనువారు వాటిని చంపియు నిరపరాధులమని యనుకొందురు; వాటిని అమ్మినవారు మాకు బహు ద్రవ్యము దొరుకుచున్నది, యెహోవాకు స్తోత్రమని చెప్పుకొందురు; వాటిని కాయువారు వాటి యెడల కనికరము చూపరు.
- 6ఇదే యెహోవా వాక్కునేనికను దేశనివాసులను కనికరింపక ఒకరిచేతికి ఒకరిని, వారి రాజుచేతికి వారినందరిని అప్పగింతును, వారు దేశ మును, నాశనముచేయగా వారి చేతిలోనుండి నేనెవరిని విడిపింపను.
- 7కాబట్టి నేను సౌందర్యమనునట్టియు బంధ కమనునట్టియు రెండు కఱ్ఱలు చేతపట్టుకొని వధకేర్పడిన గొఱ్ఱెలను ముఖ్యముగా వాటిలో మిక్కిలి బలహీనమైన వాటిని మేపుచువచ్చితిని.
- 8ఒక నెలలోగా కాపరులలో ముగ్గురిని సంహరించితిని; ఏలయనగా నేను వారి విషయమై సహనము లేనివాడను కాగా వారు నా విషయమై ఆయాసపడిరి.
Cross references
- Jeremiah 13:14 యిర్మీయా 13:14అప్పుడు నేను తండ్రులను కుమారులను అందరిని ఏకముగా ఒకనిమీద ఒకని పడద్రోయుదునని యెహోవా సెలవిచ్చుచున్నాడు; వారిని కరుణింపను శిక్షింపక పోను; వారియెడల జాలిపడక నేను వారిని నశింప జేసెదను.
- Isaiah 9:19–21 యెషయా 9:19–21సైన్యముల కధిపతియగు యెహోవా ఉగ్రతవలన దేశము కాలిపోయెను. జనులును అగ్నికి కట్టెలవలె నున్నారు వారిలో ఒకనినొకడు కరుణింపడు. కుడిప్రక్కన ఉన్నదాని పట్టుకొందురు గాని ఇంకను ఆకలిగొని యుందురు; ఎడమప్రక్కన ఉన్నదాని భక్షించుదురు గాని ఇంకను తృప్తిపొందక యుందురు వారిలో ప్రతివాడు తన బాహువును భక్షించును మనష్షే ఎఫ్రాయిమును ఎఫ్రాయిము మనష్షేను భక్షించును వీరిద్దరు ఏకీభవించి యూదామీద పడుదురు. ఈలాగు జరిగినను ఆయన కోపము చల్లారలేదు ఆయన బాహువు ఇంకను చాపబడియున్నది.
- Matthew 22:7 మత్తయి 22:7కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి, ఆ నరహంతకులను సంహరించి, వారి పట్టణము తగలబెట్టించెను.
- Hebrews 10:26–31 హెబ్రీయులకు 10:26–31మనము సత్యమునుగూర్చి అనుభవజ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసినయెడల పాప ములకు బలియికను ఉండదు గాని న్యాయపు తీర్పునకు భయముతో ఎదురుచూచుటయు, విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు నికను ఉండును. ఎవడైనను మోషే ధర్మశాస్త్రమును నిరాకరించినయెడల ఇద్దరు ముగ్గురు సాక్షుల మాటమీద, కనికరింపకుండ వాని చంపించుదురు. ఇట్లుండగా దేవుని కుమారుని, పాదములతో త్రొక్కి, తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి, కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించినవాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును? పగతీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తుననియు మరియు ప్రభువు తన ప్రజలకు తీర్పు తీర్చును అనియు చెప్పినవానిని ఎరుగుదుము గదా. జీవముగల దేవుని చేతిలో పడుట భయంకరము.
- Micah 5:8 మీకా 5:8యాకోబు సంతతిలో శేషించినవారు అన్యజనులమధ్యను అనేక జనములలోను అడవిమృగములలో సింహమువలెను, ఎవడును విడిపింపకుండ లోపలికి చొచ్చి గొఱ్ఱెలమందలను త్రొక్కి చీల్చు కొదమసింహమువలెను ఉందురు.
- Psalm 50:22 కీర్తనలు 50:22దేవుని మరచువారలారా, దీని యోచించుకొనుడి లేనియెడల నేను మిమ్మును చీల్చివేయుదును తప్పించు వాడెవడును లేకపోవును
- Matthew 10:34–36 మత్తయి 10:34–36నేను భూమిమీదికి సమాధానమును పంపవచ్చితినని తలంచకుడి; ఖడ్గమునే గాని సమాధానమును పంపుటకు నేను రాలేదు. ఒక మనుష్యునికిని వాని తండ్రికిని, కుమార్తెకును ఆమె తల్లికిని, కోడలికిని ఆమె అత్తకును విరోధము పెట్టవచ్చితిని. ఒక మనుష్యుని యింటివారే అతనికి శత్రువులగుదురు.
- Zechariah 11:5 జెకర్యా 11:5వాటిని కొనువారు వాటిని చంపియు నిరపరాధులమని యనుకొందురు; వాటిని అమ్మినవారు మాకు బహు ద్రవ్యము దొరుకుచున్నది, యెహోవాకు స్తోత్రమని చెప్పుకొందురు; వాటిని కాయువారు వాటి యెడల కనికరము చూపరు.
- Zechariah 11:14 జెకర్యా 11:14అప్పుడు బంధకమనునట్టి నా రెండవ కఱ్ఱను తీసికొని యూదావారికిని ఇశ్రాయేలువారి కిని కలిగిన సహోదరబంధమును భంగము చేయునట్లు దాని విరిచితిని.
- Isaiah 27:11 యెషయా 27:11దానికొమ్మలు ఎండినవై విరిచివేయబడును స్త్రీలు వచ్చి వాటిని తగలబెట్టుదురు. వారు బుద్ధిగల జనులు కారు వారిని సృజించినవాడు వారియందు జాలిపడడు. వారిని పుట్టించినవాడు వారికి దయచూపడు.
- Micah 7:2–7 మీకా 7:2–7భక్తుడు దేశములో లేకపోయెను, జనులలో యథార్థపరుడు ఒకడును లేడు, అందరును ప్రాణహాని చేయుటకై పొంచియుండువారే; ప్రతిమనుష్యుడును కిరాతుడై తన సహోదరునికొరకు వలలను ఒగ్గును. రెండు చేతులతోను కీడు చేయ పూనుకొందురు, అధిపతులు బహుమానము కోరుదురు, న్యాయాధిపతులు లంచము పుచ్చుకొందురు, గొప్పవారు తమ మోసపు కోరికను తెలియజేయుదురు. ఆలాగున వారు ఏకపట్టుగానుండి దాని ముగింతురు. వారిలో మంచివారు ముండ్లచెట్టువంటివారు, వారిలో యథార్థ వంతులు ముండ్లకంచెకంటెను ముండ్లు ముండ్లుగా నుందురు, నీ కాపరుల దినము నీవు శిక్షనొందు దినము వచ్చుచున్నది. ఇప్పుడే జనులు కలవరపడుచున్నారు. స్నేహితునియందు నమ్మికయుంచవద్దు, ముఖ్యస్నేహితుని నమ్ముకొనవద్దు, నీ కౌగిటిలో పండుకొనియున్న దానియెదుట నీ పెదవుల ద్వారమునకు కాపుపెట్టుము. కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు, కుమార్తె తల్లిమీదికిని కోడలు అత్తమీదికిని లేచెదరు, ఎవరి ఇంటివారు వారికే విరోధు లగుదురు. అయినను యెహోవాకొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తయగు నా దేవునికొరకు నేను కనిపెట్టియుందును, నా దేవుడు నా ప్రార్థన నాలకించును.
- Micah 6:14 మీకా 6:14నీవు భోజనము చేసినను నీకు తృప్తి కానేరదు, నీ వెప్పుడు పస్తుగానే యుందువు, నీవేమైన తీసికొనిపోయినను అది నీకుండదు, నీవు భద్రము చేసికొని కొనిపోవుదానిని దోపుడుకు నేనప్పగింతును.
Original words (Hebrew)
- pity · H2550חָמַל châmal
- inhabitants · H3427יָשַׁב yâshab
- land · H776אֶרֶץ ʼerets
- saith · H5002נְאֻם nᵉʼum
- deliver · H4672מָצָא mâtsâʼ
- men · H120אָדָם ʼâdâm
- one · H376אִישׁ ʼîysh
- neighbour’s · H7453רֵעַ rêaʻ
- hand · H3027יָד yâd
- hand · H3027יָד yâd
- king · H4428מֶלֶךְ melek
- smite · H3807כָּתַת kâthath
- land · H776אֶרֶץ ʼerets
- hand · H3027יָד yâd
- deliver · H5337נָצַל nâtsal