Madilona Nee Roopam Nee Nitya Sankalpam Pratee Lyrics in Telugu & English
Chorus
మదిలోన నీరూపం - నీ నిత్యసంకల్పం
ప్రతిఫలింప జేయునే ఎన్నడూ
కలనైనతలంచలేదే నీలో ఈ సౌభాగ్యము
వర్ణించలేను స్వామీ - నీ గొప్పకార్యాలను
నీ సాటి లేరు ఇలలో - అద్వితీయుడా
||మదిలోన||
Madilona Neeroopam - Nee Nityasankalpam
Pratiphalimpa Jeyune Ennadoo
Kalanainatalanchalede Neelo Ee Saubhaagyamu
Varninchalenu Svaamee - Nee Goppakaaryaalanu
Nee Saati Leru Ilalo - Adviteeyudaa
||Madilona||
Verse 1
ప్రతీ గెలుపు బాటలోన చైతన్యస్పూర్తి నీవై - నడిపించుచున్న నేర్పరీ
అలుపెరుగనిపోరాటాలే - ఊహించని ఉప్పెనలై
నను నిలువనీయ్యని వేళలో
హృదయాన కొలువైయున్న ఇశ్రాయేలు దైవమా
జయమిచ్చి నడిపించితివే నీఖ్యాతికై
తడికన్నులనే తుడిచిన నేస్తం - ఇలలో నీవే కదా! యేసయ్యా
||మదిలోన||
Pratee Gelupu Baatalona Chaitanyaspoorti Neevai - Nadipinchuchunna Nerparee
Aluperuganiporaataale - Oohinchani Uppenalai
Nanu Niluvaneeyyani Velalo
Hrudayaana Koluvaiyunna Ishraayelu Daivamaa
Jayamichchi Nadipinchitive Neekhyaatikai
Tadikannulane Tudichina Nestam - Ilalo Neeve Kadaa! Yesayyaa
||Madilona||
Verse 2
నిరంతరం నీ సన్నిధిలో - నీ అడుగు జాడలలోనే సంకల్పదీక్షతో సాగెదా
నీతో సహజీవనమే ఆధ్యాత్మిక పరవశమై ఆశయాలదిగా నడిపెనే
నీ నిత్య ఆదరణే అన్నిటిలో నెమ్మదినిచ్చి
నా భారమంతా తీర్చి నా సేద తీర్చితివి
నీ ఆత్మతో ముద్రించితివి నీ కొరకు సాక్షిగా! యేసయ్యా
||మదిలోన||
Nirantaram Nee Sannidhilo - Nee Adugu Jaadalalone Sankalpadeekshato Saagedaa
Neeto Sahajeevaname Aadhyaatmika Paravashamai Aashayaaladigaa Nadipene
Nee Nitya Aadarane Annitilo Nemmadinichchi
Naa Bhaaramantaa Teerchi Naa Seda Teerchitivi
Nee Aatmato Mudrinchitivi Nee Koraku Saakshigaa! Yesayyaa
||Madilona||
Verse 3
విశ్వమంతా ఆరాధించే స్వర్ణరాజ్యనిర్మాతవు
స్థాపించుము నీ ప్రేమ సామ్రాజ్యము
శుద్ధులైన వారికి ఫలములిచ్చు నిర్ణేతవు - ఆ గడియ వరకు విడువకూ
నే వేచియున్నాను నీ రాక కోసమే
శ్రేష్టమైన స్వాస్థ్యము కోసం సిద్ధపరచుమా
నా ఊహలలో ఆశలసౌధం ఇలలో నీవేనయ్యా! యేసయ్యా
||మదిలోన||
Vishvamantaa Aaraadhinche Svarnaraajyanirmaatavu
Sthaapinchumu Nee Prema Saamraajyamu
Shuddhulaina Vaariki Phalamulichchu Nirnetavu - Aa Gadiya Varaku Viduvakoo
Ne Vechiyunnaanu Nee Raaka Kosame
Shreshtamaina Svaasthyamu Kosam Siddhaparachumaa
Naa Oohalalo Aashalasaudham Ilalo Neevenayyaa! Yesayyaa
||Madilona||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.