Skip to content
ThuthiThuthiThuthi

Dinadinam Ninu Koniyaada Anukshanam Ninu Smariyimpa Song Lyricsదినదినం నిను కొనియాడ అనుక్షణం నిను స్మరియింప

Dinadinam Ninu Koniyaada Anukshanam Ninu Smariyimpa Lyrics in Telugu & English

Present

Verse 1

దినదినం నిను కొనియాడ

అనుక్షణం నిను స్మరియింప

నా భాగ్యమే ప్రభువా ఇలలో

Dinadinam Ninu Koniyaada

Anukshanam Ninu Smariyimpa

Naa Bhaagyame Prabhuvaa Ilalo

Verse 2

మాటలన్నీ మౌనమాయేనే

భావాలన్నీ పాటలాయెనే

రాగాలంటూ రాని గొంతులో

పల్లవులే ప్రవహించెనే

బ్రతుకే స్తుతిగా పరమే దిశగా

కనివిని ఎరుగని కరుణను తలచుచు

నిను ప్రణుతించెదను

పనినిస సరిగరిస

సరిగరిస నినిసరిసని

దదసపా

సా సరిగరిస

సరిగరిస నినిసరిసని

దదసపా

Maatalannee Maunamaayene

Bhaavaalannee Paatalaayene

Raagaalantoo Raani Gontulo

Pallavule Pravahinchene

Bratuke Stutigaa Parame Dishagaa

Kanivini Erugani Karunanu Talachuchu

Ninu Pranutinchedanu

Paninisa Sarigarisa

Sarigarisa Ninisarisani

Dadasapaa

Saa Sarigarisa

Sarigarisa Ninisarisani

Dadasapaa

Verse 3

నా పైన నీకున్న కృప ఎంత ఉందని

కొలవాలని నేను యోచించగా

ఆ నీలిగగనాలే ఎంతో ఎంతో ఉన్నతమే

ఇంకా ఇంక నీ కృప మహా ఉన్నతం

మాటలన్ని చాలవాయే భాషలన్నీ తేలిపోయే

వేయినోళ్ళు ఏకమైనా నీ ప్రేమను వర్ణించలేవే

కరగని తరగని కృపలను తలచుచు నిను భజియించెదను

Naa Paina Neekunna Krupa Enta Undani

Kolavaalani Nenu Yochinchagaa

Aa Neeligaganaale Ento Ento Unnatame

Inkaa Inka Nee Krupa Mahaa Unnatam

Maatalanni Chaalavaaye Bhaashalannee Telipoye

Veyinollu Ekamainaa Nee Premanu Varninchaleve

Karagani Taragani Krupalanu Talachuchu Ninu Bhajiyinchedanu

Verse 4

నీ దివ్యసన్నిధిలో నీ ప్రేమవర్షములో

తడవాలని నేను ఆశించగా

నా ఊహను మించి నీ ప్రేమను పంచి

నా ధుఖమంతటిని తీర్చావుగా

చాలదయ్యా ఈ జీవితము లోకమంతా నిన్ను చాటగను

శ్వాశ నాలో ఉండగనే ఊరువాడ నిన్ను చాటెదను

మరువని విడువని కనికరుడవు అని నిను ఘనపరచెదను

Nee Divyasannidhilo Nee Premavarshamulo

Tadavaalani Nenu Aashinchagaa

Naa Oohanu Minchi Nee Premanu Panchi

Naa Dhukhamantatini Teerchaavugaa

Chaaladayyaa Ee Jeevitamu Lokamantaa Ninnu Chaataganu

Shvaasha Naalo Undagane Ooruvaada Ninnu Chaatedanu

Maruvani Viduvani Kanikarudavu Ani Ninu Ghanaparachedanu

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with D