Zechariah · chapter 8 · verse 7
Zechariah 8:7 in Telugu
సైన్యములకు అధిపతియగు యెహోవా సెల విచ్చునదేమనగా తూర్పు దేశములోనుండియు పడమటి దేశములో నుండియు నేను నా జనులను రప్పించి రక్షించి
Sainyamulaku adhipatiyagu yehovaa sela vichchunademanagaa toorpu deshamulonundiyu padamati deshamulo nundiyu nenu naa janulanu rappinchi rakshinchi
Zechariah 8:7 in English
- King James Version (KJV)
- Thus saith the LORD of hosts; Behold, I will save my people from the east country, and from the west country;
- World English Bible (WEB)
- The LORD of Armies says: “Behold, I will save my people from the east country and from the west country.
- American Standard Version (ASV)
- Thus saith Jehovah of hosts: Behold, I will save my people from the east country, and from the west country;
- Bible in Basic English (BBE)
- This is what the Lord of armies has said: See, I will be the saviour of my people from the east country, and from the west country;
- Darby Translation (DBY)
- Thus saith Jehovah of hosts: Behold, I will save my people from the east country and from the west country;
- Webster's Bible (WBS)
- Thus saith the LORD of hosts; Behold, I will save my people from the east country, and from the west country;
- Young's Literal Translation (YLT)
- Thus said Jehovah of Hosts: Lo, I am saving My people from the land of the rising, And from the land of the going in, of the sun,
Read in context
- 5ఆ పట్టణపు వీధులు ఆటలాడు మగ పిల్లలతోను ఆడు పిల్లలతోను నిండియుండును.
- 6సైన్యము లకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగాఆ దినములందు శేషించియున్న జనులకిది ఆశ్చర్యమని తోచి నను నాకును ఆశ్చర్యమని తోచునా? యిదే యెహోవా వాక్కు.
- 7సైన్యములకు అధిపతియగు యెహోవా సెల విచ్చునదేమనగా తూర్పు దేశములోనుండియు పడమటి దేశములో నుండియు నేను నా జనులను రప్పించి రక్షించి
- 8యెరూషలేములో నివసించుటకై వారిని తోడుకొని వచ్చెదను, వారు నా జనులై యుందురు, నేను వారికి దేవుడనై యుందును; ఇది నీతి సత్యములనుబట్టి జరుగును.
- 9సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చు నదేమనగాసైన్యములకు అధిపతియగు యెహోవా మందిరమును కట్టుటకై దాని పునాదివేసిన దినమున ప్రవక్తల నోటపలుకబడిన మాటలు ఈ కాలమున వినువారలారా, ధైర్యము తెచ్చుకొనుడి.
Cross references
- Jeremiah 31:8 యిర్మీయా 31:8ఉత్తరదేశములోనుండియు నేను వారిని రప్పించు చున్నాను, గ్రుడ్డివారినేమి కుంటివారినేమి గర్భిణుల నేమి ప్రసవించు స్త్రీలనేమి భూదిగంతములనుండి అందరిని సమకూర్చుచున్నాను, మహాసంఘమై వారిక్కడికి తిరిగి వచ్చెదరు
- Malachi 1:11 మలాకీ 1:11తూర్పుదిశ మొదలుకొని పడమటి దిశవరకు అన్యజనులలో నా నామము ఘనముగా ఎంచ బడును, సకల స్థలములలో ధూపమును పవిత్రమైన యర్పణయును అర్పింపబడును, అన్య జనులలో నా నామము ఘనముగా ఎంచబడునని సైన్యములకు అధిపతి యగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.
- Isaiah 49:12 యెషయా 49:12చూడుడి వీరు దూరమునుండి వచ్చుచున్నారు వీరు ఉత్తర దిక్కునుండియు పడమటి దిక్కునుండియు వచ్చుచున్నారు వీరు సీనీయుల దేశమునుండి వచ్చుచున్నారు.
- Isaiah 43:5–6 యెషయా 43:5–6భయపడకుము, నేను నీకు తోడైయున్నాను తూర్పునుండి నీ సంతానమును తెప్పించెదను పడమటినుండి నిన్ను సమకూర్చి రప్పించెదను. అప్పగింపుమని ఉత్తరదిక్కునకు ఆజ్ఞ ఇచ్చెదను బిగబట్టవద్దని దక్షిణదిక్కునకు ఆజ్ఞ ఇచ్చెదను దూరమునుండి నా కుమారులను భూదిగంతమునుండి నా కుమార్తెలను తెప్పించుము.
- Amos 9:14–15 ఆమోసు 9:14–15మరియు శ్రమనొందుచున్న నా జనులగు ఇశ్రాయేలీయులను నేను చెరలోనుండి రప్పింతును, పాడైన పట్టణములను మరల కట్టుకొని వారు కాపురముందురు, ద్రాక్షతోటలు నాటి వాటి రసమును త్రాగుదురు, వనములువేసి వాటి పండ్లను తిందురు. వారి దేశమందు నేను వారిని నాటుదును, నేను వారికిచ్చిన దేశములోనుండి వారు ఇక పెరికివేయబడరని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు.
- Isaiah 27:12–13 యెషయా 27:12–13ఆ దినమున యూఫ్రటీసు నదీప్రవాహము మొదలు కొని ఐగుప్తునదివరకు యెహోవా తన ధాన్య మును త్రొక్కును. ఇశ్రాయేలీయులారా, మీరు ఒకరినొకరు కలిసికొని కూర్చబడుదురు. ఆ దినమున పెద్ద బూర ఊదబడును అష్షూరుదేశములో నశింప సిద్ధమైనవారును ఐగుప్తుదేశములో వెలివేయబడినవారును, వచ్చెదరు, యెరూషలేములోనున్న పరిశుద్ధపర్వతమున యెహోవాకు నమస్కారము చేయుదురు.
- Psalm 107:2–3 కీర్తనలు 107:2–3యెహోవా విమోచించినవారు ఆ మాట పలుకుదురు గాక విరోధుల చేతిలోనుండి ఆయన విమోచించినవారును తూర్పునుండి పడమటినుండి ఉత్తరమునుండి దక్షిణము నుండియు నానాదేశములనుండియు ఆయన పోగుచేసినవారును ఆమాట పలుకుదురుగాక.
- Isaiah 66:19–20 యెషయా 66:19–20నేను వారియెదుట ఒక సూచక క్రియను జరిగించెదను వారిలో తప్పించుకొనినవారిని విలుకాండ్రైన తర్షీషు పూలు లూదు అను జనుల యొద్ద కును తుబాలు యావాను నివాసులయొద్దకును నేను పంపె దను నన్నుగూర్చిన సమాచారము విననట్టియు నా మహి మను చూడనట్టియుదూరద్వీపవాసులయొద్దకు వారిని పంపెదనువారు జనములలో నా మహిమను ప్రకటించెదరు. ఇశ్రాయేలీయులు పవిత్రమైన పాత్రలో నైవేద్య మును యెహోవా మందిరములోనికి తెచ్చునట్లుగా గుఱ్ఱములమీదను రథములమీదను డోలీలమీదను కంచరగాడిదలమీదను ఒంటెలమీదను ఎక్కించి సర్వజనములలోనుండి నాకు ప్రతిష్ఠిత పర్వతమగు యెరూషలేమునకు మీ స్వదేశీయులను యెహోవాకు నైవేద్యముగా వారు తీసికొనివచ్చెదరని యెహోవా సెలవిచ్చు చున్నాడు.
- Ezekiel 37:19–25 యెహెజ్కేలు 37:19–25ఆ రెండు తునకలను వారి సమక్షమున నీవు చేతపట్టుకొని వారితో ఇట్లనుము ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా ఎఫ్రాయిము చేతిలోనున్న తునక, అనగా ఏ తునకమీద ఇశ్రాయేలువారందరి పేళ్లును వారితోటివారి పేళ్లును నేను ఉంచితినో యోసేపు అను ఆ తునకను యూదావారి తునకను నేను పట్టుకొని యొకటిగా జోడించి నా చేతిలో ఏకమైన తునకగా చేసెదను. ఇట్లుండగా వారి కీలాగు చెప్పుము ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా ఏయే అన్యజనులలో ఇశ్రాయేలీయులు చెదరిపోయిరో ఆ యా అన్యజనులలోనుండి వారిని రక్షించి, వారు ఎచ్చటెచ్చట ఉన్నారో అచ్చటనుండి వారిని సమకూర్చి వారి స్వదేశములోనికి తోడుకొనివచ్చి వారికమీదట ఎన్నటికిని రెండు జనములుగాను రెండు రాజ్యములుగాను ఉండ కుండునట్లు ఆ దేశములో ఇశ్రాయేలీయుల పర్వతముల మీద వారిని ఏకజనముగా చేసి, వారికందరికి ఒక రాజునే నియమించెదను. తమ విగ్రహముల వలనగాని తాము చేసియున్న హేయ క్రియలవలనగాని యే అతి క్రమక్రియలవలనగాని వారికమీదట తమ్మును అపవిత్ర పరచుకొనరు; తాము నివసించిన చోట్లన్నిటిలో వారు మానక పాపములు ఇక చేయకుండ వారిని రక్షించి వారిని పవిత్రపరచెదను, అప్పుడు వారు నా జనులగుదురు, నేను వారి దేవుడనై యుందును. నా సేవకుడైన దావీదు వారికి రాజవును, వారికందరికి కాపరి యొక్కడే యుండును, వారు నా విధులను అనుసరింతురు, నా కట్టడలను గైకొని ఆచరింతురు. మీ పితరులు నివసించునట్లు నా సేవకుడైన యాకోబునకు నేనిచ్చిన దేశములో వారు నివసింతురు, వారి పిల్లలును వారి పిల్లల పిల్లలును అక్కడ నిత్యము నివసింతురు, నా సేవకుడైన దావీదు ఎల్లకాలము వారికి అధిపతియై యుండును.
- Psalm 50:1 కీర్తనలు 50:1దేవాది దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు తూర్పుదిక్కు మొదలుకొని పడమటి దిక్కువరకు భూనివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు.
- Romans 11:25–27 రోమీయులకు 11:25–27సహోదరులారా, మీదృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనకుండునట్లు ఈ మర్మము మీరు తెలిసికొన గోరు చున్నాను. అదేమనగా, అన్యజనుల ప్రవేశము సంపూర్ణ మగువరకు ఇశ్రాయేలునకు కఠిన మనస్సు కొంతమట్టుకు కలిగెను. వారు ప్రవేశించు నప్పుడు విమోచకుడు సీయోనులోనుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును; నేను వారి పాపములను పరిహరించినప్పుడు నావలన వారికి కలుగు నిబంధన ఇదియే అని వ్రాయబడినట్టు ఇశ్రాయేలు జనులందరును రక్షింపబడుదురు.
- Isaiah 59:19 యెషయా 59:19పడమటి దిక్కుననున్నవారు యెహోవా నామమునకు భయపడుదురు సూర్యోదయ దిక్కుననున్నవారు ఆయన మహిమకు భయపడుదురు యెహోవా పుట్టించు గాలికి కొట్టుకొనిపోవు ప్రవాహ జలమువలె ఆయన వచ్చును.