Zephaniah · chapter 2 · verse 4
Zephaniah 2:4 in Telugu
గాజాపట్టణము నిర్జనమగును, అష్కెలోను పాడై పోవును, మధ్యాహ్నకాలమందు అష్డోదువారు బయటికి పారదోలబడుదురు, ఎక్రోను పట్ట ణము దున్నబడును.
Gaajaapattanamu nirjanamagunu, ashkelonu paadai povunu, madhyaahnakaalamandu ashdoduvaaru bayatiki paaradolabaduduru, ekronu patta namu dunnabadunu.
Zephaniah 2:4 in English
- King James Version (KJV)
- For Gaza shall be forsaken, and Ashkelon a desolation: they shall drive out Ashdod at the noon day, and Ekron shall be rooted up.
- World English Bible (WEB)
- For Gaza will be forsaken, and Ashkelon a desolation. They will drive out Ashdod at noonday, and Ekron will be rooted up.
- American Standard Version (ASV)
- For Gaza shall be forsaken, and Ashkelon a desolation; they shall drive out Ashdod at noonday, and Ekron shall be rooted up.
- Bible in Basic English (BBE)
- For Gaza will be given up and Ashkelon will become waste: they will send Ashdod out in the middle of the day, and Ekron will be uprooted.
- Darby Translation (DBY)
- For Gazah shall be forsaken, and Ashkelon shall be a desolation; they shall drive out Ashdod at noonday, and Ekron shall be rooted up.
- Webster's Bible (WBS)
- For Gaza shall be forsaken, and Ashkelon a desolation: they shall drive out Ashdod at the noon day, and Ekron shall be rooted up.
- Young's Literal Translation (YLT)
- For Gaza is forsaken, And Ashkelon [is] for a desolation, Ashdod! at noon they do cast her forth, And Ekron is rooted up.
Read in context
- 2విధి నిర్ణయము కాకమునుపే యెహోవా కోపాగ్ని మీ మీదికి రాక మునుపే, మిమ్మును శిక్షించుటకై యెహోవా ఉగ్రతదినము రాకమునుపే కూడిరండి.
- 3దేశములో సాత్వికులై ఆయన న్యాయవిధుల ననుసరించు సమస్త దీనులారా, యెహో వాను వెదకుడి; మీరు వెదకి వినయముగలవారై నీతిని అనుసరించినయెడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు.
- 4గాజాపట్టణము నిర్జనమగును, అష్కెలోను పాడై పోవును, మధ్యాహ్నకాలమందు అష్డోదువారు బయటికి పారదోలబడుదురు, ఎక్రోను పట్ట ణము దున్నబడును.
- 5సముద్రప్రాంతమందు నివసించు కెరేతీయులారా, మీకు శ్రమ; ఫిలిష్తీయుల దేశమైన కనానూ, నిన్ను గూర్చి యెహోవా సెలవిచ్చునదేమనగా నీయందు ఒక కాపురస్థుడైనను లేకుండ నేను నిన్ను లయముచేతును.
- 6సముద్రప్రాంతము గొఱ్ఱెల కాపరులు దిగు మేతస్థలమగును, మందలకు దొడ్లు అచ్చట నుండును.
Cross references
- Zechariah 9:5–7 జెకర్యా 9:5–7అష్కెలోను దానిని చూచి జడియును, గాజా దానిని చూచి బహుగా వణకును, ఎక్రోనుపట్టణము తాను నమ్ము కొనినది అవమానము నొందగా చూచి భీతినొందును, గాజారాజు లేకుండపోవును, అష్కెలోను నిర్జనముగా ఉండును. అష్డోదులో సంకరజనము కాపురముండును, ఫిలిష్తీయుల అతిశయాస్పదమును నేను నాశనము చేసె దను. వారి నోటనుండి రక్తమును వారికను తినకుండ వారి పండ్లనుండి హేయమైన మాంసమును నేను తీసివేసెదను. వారును శేషముగా నుందురు, మన దేవునికి వారు యూదా వారిలో పెద్దలవలె నుందురు, ఎక్రోనువారును యెబూ సీయులవలె నుందురు.
- Amos 1:6–8 ఆమోసు 1:6–8యెహోవా సెలవిచ్చునదేమనగా గాజా మూడుసార్లు నాలుగు సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండ దాని శిక్షింతును; ఏలయనగా ఎదోము వారి కప్పగింపవలె నని తాము చెరపట్టినవారినందరిని కొనిపోయిరి. గాజా యొక్క ప్రాకారముమీద నేను అగ్ని వేసెదను, అది వారి నగరులను దహించివేయును; అష్డోదులో నివాసులను నిర్మూలము చేతును, అష్కెలోనులో రాజదండము వహించిన వాడుండకుండ నిర్మూలముచేతును, ఇంకను శేషించియున్న ఫిలిష్తీయులును క్షయమగునట్లు నేను ఎక్రోనును మొత్తెదనని ప్రభువగు యెహోవా సెలవిచ్చు చున్నాడు.
- Jeremiah 47:1–7 యిర్మీయా 47:1–7ఫరో గాజాను కొట్టకమునుపు ఫిలిష్తీయులనుగూర్చి ప్రవక్తయైన యిర్మీయాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు జలములు ఉత్తరదిక్కునుండి పొర్లి వరదలై మనుష్యులు మొఱ్ఱపెట్టునట్లుగాను దేశనివాసులందరు అంగలార్చునట్లు గాను, దేశముమీదను అందున్న సమస్తముమీదను పట్టణము మీదను దానిలో నివసించు వారిమీదను ప్రవహించును. వారి బలమైన గుఱ్ఱముల డెక్కలు నేలతన్ను శబ్దమునకును, అతని రథముల వేగమునకును, అతని చక్రముల ఉరుము వంటి ధ్వనికిని తండ్రులు భయపడి బలహీనులై తమ పిల్లల తట్టు తిరిగి చూడరు. ఫిలిష్తీయులనందరిని లయపరచుటకును, తూరు సీదోనులకు సహాయకుడొకడైనను నిలువకుండ అందరిని నిర్మూలము చేయుటకును దినము వచ్చుచున్నది. యెహోవా కఫ్తోరు ద్వీపశేషులైన ఫిలిష్తీయులను నాశనము చేయును, గాజా బోడియాయెను, మైదానములో శేషించిన ఆష్కెలోను నాశనమాయెను. ఎన్నాళ్లవరకు నిన్ను నీవే గాయపరచుకొందువు? యెహోవా ఖడ్గమా, యెంత వరకు విశ్రమింపక యుందువు? నీ వరలోనికి దూరి విశ్రమించి ఊరకుండుము. అష్కెలోనుమీదికిని సముద్ర తీరముమీదికిని పొమ్మని యెహోవా నీకు ఆజ్ఞ ఇచ్చి యున్నాడు గదా; నీవేలాగు విశ్రమించుదువు? అచ్చటికే పొమ్మని ఆయన ఖడ్గమునకు ఆజ్ఞ ఇచ్చియున్నాడు.
- Jeremiah 25:20 యిర్మీయా 25:20సమస్తమైన మిశ్రిత జనులును ఊజుదేశపు రాజులందరును ఫిలిష్తీయుల దేశపు రాజులందరును అష్కెలోనును, గాజ యును, ఎక్రోనును అష్డోదు శేషపువారును
- Jeremiah 15:8 యిర్మీయా 15:8వారి విధవరాండ్రు సముద్రపు ఇసుకకంటె విస్తారముగా ఉందురు; మధ్యాహ్నకాలమున ¸యౌవనుల తల్లిమీదికి దోచుకొనువారిని నేను రప్పింతును; పరితాపమును భయములను ఆకస్మాత్తుగా వారిమీదికి రాజేతును.
- Jeremiah 6:4 యిర్మీయా 6:4ఆమెతో యుద్ధమునకు సిద్ధపరచుకొనుడి; లెండి, మధ్యాహ్నమందు బయలుదేరుదము. అయ్యో, మనకు శ్రమ, ప్రొద్దు గ్రుంకుచున్నది, సాయంకాలపు ఛాయలు పొడుగవుచున్నవి.
- Ezekiel 25:15–17 యెహెజ్కేలు 25:15–17మరియు ప్రభువగు యెహోవా ఈ మాట సెలవిచ్చు చున్నాడు ఫీలిష్తీయులు పగతీర్చుకొనుచు నాశము చేయుచు, మానని క్రోధముగలవారై తిరస్కారము చేయుచు పగతీర్చుకొనుచున్నారు గనుక ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగాఫిలిష్తీయులమీద నేను చెయ్యి చాపి కెరేతీయులను నిర్మూలముచేసెదను. సముద్ర తీరమున నివసించు శేషమును నశింపజేసెదను. క్రోధముతో వారిని శిక్షించి వారిమీద నా పగ పూర్తిగా తీర్చుకొందును; నేను వారి మీద నా పగ తీర్చుకొనగా నేను యెహోవానై యున్నానని వారు తెలిసికొందురు.
- Psalm 91:6 కీర్తనలు 91:6చీకటిలో సంచరించు తెగులునకైనను మధ్యాహ్నమందు పాడుచేయు రోగమునకైనను నీవు భయపడకుందువు.