Zechariah · chapter 3 · verse 7
Zechariah 3:7 in Telugu
సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగానా మార్గములలొ నడుచుచు నేను నీ కప్పగించిన దానిని భద్రముగా గైకొనిన యెడల, నీవు నా మందిరముమీద అధికారివై నా ఆవరణ ములను కాపాడువాడవగుదువు; మరియు ఇక్కడ నిలువ బడు వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలుచు భాగ్యము నీ కిత్తును.
Sainyamulaku adhipatiyagu yehovaa selavichchunademanagaanaa maargamulalo naduchuchu nenu nee kappaginchina daanini bhadramugaa gaikonina yedala, neevu naa mandiramumeeda adhikaarivai naa aavarana mulanu kaapaaduvaadavaguduvu; mariyu ikkada niluva badu vaariki kaliginatlu naa sannidhini niluchu bhaagyamu nee kittunu.
Zechariah 3:7 in English
- King James Version (KJV)
- Thus saith the LORD of hosts; If thou wilt walk in my ways, and if thou wilt keep my charge, then thou shalt also judge my house, and shalt also keep my courts, and I will give thee places to walk among these that stand by.
- World English Bible (WEB)
- “The LORD of Armies says: ‘If you will walk in my ways, and if you will follow my instructions, then you also shall judge my house, and shall also keep my courts, and I will give you a place of access among these who stand by.
- American Standard Version (ASV)
- Thus saith Jehovah of hosts: If thou wilt walk in my ways, and if thou wilt keep my charge, then thou also shalt judge my house, and shalt also keep my courts, and I will give thee a place of access among these that stand by.
- Bible in Basic English (BBE)
- These are the words of the Lord of armies: If you will go in my ways and keep what I have put in your care, then you will be judge over my Temple and have the care of my house, and I will give you the right to come in among those who are there.
- Darby Translation (DBY)
- Thus saith Jehovah of hosts: If thou wilt walk in my ways, and if thou wilt keep my charge, then thou shalt also judge my house, and shalt also keep my courts; and I will give thee a place to walk among these that stand by.
- Webster's Bible (WBS)
- Thus saith the LORD of hosts; If thou wilt walk in my ways, and if thou wilt keep my charge, then thou shalt also judge my house, and shalt also keep my courts, and I will give thee places to walk among these that stand by.
- Young's Literal Translation (YLT)
- 'Thus said Jehovah of Hosts: If in My ways thou dost walk, And if My charge thou dost keep, Then also thou dost judge My house, And also thou dost keep My courts, And I have given to thee conductors among these standing by.
Read in context
- 5అతని తలమీద తెల్లని పాగా పెట్టించుడని నేను మనవిచేయగా వారు అతని తలమీద తెల్లని పాగాపెట్టి వస్త్రములతో అతనిని అలంకరించిరి; యెహోవా దూత దగ్గర నిలు చుండెను.
- 6అప్పుడు యెహోవా దూత యెహోషువకు ఈలాగు ఆజ్ఞ ఇచ్చెను.
- 7సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగానా మార్గములలొ నడుచుచు నేను నీ కప్పగించిన దానిని భద్రముగా గైకొనిన యెడల, నీవు నా మందిరముమీద అధికారివై నా ఆవరణ ములను కాపాడువాడవగుదువు; మరియు ఇక్కడ నిలువ బడు వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలుచు భాగ్యము నీ కిత్తును.
- 8ప్రధానయాజకుడవైన యెహోషువా, నీ యెదుట కూర్చుండు నీ సహకారులు సూచనలుగా ఉన్నారు; నీవును వారును నా మాట ఆలకింపవలెను, ఏదనగా చిగురు అను నా సేవకుని నేను రప్పింపబోవు చున్నాను.
- 9యెహోషువ యెదుట నేనుంచిన రాతిని తేరి చూడుడి, ఆ రాతికి ఏడు నేత్రములున్నవి, దాని చెక్కడపు పని చేయువాడను నేను. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు; మరియు ఒక దినము లోగానే నేను ఈ దేశముయొక్క దోషమును పరిహరింతును;
Cross references
- Matthew 19:28 మత్తయి 19:28యేసు వారితో ఇట్లనెను(ప్రపంచ) పునర్జననమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనముమీద ఆసీనుడై యుండునపుడు నన్ను వెంబడించిన మీరును పండ్రెండు సింహాసనములమీద ఆసీనులై ఇశ్రాయేలు పండ్రెండు గోత్రములవారికి తీర్పుతీర్చుదురు.
- 2 Timothy 4:1–2 2 తిమోతికి 4:1–2దేవునియెదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తుయేసు ఎదుటను, ఆయన ప్రత్యక్షతతోడు ఆయన రాజ్యముతోడు, నేను ఆనబెట్టి చెప్పునదేమనగా వాక్యమును ప్రకటించుము; సమయమందును అసమయ మందును ప్రయాసపడుము; సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము గద్దించుము బుద్ధి చెప్పుము.
- Genesis 26:5 ఆదికాండము 26:5ఏలయనగా అబ్రాహాము నా మాట విని నేను విధించిన దాని నా ఆజ్ఞలను నా కట్టడలను నా నియమములను గైకొనెనని చెప్పెను.
- Ezekiel 44:15–16 యెహెజ్కేలు 44:15–16ఇశ్రాయేలీయులు నన్ను విసర్జింపగా నా పరిశుద్ధస్థల సంరక్షణను కనిపెట్టు సాదోకు సంతతివారగు లేవీయులైన యాజకులు పరిచర్య చేయుటకై నా సన్నిధికి వచ్చి వారే నా సన్నిధిని నిలిచి, క్రొవ్వును రక్తమును నాకు అర్పించుదురు; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. వారే నా పరిశుద్ధస్థలములో ప్రవేశింతురు, పరిచర్య చేయుటకై వారే నా బల్లయొద్దకు వత్తురు, వారే నేనప్పగించిన దానిని కాపాడుదురు; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.
- 1 Timothy 6:13–14 1 తిమోతికి 6:13–14సమస్తమునకు జీవా ధారకుడైన దేవుని యెదుటను, పొంతిపిలాతునొద్ద ధైర్య ముగా ఒప్పుకొని సాక్ష్యమిచ్చిన క్రీస్తుయేసు ఎదుటను, మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కళంకముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞను గైకొనవలెనని నీకు ఆజ్ఞాపించుచున్నాను.
- 1 Kings 2:3 1 రాజులు 2:3నీ దేవుడైన యెహోవా అప్పగించినదానిని కాపాడి, ఆయన మార్గముల ననుసరించిన యెడల నీవు ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకొందువు. మోషే ధర్మశాస్త్రములో వ్రాయబడియున్న దేవుని కట్టడలను ఆయన నియమించిన ధర్మమంతటిని ఆయన న్యాయ విధులను శాసనములను గైకొనుము;
- 1 Corinthians 6:2–3 1 కొరింథీయులకు 6:2–3పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరె రుగరా? మీవలన లోకమునకు తీర్పు జరుగవలసి యుండగా, మిక్కిలి అల్ప మైన సంగతులనుగూర్చి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? మనము దేవదూతలకు తీర్పు తీర్చుదుమని యెరుగరా? ఈ జీవన సంబంధమైన సంగతులనుగూర్చి మరిముఖ్యముగా తీర్పు తీర్చవచ్చును గదా?
- Leviticus 8:35 లేవీయకాండము 8:35మీరు చావకుండునట్లు మీరు ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునొద్ద ఏడు దినములవరకు రేయింబగళ్లుండి, యెహోవా విధించిన విధిని ఆచరింపవలెను; నాకు అట్టి ఆజ్ఞ కలిగెను.
- Jeremiah 15:19–21 యిర్మీయా 15:19–21కాబట్టి యెహోవా ఈలాగు సెలవిచ్చెను నీవు నాతట్టు తిరిగినయెడల నీవు నా సన్నిధిని నిలుచునట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. ఏవి నీచములో యేవి ఘనములో నీవు గురుతుపట్టినయెడల నీవు నా నోటివలె ఉందువు; వారు నీతట్టునకు తిరుగవలెను గాని నీవు వారి తట్టునకు తిరుగకూడదు అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని యిత్తడి ప్రాకారముగా నేను నియమించె దను; నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడైయుందును గనుక వారు నీమీద యుద్ధము చేయుదురు గాని నిన్ను జయింపకపోదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దుష్టుల చేతిలోనుండి నిన్ను విడిపించెదను, బలాత్కారుల చేతిలోనుండి నిన్ను విమోచించెదను.
- Luke 20:35–36 లూకా 20:35–36పరమును మృతుల పునరుత్థానమును పొందుటకు యోగ్యులని యెంచ బడినవారు పెండ్లిచేసికొనరు, పెండ్లికియ్య బడరు. వారు పునరుత్థానములో పాలివారైయుండి, దేవదూత సమానులును దేవుని కుమారులునై యుందురు గనుక వారికను చావనేరరు.
- Hebrews 12:22–23 హెబ్రీయులకు 12:22–23ఇప్పుడైతే సీయోనను కొండకును జీవముగల దేవుని పట్టణమునకు, అనగా పరలోకపు యెరూషలేమునకును, వేవేలకొలది దేవదూతలయొద్దకును, పరలోకమందు వ్రాయబడియున్న జ్యేష్టుల సంఘమునకును, వారి మహోత్సవమునకును, అందరి న్యాయాధిపతియైన దేవుని యొద్దకును, సంపూర్ణసిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును,
- John 14:2 యోహాను 14:2నా తండ్రి యింట అనేక నివాసములు కలవు, లేనియెడల మీతో చెప్పుదును; మీకు స్థలము సిద్ధపరచ వెళ్లుచున్నాను.
Original words (Hebrew)
- saith · H559אָמַר ʼâmar
- hosts · H6635צָבָא tsâbâʼ
- walk · H3212יָלַךְ yâlak
- ways · H1870דֶּרֶךְ derek
- keep · H8104שָׁמַר shâmar
- charge · H4931מִשְׁמֶרֶת mishmereth
- judge · H1777דִּין dîyn
- house · H1004בַּיִת bayith
- keep · H8104שָׁמַר shâmar
- courts · H2691חָצֵר châtsêr
- give · H5414נָתַן nâthan
- walk · H4108מַהְלֵךְ mahlêk
- by · H5975עָמַד ʻâmad