Skip to content
ThuthiThuthiThuthi

Devude Ila Cheretanduku Ennukunna Maargam Song Lyricsదేవుడే ఇల చేరేటందుకు ఎన్నుకున్న మార్గం

Devude Ila Cheretanduku Ennukunna Maargam Lyrics in Telugu & English

Present

Verse 1

దేవుడే ఇల చేరేటందుకు ఎన్నుకున్న మార్గం

అమ్మా అంటూ పిలుచుకొని పొందుకొనెను జన్మం

నీకంటూ ఏది లేదన్నట్లు ఎందుకంత త్యాగం

కనరాని ప్రేమకు నీవేగా కదలాడుతున్న రూపం (2)

అమ్మా నీ ఋణమును తీర్చే సిరులు లేవు ఇలలో

ఆ దైవము సైతము నేర్చె పాఠాలు చల్లని నీ ఒడిలో (2)

||దేవుడే||

Devude Ila Cheretanduku Ennukunna Maargam

Ammaa Antoo Piluchukoni Pondukonenu Janmam

Neekantoo Edi Ledannatlu Endukanta Tyaagam

Kanaraani Premaku Neevegaa Kadalaadutunna Roopam (2)

Ammaa Nee Runamunu Teerche Sirulu Levu Ilalo

Aa Daivamu Saitamu Nerche Paathaalu Challani Nee Odilo (2)

||Devude||

Verse 2

కన్న బిడ్డను పరాయి బిడ్డగా పెంచుకున్న మమకారం

తన ప్రజల విముక్తికి దేవుడు చేసిన కార్యంలో సహకారం (2)

మోషేగా మారిన పసివాడిని

దాసిగా పెంచిన కన్నతల్లి సుగుణం (2)

దాసిగా పెంచిన కన్నతల్లి సుగుణం

||అమ్మా||

Kanna Biddanu Paraayi Biddagaa Penchukunna Mamakaaram

Tana Prajala Vimuktiki Devudu Chesina Kaaryanlo Sahakaaram (2)

Moshegaa Maarina Pasivaadini

Daasigaa Penchina Kannatalli Sugunam (2)

Daasigaa Penchina Kannatalli Sugunam

||Ammaa||

Verse 3

సంతతి లేక సవతి పోరుతో విసిగినట్టి దీనత్వం

దేవుని సన్నిధి హృదయము పరచి పొందుకొనెను మాతృత్వం (2)

హన్నా చేసిన ఆ త్యాగమే కాదా

సమూయేలు పొందిన న్యాయాధిపత్యము (2)

సమూయేలు పొందిన న్యాయాధిపత్యము

||అమ్మా||

Santati Leka Savati Poruto Visiginatti Deenatvam

Devuni Sannidhi Hrudayamu Parachi Pondukonenu Maatrutvam (2)

Hannaa Chesina Aa Tyaagame Kaadaa

Samooyelu Pondina Nyaayaadhipatyamu (2)

Samooyelu Pondina Nyaayaadhipatyamu

||Ammaa||

Verse 4

కొన ఊపిరితో సిలువపైన వేళాడుతున్న క్షణము

ఆ దేవ దేవుడు తీర్చుకొనెను తన మాతృమూర్తి ఋణము (2)

ప్రియ శిష్యుని దరికి తల్లిని చేర్చి

నెరవేర్చెను ఇలలో తనయుడిగా ధర్మం (2)

నెరవేర్చెను ఇలలో తనయుడిగా ధర్మం

||అమ్మా||

Kona Oopirito Siluvapaina Velaadutunna Kshanamu

Aa Deva Devudu Teerchukonenu Tana Maatrumoorti Runamu (2)

Priya Shishyuni Dariki Tallini Cherchi

Neraverchenu Ilalo Tanayudigaa Dharmam (2)

Neraverchenu Ilalo Tanayudigaa Dharmam

||Ammaa||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with D