Skip to content
ThuthiThuthiThuthi

Annee Saadhyame Yesuku Annee Saadhyame Song Lyricsఅన్నీ సాధ్యమే యేసుకు అన్నీ సాధ్యమే

Annee Saadhyame Yesuku Annee Saadhyame Lyrics in Telugu & English

Present

Chorus

అన్నీ సాధ్యమే యేసుకు అన్నీ సాధ్యమే (2)

అద్భుత శక్తిని నెరపుటకైనా

ఆశ్చర్య కార్యములొసగుటకైనా (2)

ఆ యేసు రక్తానికి

సాధ్యమే సాధ్యమే సాధ్యమే (2)

||అన్నీ సాధ్యమే||

Annee Saadhyame Yesuku Annee Saadhyame (2)

Adbhuta Shaktini Neraputakainaa

Aashcharya Kaaryamulosagutakainaa (2)

Aa Yesu Raktaaniki

Saadhyame Saadhyame Saadhyame (2)

||Annee Saadhyame||

Verse 1

మాధుర్యమైన జలముగా – మారాను ప్రభు మార్చెను

మృత్యువు నుండి లాజరును – మాహిమార్థముకై లేపెను (2)

మన్నాను కురిపించగా – ఆకాశమే తెరిచెను

మరణాన్ని ఓడించగా – మృత్యుంజయుడై లేచెను (2)

||అన్నీ సాధ్యమే||

Maadhuryamaina Jalamugaa – Maaraanu Prabhu Maarchenu

Mrutyuvu Nundi Laajarunu – Maahimaarthamukai Lepenu (2)

Mannaanu Kuripinchagaa – Aakaashame Terichenu

Maranaanni Odinchagaa – Mrutyunjayudai Lechenu (2)

||Annee Saadhyame||

Verse 2

బండనే చీల్చగా – జలములే పొంగెను

ఎండిపోయిన భూమిపై – ఏరులై అవి పారెను (2)

బందంటే క్రీస్తేనని – నీ దండమే తానని

మెండైన తన కృపలో – నీకండగా నిలచును (2)

||అన్నీ సాధ్యమే||

Bandane Cheelchagaa – Jalamule Pongenu

Endipoyina Bhoomipai – Erulai Avi Paarenu (2)

Bandante Kreestenani – Nee Dandame Taanani

Mendaina Tana Krupalo – Neekandagaa Nilachunu (2)

||Annee Saadhyame||

Verse 3

ఏకాంతముగా మోకరిల్లి – ప్రార్ధించుటే శ్రేయము

ఏల నాకీ శ్రమలని – పూర్ణ మనసుతో వేడుము (2)

యేసయ్య నీ వేదన – ఆలించి మన్నించును

ఏ పాటి వ్యధలైననూ – ఆ సిల్వలో తీర్చును (2)

||అన్నీ సాధ్యమే||

Ekaantamugaa Mokarilli – Praardhinchute Shreyamu

Ela Naakee Shramalani – Poorna Manasuto Vedumu (2)

Yesayya Nee Vedana – Aalinchi Manninchunu

E Paati Vyadhalainanoo – Aa Silvalo Teerchunu (2)

||Annee Saadhyame||

Verse 4

కష్టాల కడలిలో – కన్నీటి లోయలో

కనికరమే ప్రభు చూపును – కంటిపాపలా కాయును (2)

కలిగించు విశ్వాసము – కాదేదీ అసాధ్యము

క్రీస్తేసు నామములో – కడగండ్లకే మోక్షము (2)

||అన్నీ సాధ్యమే||

Kashtaala Kadalilo – Kanneeti Loyalo

Kanikarame Prabhu Choopunu – Kantipaapalaa Kaayunu (2)

Kaliginchu Vishvaasamu – Kaadedee Asaadhyamu

Kreestesu Naamamulo – Kadagandlake Mokshamu (2)

||Annee Saadhyame||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with A