Skip to content
ThuthiThuthiThuthi

Kreestesu Prabhuvu Tanaraktamichchi Konnatti Sanghamuna Song Lyricsక్రీస్తేసు ప్రభువు తనరక్తమిచ్చి కొన్నట్టి సంఘమున

Kreestesu Prabhuvu Tanaraktamichchi Konnatti Sanghamuna Lyrics in Telugu & English

Present

Chorus

క్రీస్తేసు ప్రభువు తన రక్తమిచ్చి

కొన్నట్టి సంఘమున

ఎవరు చేరెదరో వారే ధన్యులు

పరలోకము వారిది (2)

||క్రీస్తేసు||

Kreestesu Prabhuvu Tana Raktamichchi

Konnatti Sanghamuna

Evaru Cheredaro Vaare Dhanyulu

Paralokamu Vaaridi (2)

||Kreestesu||

Verse 1

అపొస్తలుల బోధను నమ్మి

స్థిరపరచబడిన వారే (2)

ఆత్మ శక్తితో వారు ఎల్లప్పుడు

సంఘములో నిలిచెదరు (2)

||క్రీస్తేసు||

Apostalula Bodhanu Nammi

Sthiraparachabadina Vaare (2)

Aatma Shaktito Vaaru Ellappudu

Sanghamulo Nilichedaru (2)

||Kreestesu||

Verse 2

పరిశుద్ధులతో సహవాసమును

ఎవరు కలిగియుందురో (2)

వారే పొందెదరు క్షేమాభివృద్ధి

క్రీస్తేసు ప్రభువు నందు (2)

||క్రీస్తేసు||

Parishuddhulato Sahavaasamunu

Evaru Kaligiyunduro (2)

Vaare Pondedaru Kshemaabhivruddhi

Kreestesu Prabhuvu Nandu (2)

||Kreestesu||

Verse 3

ప్రభు దేహ రక్తమును తిని త్రాగు వారే

తన యందు నిలిచెదరు (2)

ప్రకటించెదరు ఆయన మరణ

పునరుత్తానమును వారు (2)

||క్రీస్తేసు||

Prabhu Deha Raktamunu Tini Traagu Vaare

Tana Yandu Nilichedaru (2)

Prakatinchedaru Aayana Marana

Punaruttaanamunu Vaaru (2)

||Kreestesu||

Verse 4

పట్టు వదలక సంఘముతో కూడి

ఎవరు ప్రార్ధించెదరో (2)

ప్రార్ధన ద్వారా సాతాను క్రియలు

బంధించెదరు వారే (2)

||క్రీస్తేసు||

Pattu Vadalaka Sanghamuto Koodi

Evaru Praardhinchedaro (2)

Praardhana Dvaaraa Saataanu Kriyalu

Bandhinchedaru Vaare (2)

||Kreestesu||

Verse 5

క్రీస్తేసు ప్రభుని రాకడ కొరకు

ఎవరెదురు చూచెదరో (2)

నిత్యానందముతో సాక్ష్యమిచ్చెదరు

సర్వ లోకము నందు (2)

||క్రీస్తేసు||

Kreestesu Prabhuni Raakada Koraku

Evareduru Choochedaro (2)

Nityaanandamuto Saakshyamichchedaru

Sarva Lokamu Nandu (2)

||Kreestesu||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with K