Zephaniah · chapter 1 · verse 16
Zephaniah 1:16 in Telugu
ఆ దినమున ప్రాకారములుగల పట్టణముల దగ్గరను, ఎత్తయిన గోపురముల దగ్గరను యుద్ధ ఘోషణయు బాకానాదమును వినబడును.
Aa dinamuna praakaaramulugala pattanamula daggaranu, ettayina gopuramula daggaranu yuddha ghoshanayu baakaanaadamunu vinabadunu.
Zephaniah 1:16 in English
- King James Version (KJV)
- A day of the trumpet and alarm against the fenced cities, and against the high towers.
- World English Bible (WEB)
- a day of the trumpet and alarm against the fortified cities and against the high battlements.
- American Standard Version (ASV)
- a day of the trumpet and alarm, against the fortified cities, and against the high battlements.
- Bible in Basic English (BBE)
- A day of sounding the horn and the war-cry against the walled towns and the high towers.
- Darby Translation (DBY)
- a day of the trumpet and alarm, against the fenced cities and against the high battlements.
- Webster's Bible (WBS)
- A day of the trumpet and alarm against the fortified cities, and against the high towers.
- Young's Literal Translation (YLT)
- A day of trumpet and shouting against the fenced cities, And against the high corners.
Read in context
- 14యెహోవా మహా దినము సమీపమాయెను, యెహోవా దినము సమీపమై అతి శీఘ్రముగా వచ్చుచున్నది. ఆలకించుడి, యెహోవా దినము వచ్చుచున్నది, పరాక్రమశాలురు మహారోదనము చేయుదురు.
- 15ఆ దినము ఉగ్రతదినము, శ్రమయు ఉప ద్రవమును మహానాశనమును కమ్ముదినము, అంధకారమును గాఢాంధకారమును కమ్ముదినము, మేఘములును గాఢాంధ కారమును కమ్ముదినము.
- 16ఆ దినమున ప్రాకారములుగల పట్టణముల దగ్గరను, ఎత్తయిన గోపురముల దగ్గరను యుద్ధ ఘోషణయు బాకానాదమును వినబడును.
- 17జనులు యెహోవా దృష్టికి పాపము చేసిరి గనుక నేను వారి మీదికి ఉపద్రవము రప్పింపబోవుచున్నాను; వారు గ్రుడ్డి వారివలె నడిచెదరు, వారి రక్తము దుమ్మువలె కారును, వారి మాంసము పెంటవలె పారవేయబడును.
- 18యెహోవా ఉగ్రత దినమున తమ వెండి బంగారములు వారిని తప్పింప లేకపోవును, రోషాగ్నిచేత భూమియంతయు దహింప బడును, హఠాత్తుగా ఆయన భూనివాసులనందరిని సర్వ నాశనము చేయబోవుచున్నాడు.
Cross references
- Hosea 8:1 హోషేయ 8:1బాకా నీ నోటను ఉంచి ఊదుము, జనులు నా నిబంధన నతిక్రమించి నా ధర్మశాస్త్రమును మీరియున్నారు గనుక పక్షిరాజు వ్రాలినట్టు శత్రువు యెహోవా మందిర మునకు వచ్చునని ప్రకటింపుము.
- Amos 3:6 ఆమోసు 3:6పట్టణమందు బాకానాదము వినబడగా జనులకు భయము పుట్టకుండునా? యెహోవా చేయనిది పట్టణములో ఉపద్రవము కలుగునా?
- Isaiah 2:12–15 యెషయా 2:12–15అహంకారాతిశయముగల ప్రతిదానికిని ఔన్నత్యము గల ప్రతిదానికిని విమర్శించు దినమొకటి సైన్యములకధిపతియగు యెహోవా నియమించియున్నాడు అవి అణగద్రొక్కబడును. ఔన్నత్యము కలిగి అతిశయించు లెబానోను దేవదారు వృక్షములకన్నిటికిని బాషాను సిందూర వృక్షములకన్నిటికిని ఉన్నతపర్వతములకన్నిటికిని ఎత్తయిన మెట్లకన్నిటికిని ఉన్నతమైన ప్రతిగోపురమునకును బురుజులుగల ప్రతి కోటకును
- Isaiah 32:14 యెషయా 32:14నగరి విడువబడును జనసమూహముగల పట్టణము విడువబడును కొండయు కాపరుల గోపురమును ఎల్లకాలము గుహలుగా ఉండును
- Jeremiah 4:19–20 యిర్మీయా 4:19–20నా కడుపు, నా కడుపు, నా అంతరంగములో నా కెంతో వేదనగానున్నది; నా గుండె నరములు, నా గుండె కొట్టుకొనుచున్నది, తాళలేను; నా ప్రాణమా, బాకానాదము వినబడుచున్నది గదా, యుద్ధఘోష నీకు వినబడుచున్నది గదా? కీడు వెంట కీడు వచ్చుచున్నది, దేశమంతయు దోచుకొనబడుచున్నది, నా గుడారములును హఠాత్తుగాను నిమిషములో నా డేరా తెరలును దోచు కొనబడియున్నవి.
- Psalm 48:12–13 కీర్తనలు 48:12–13ముందు రాబోవు తరములకు దాని వివరము మీరు చెప్పునట్లు సీయోనుచుట్టు తిరుగుచు దానిచుట్టు సంచరించుడి దాని బురుజులను లెక్కించుడి దాని ప్రాకారములను నిదానించి చూడుడి దాని నగరులలో సంచరించి వాటిని చూడుడి.
- Isaiah 59:10 యెషయా 59:10గోడ కొరకు గ్రుడ్డివారివలె తడవులాడుచున్నాము కన్నులు లేనివారివలె తడవులాడుచున్నాము సంధ్యచీకటియందువలెనే మధ్యాహ్నకాలమున కాలు జారి పడుచున్నాము బాగుగ బ్రతుకుచున్నవారిలోనుండియు చచ్చినవారి వలె ఉన్నాము.
- Hosea 5:8 హోషేయ 5:8గిబియాలో బాకానాదము చేయుడి, రామాలో బూర ఊదుడి; బెన్యామీనీయులారా మీ మీదికి శిక్ష వచ్చుచున్నదని బేతావెనులో బొబ్బపెట్టుడి.
- Habakkuk 3:6 హబక్కూకు 3:6ఆయన నిలువబడగా భూమి కంపించును ఆయన చూడగా జనులందరు ఇటు అటు తొలుగు దురు ఆదికాల పర్వతములు బద్దలైపోవును పురాతన గిరులు అణగును పూర్వకాలము మొదలుకొని ఆయన ఈలాగు జరి గించువాడు.
- Jeremiah 6:1 యిర్మీయా 6:1బెన్యామీనీయులారా, యెరూషలేములో నుండి పారి పోవుడి, తెకోవలో బూరధ్వని చేయుడి, బేత్ హక్కెరెము మీద ఆనవాలుకై ధ్వజము నిలువబెట్టుడి, కీడు ఉత్తర దిక్కునుండి వచ్చుచున్నది, గొప్ప దండు వచ్చుచున్నది.
- Habakkuk 1:6–10 హబక్కూకు 1:6–10ఆలకించుడి, తమవికాని ఉనికిపట్టులను ఆక్రమించవలెనని భూదిగంతములవరకు సంచరించు ఉద్రేకముగల క్రూరులగు కల్దీయులను నేను రేపు చున్నాను. వారు ఘోరమైన భీకరజనముగా ఉన్నారు, వారు ప్రభుత్వ మును విధులను తమ యిచ్ఛవచ్చినట్లు ఏర్పరచుకొందురు. వారి గుఱ్ఱ ములు చిరుతపులులకంటె వేగముగా పరుగులెత్తును, రాత్రి యందు తిరుగులాడు తోడేళ్లకంటెను అవి చురుకైనవి;వారి రౌతులు దూరమునుండి వచ్చి తటాలున జొరబడు దురు, ఎరను పట్టుకొనుటకై పక్షిరాజు వడిగా వచ్చునట్లు వారు పరుగులెత్తి వత్తురు. వెనుక చూడకుండ బలా త్కారము చేయుటకై వారు వత్తురు, ఇసుక రేణువులంత విస్తారముగా వారు జనులను చెరపట్టు కొందురు. రాజు లను అపహాస్యము చేతురు, అధిపతులను హేళన చేతురు, ప్రాకారముగల దుర్గములన్నిటిని తృణీకరింతురు, మంటి దిబ్బవేసి వాటిని పట్టుకొందురు.
- Jeremiah 8:16 యిర్మీయా 8:16దానునుండి వచ్చువారి గుఱ్ఱముల బుసలు వినబడెను, వారి గుఱ్ఱముల సకిలింపు ధ్వనిచేత దేశమంతయు కంపించుచున్నది, వారు వచ్చి దేశమును అందులోనున్న యావత్తును నాశనము చేయుదురు, పట్టణమును అందులో నివసించువారిని నాశ నము చేయుదురు.