Genesis · chapter 26 · verse 5
Genesis 26:5 in Telugu
ఏలయనగా అబ్రాహాము నా మాట విని నేను విధించిన దాని నా ఆజ్ఞలను నా కట్టడలను నా నియమములను గైకొనెనని చెప్పెను.
Elayanagaa abraahaamu naa maata vini nenu vidhinchina daani naa aajnyalanu naa kattadalanu naa niyamamulanu gaikonenani cheppenu.
Genesis 26:5 in English
- King James Version (KJV)
- Because that Abraham obeyed my voice, and kept my charge, my commandments, my statutes, and my laws.
- World English Bible (WEB)
- because Abraham obeyed my voice, and kept my requirements, my commandments, my statutes, and my laws.”
- American Standard Version (ASV)
- because that Abraham obeyed my voice, and kept my charge, my commandments, my statutes, and my laws.
- Bible in Basic English (BBE)
- Because Abraham gave ear to my voice and kept my words, my rules, my orders, and my laws.
- Darby Translation (DBY)
- because that Abraham hearkened to my voice, and kept my charge, my commandments, my statutes, and my laws.
- Webster's Bible (WBS)
- Because that Abraham obeyed my voice, and kept my charge, my commandments, my statutes, and my laws.
- Young's Literal Translation (YLT)
- because that Abraham hath hearkened to My voice, and keepeth My charge, My commands, My statutes, and My laws.'
Read in context
- 3ఈ దేశమందు పరవాసివై యుండుము. నేను నీకు తోడైయుండి నిన్ను ఆశీర్వదించెదను;
- 4ఏలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నియు ఇచ్చి, నీ తండ్రియైన అబ్రాహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి, ఆకాశ నక్షత్రములవలె నీ సంతానమును విస్తరింపచేసి ఈ దేశములన్నియు నీ సంతానమునకు ఇచ్చెదను. నీ సంతానమువలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదింపబడుదురు.
- 5ఏలయనగా అబ్రాహాము నా మాట విని నేను విధించిన దాని నా ఆజ్ఞలను నా కట్టడలను నా నియమములను గైకొనెనని చెప్పెను.
- 6ఇస్సాకు గెరారులో నివసించెను.
- 7ఆ చోటి మనుష్యులు అతని భార్యను చూచి - ఆమె యెవరని అడిగినప్పుడు అతడు ఆమె నా సహోదరి అని చెప్పెను; ఎందుకనగా - రిబ్కా చక్కనిది గనుక ఈ చోటి మనుష్యులు ఆమె నిమిత్తము నన్ను చంపుదురేమో అనుకొని తన భార్య అని చెప్పుటకు భయపడెను.
Cross references
- Matthew 7:24 మత్తయి 7:24కాబట్టి యీ నా మాటలు విని వాటిచొప్పున చేయు ప్రతివాడును బండమీద తన యిల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును.
- Genesis 22:18 ఆదికాండము 22:18మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నియు నీ సంతానమువలన ఆశీర్వదించబడును నాతోడని ప్రమాణము చేసియున్నానని యెహోవా సెలవిచ్చెననెను.
- Genesis 22:16 ఆదికాండము 22:16నీవు నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని ఇయ్య వెనుకతీయక యీ కార్యము చేసినందున
- Psalm 112:1–2 కీర్తనలు 112:1–2యెహోవాను స్తుతించుడి యెహోవాయందు భయభక్తులుగలవాడు ఆయన ఆజ్ఞలనుబట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. వాని సంతతివారు భూమిమీద బలవంతులగుదురు యథార్థవంతుల వంశపువారు దీవింపబడుదురు
- James 2:21 యాకోబు 2:21మన పితరుడైన అబ్రాహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠముమీద అర్పించి నప్పుడు అతడు క్రియలవలన నీతిమంతుడని తీర్పు పొంద లేదా?
- Hebrews 11:8 హెబ్రీయులకు 11:8అబ్రాహాము పిలువబడినప్పుడు విశ్వాసమునుబట్టి ఆ పిలుపునకు లోబడి, తాను స్వాస్థ్యముగా పొందనైయున్న ప్రదేశమునకు బయలువెళ్లెను. మరియు ఎక్కడికి వెళ్లవలెనో అది ఎరుగక బయలు వెళ్ళెను.
- Galatians 5:6 గలతీయులకు 5:6యేసుక్రీస్తునందుండువారికి సున్నతిపొందుటయందేమియు లేదు, పొందకపోవుటయందేమియు లేదు గాని ప్రేమవలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగును.
- Psalm 128:1–6 కీర్తనలు 128:1–6యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచువారందరు ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము ననుభవించెదవు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లివలె నుండును నీ భోజనపు బల్లచుట్టు నీ పిల్లలు ఒలీవ మొక్కలవలె నుందురు. యెహోవాయందు భయభక్తులుగలవాడు ఈలాగు ఆశీర్వదింపబడును. సీయోనులోనుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును నీ జీవితకాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలుమీద సమాధానముండును గాక.
- Genesis 18:19 ఆదికాండము 18:19ఎట్లనగా యెహోవా అబ్రాహామును గూర్చి చెప్పినది అతనికి కలుగ జేయునట్లు తన తరువాత తన పిల్లలును తన యింటి వారును నీతి న్యాయములు జరిగించుచు, యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారి కాజ్ఞాపించినట్లు నేనతని నెరిగియున్నాననెను.
- 1 Corinthians 15:58 1 కొరింథీయులకు 15:58కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థముకాదని యెరిగి, స్థిరులును, కదలనివారును, ప్రభువు కార్యాభివృద్ధియందు ఎప్పటికిని ఆసక్తులునై యుండుడి.
- Genesis 12:4 ఆదికాండము 12:4యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్లెను. లోతు అతనితో కూడ వెళ్లెను. అబ్రాము హారానునుండి బయలుదేరినప్పుడు డెబ్బదియైదేండ్ల యీడు గలవాడు.
- Matthew 5:19 మత్తయి 5:19కాబట్టి యీ యాజ్ఞలలో మిగుల అల్పమైన యొకదానినైనను మీరి, మనుష్యులకు ఆలాగున చేయ బోధించువాడెవడో వాడు పరలోకరాజ్యములో మిగుల అల్పుడనబడును; అయితే వాటిని గైకొని బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యములో గొప్పవాడనబడును.