Zephaniah · chapter 1 · verse 10
Zephaniah 1:10 in Telugu
ఆ దినమందు మత్స్యపు గుమ్మ ములో రోదనశబ్దమును, పట్టణపు దిగువ భాగమున అంగ లార్పును వినబడును, కొండల దిక్కునుండి గొప్ప నాశనము వచ్చును. ఇదే యెహోవా వాక్కు.
Aa dinamandu matsyapu gumma mulo rodanashabdamunu, pattanapu diguva bhaagamuna anga laarpunu vinabadunu, kondala dikkunundi goppa naashanamu vachchunu. Ide yehovaa vaakku.
Zephaniah 1:10 in English
- King James Version (KJV)
- And it shall come to pass in that day, saith the LORD, [that there shall be] the noise of a cry from the fish gate, and an howling from the second, and a great crashing from the hills.
- World English Bible (WEB)
- In that day, says the LORD, there will be the noise of a cry from the fish gate, a wailing from the second quarter, and a great crashing from the hills.
- American Standard Version (ASV)
- And in that day, saith Jehovah, there shall be the noise of a cry from the fish gate, and a wailing from the second quarter, and a great crashing from the hills.
- Bible in Basic English (BBE)
- And in that day, says the Lord, there will be the sound of a cry from the fish doorway, and an outcry from the new town, and a great thundering from the hills, and cries of grief from the people of the Hollow;
- Darby Translation (DBY)
- And in that day, saith Jehovah, there shall be the noise of a cry from the fish-gate, and a howling from the second [quarter], and a great crashing from the hills.
- Webster's Bible (WBS)
- And it shall come to pass in that day, saith the LORD, [that there shall be] the noise of a cry from the fish-gate, and a howling from the second, and a great crashing from the hills.
- Young's Literal Translation (YLT)
- And there hath been in that day, An affirmation of Jehovah, The noise of a cry from the fish-gate, And of a howling from the Second, And of great destruction from the hills.
Read in context
- 8యెహోవా యేర్పరచిన బలి దినమందు అధిపతులను రాజకుమారులను అన్యదేశస్థులవలె వస్త్రములు వేసికొనువారినందరిని నేను శిక్షింతును.
- 9మరియు ఇండ్ల గడపలు దాటివచ్చి యజమానుని యింటిని మోసముతోను బలాత్కారముతోను నింపువారిని ఆ దిన మందు నేను శిక్షింతును.
- 10ఆ దినమందు మత్స్యపు గుమ్మ ములో రోదనశబ్దమును, పట్టణపు దిగువ భాగమున అంగ లార్పును వినబడును, కొండల దిక్కునుండి గొప్ప నాశనము వచ్చును. ఇదే యెహోవా వాక్కు.
- 11కనానీయులందరు నాశమైరి, ద్రవ్యము సమకూర్చుకొనినవారందరును నిర్మూలము చేయబడిరి గనుక మక్తేషు లోయ నివాసులారా, అంగలార్చుడి.
- 12ఆ కాలమున నేను దీపములు పట్టుకొని యెరూషలేమును పరిశోధింతును, మడ్డిమీద నిలిచిన ద్రాక్షారసమువంటివారైయెహోవా మేలైనను కీడైనను చేయువాడు కాడని మనస్సులో అనుకొనువారిని శిక్షిం తును.
Cross references
- 2 Chronicles 33:14 2 దినవృత్తాంతములు 33:14ఇదియైన తరువాత అతడు దావీదు పట్టణము బయట గిహోనుకు పడమరగా లోయయందు మత్స్యపు గుమ్మము వరకు ఓపెలు చుట్టును బహు ఎత్తుగల గోడను కట్టించెను. మరియు యూదా దేశములోని బలమైన పట్టణములన్నిటిలోను సేనాధిపతులను ఉంచెను.
- 2 Kings 22:14 2 రాజులు 22:14కాబట్టి యాజకుడైన హిల్కీయాయును, అహికామును, అక్బోరును, షాఫానును, అశాయా యును ప్రవక్త్రియగు హుల్దాయొద్దకు వచ్చిరి. ఈమె వస్త్ర శాలకు అధికారియగు హర్హషుకు పుట్టిన తిక్వాకు కుమారుడైన షల్లూమునకు భార్యయై యెరూషలేములో రెండవ భాగమందు కాపురస్థురాలై యుండెను. ఈమెయొద్దకు వారు వచ్చి మాటలాడగా
- Amos 8:3 ఆమోసు 8:3ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా మందిరములో వారు పాడు పాటలు ఆ దినమున ప్రలాపములగును, శవములు లెక్కకు ఎక్కు వగును, ప్రతిస్థలమందును అవి పారవేయబడును. ఊరకుండుడి.
- Nehemiah 3:3 నెహెమ్యా 3:3మత్స్యపు గుమ్మమును హస్సెనాయా వంశస్థులుకట్టిరి; మరియు వారు దానికి దూలములను ఎత్తి తలుపులు నిలిపి తాళములను గడియలను ఆమర్చిరి.
- Jeremiah 4:19–21 యిర్మీయా 4:19–21నా కడుపు, నా కడుపు, నా అంతరంగములో నా కెంతో వేదనగానున్నది; నా గుండె నరములు, నా గుండె కొట్టుకొనుచున్నది, తాళలేను; నా ప్రాణమా, బాకానాదము వినబడుచున్నది గదా, యుద్ధఘోష నీకు వినబడుచున్నది గదా? కీడు వెంట కీడు వచ్చుచున్నది, దేశమంతయు దోచుకొనబడుచున్నది, నా గుడారములును హఠాత్తుగాను నిమిషములో నా డేరా తెరలును దోచు కొనబడియున్నవి. నేను ఎన్నాళ్లు ధ్వజమును చూచుచుండవలెను బూరధ్వని నేనెన్నాళ్లు వినుచుండవలెను?
- Jeremiah 39:2 యిర్మీయా 39:2సిద్కియా యేలు బడియందు పదకొండవ సంవత్సరము నాలుగవ నెల తొమ్మిదవ దినమున పట్టణ ప్రాకారములు పడగొట్టబడెను.
- Jeremiah 4:31 యిర్మీయా 4:31ప్రసవవేదనపడు స్త్రీ కేకలువేయునట్లు, తొలికానుపు కనుచు వేదనపడు స్త్రీ కేకలువేయునట్లు సీయోనుకుమార్తె అయ్యో, నాకు శ్రమ, నరహంతకులపాలై నేను మూర్చిల్లుచున్నాను అని యెగరోజుచు చేతులార్చుచు కేకలువేయుట నాకు వినబడుచున్నది.
- Isaiah 59:11 యెషయా 59:11మేమందరము ఎలుగుబంట్లవలె బొబ్బరించుచున్నాము గువ్వలవలె దుఃఖరవము చేయుచున్నాము న్యాయముకొరకు కాచుకొనుచున్నాము గాని అది లభించుటలేదు రక్షణకొరకు కాచుకొనుచున్నాము గాని అది మాకు దూరముగా ఉన్నది
- 2 Chronicles 32:22 2 దినవృత్తాంతములు 32:22ఈ ప్రకారము యెహోవా హిజ్కియాను యెరూషలేము కాపురస్థులను అష్షూరు రాజైన సన్హెరీబు చేతిలోనుండియు అందరిచేతిలోనుండియు రక్షించి, అన్నివైపులను వారిని కాపాడినందున
- 2 Samuel 5:9 2 సమూయేలు 5:9దావీదు ఆ కోటలో కాపురముండి దానికి దావీదుపురమను పేరు పెట్టెను. మరియు మిల్లోనుండి దిగువకు దావీదు ఒక ప్రాకారమును కట్టించెను.
- Zephaniah 1:15 జెఫన్యా 1:15ఆ దినము ఉగ్రతదినము, శ్రమయు ఉప ద్రవమును మహానాశనమును కమ్ముదినము, అంధకారమును గాఢాంధకారమును కమ్ముదినము, మేఘములును గాఢాంధ కారమును కమ్ముదినము.
- 2 Chronicles 3:1 2 దినవృత్తాంతములు 3:1తరువాత సొలొమోను యెరూషలేములో తన తండ్రి యైన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మోరీయా పర్వతమందు దావీదు సిద్ధపరచిన స్థలమున యెబూసీయుడైన ఒర్నాను కళ్లమందు దావీదు ఏర్పరచిన స్థలమున యెహోవాకు ఒక మందిరమును కట్టనారం భించెను.