Skip to content
ThuthiThuthiThuthi

Aashrayudaa Naa Yesayya Stuti Mahima Prabhaavamu Song Lyricsఆశ్రయుడా నా యేసయ్య స్తుతి మహిమ ప్రభావము

Aashrayudaa Naa Yesayya Stuti Mahima Prabhaavamu Lyrics in Telugu & English

Present

Chorus

ఆశ్రయుడా నా యేసయ్య

స్తుతి మహిమ ప్రభావము నీకేనయ్యా (2)

విశ్వవిజేతవు సత్య విధాతవు నిత్యముమహిమకు ఆధారము నీవు (2)

Aashrayudaa Naa Yesayya

Stuti Mahima Prabhaavamu Neekenayyaa (2)

Vishvavijetavu Satya Vidhaatavu Nityamumahimaku Aadhaaramu Neevu (2)

Verse 1

లోకసాగరాన కృంగిన వేళ

నిత్యమైన కృపతో వాత్సల్యము చూపి నను చేరదీసిన నిర్మలుడా

నీకేనయ్యా ఆరాధనా నీకేనయ్యా స్తుతి ఆరాధనా (2)

||ఆశ్రయుడా నా యేసయ్య||

Lokasaagaraana Krungina Vela

Nityamaina Krupato Vaatsalyamu Choopi Nanu Cheradeesina Nirmaludaa

Neekenayyaa Aaraadhanaa Neekenayyaa Stuti Aaraadhanaa (2)

||Aashrayudaa Naa Yesayya||

Verse 2

తెల్లని వెన్నెల కాంతివి నీవు చల్లని మమతల మనసే నీవు (2)

కరుణనుచూపి కలుషముబాపి

నను ప్రేమించిన ప్రేమవు నీవు (2)

జనులకు దైవం జగతికి దీపం నీవు గాక ఎవరున్నారు? నీవే నీవే ఈ సృష్టిలో

కొనియాడబడుచున్న మహారాజు (2)

||ఆశ్రయుడా నా యేసయ్య||

Tellani Vennela Kaantivi Neevu Challani Mamatala Manase Neevu (2)

Karunanuchoopi Kalushamubaapi

Nanu Preminchina Premavu Neevu (2)

Janulaku Daivam Jagatiki Deepam Neevu Gaaka Evarunnaaru? Neeve Neeve Ee Srushtilo

Koniyaadabaduchunna Mahaaraaju (2)

||Aashrayudaa Naa Yesayya||

Verse 3

జీవిత దినములు అధికములగునని వాగ్దానము చేసి దీవించితివి (2)

ఆపత్కాలమున అండగా నిలిచి ఆశల జాడలు చూపించితివి (2)

శ్రీమంతుడవై సిరికే రాజువై వెదలను

బాపి నా స్థితి మార్చితివి అనురాగమే నీ ఐశ్వర్యమా సాత్వికమే నీ సౌందర్యమా (2)

||ఆశ్రయుడా నా యేసయ్య||

Jeevita Dinamulu Adhikamulagunani Vaagdaanamu Chesi Deevinchitivi (2)

Aapatkaalamuna Andagaa Nilichi Aashala Jaadalu Choopinchitivi (2)

Shreemantudavai Sirike Raajuvai Vedalanu

Baapi Naa Sthiti Maarchitivi Anuraagame Nee Aishvaryamaa Saatvikame Nee Saundaryamaa (2)

||Aashrayudaa Naa Yesayya||

Verse 4

నీ చిత్తముకై అరుణోదయమున అర్పించెదనునా స్తుతి అర్పణ (2)

పరిశుద్ధులలో నీ స్వాస్త్యము యొక్క

మహిమైశ్వర్యము నేపొందుటకు (2)

ప్రతి విషయములో స్తుతి చెల్లించుచు పరిశుద్ధాత్మలో ప్రార్ధించెదను

పరిశుద్ధుడా పరిపూర్ణుడా నీ చిత్తమే నాలో నెరవేర్చుమా

||ఆశ్రయుడా నా యేసయ్య||

Nee Chittamukai Arunodayamuna Arpinchedanunaa Stuti Arpana (2)

Parishuddhulalo Nee Svaastyamu Yokka

Mahimaishvaryamu Nepondutaku (2)

Prati Vishayamulo Stuti Chellinchuchu Parishuddhaatmalo Praardhinchedanu

Parishuddhudaa Paripoornudaa Nee Chittame Naalo Neraverchumaa

||Aashrayudaa Naa Yesayya||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with A