Edi Sakhuda Yedi Nee Madini Jesikona Lyrics in Telugu & English
Chorus
ఏది సఖుడ యేది నీ మదిని జేసికొనిన ప్రతిన యేది నీవొసంగు కాను
కిదియె తరుణమీయరమ్ము ||
Edi Sakhuda Yedi Nee Madini Jesikonina Pratina Yedi Neevosangu Kaanu
Kidiye Tarunameeyarammu ||
Verse 1
అన్న వస్త్రంబు లిచ్చి యాలు బిడ్డల ననుగ్రహించి యన్ని వస్తువుల నిచ్చి
యున్న నా కెదురుకాను ||కేది||
Anna Vastrambu Lichchi Yaalu Biddala Nanugrahinchi Yanni Vastuvula Nichchi
Yunna Naa Kedurukaanu ||Kedi||
Verse 2
వ్యాధి బాధలొదినపుడు శోధనంబు లడరినపుడు ఏది యెప్పుడవసరం
బది యొసంగి యాదిరించితి ||ఏది||
Vyaadhi Baadhalodinapudu Shodhanambu Ladarinapudu Edi Yeppudavasaram
Badi Yosangi Yaadirinchiti ||Edi||
Verse 3
మనసు శాంతిలేక నీవు మదిని బొగలుచుండ జూచి కనని వినని ప్రేమ
జూపి కనికరించినట్టి ప్రభుని ||కేది||
Manasu Shaantileka Neevu Madini Bogaluchunda Joochi Kanani Vinani Prema
Joopi Kanikarinchinatti Prabhuni ||Kedi||
Verse 4
పాపమందు పడినాడు దాపుజేరి నిలుపలేద? కాపరివలె నిన్ను గాచి
యోపికతో నడుపలేద ||ఏది||
Paapamandu Padinaadu Daapujeri Nilupaleda? Kaaparivale Ninnu Gaachi
Yopikato Nadupaleda ||Edi||
Verse 5
ఏమి దాచినావో సఖుడ! ఏమి తెచ్చినావు నేడు? నీ మనసు నిండ
ప్రేమయున్న నదియే నాకు వేనవేలు ||ఏది||
Emi Daachinaavo Sakhuda! Emi Techchinaavu Nedu? Nee Manasu Ninda
Premayunna Nadiye Naaku Venavelu ||Edi||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.