Skip to content
ThuthiThuthiThuthi

Mana Praana Rakshakudu Kreestesu Devudu Song Lyricsమన ప్రాణ రక్షకుడు క్రీస్తేసు దేవుడు

Mana Praana Rakshakudu Kreestesu Devudu Lyrics in Telugu & English

Present

Verse 1

మన ప్రాణ రక్షకుడు - క్రీస్తేసు దేవుడు

మనలన్ - విమోచింపను - రక్షకుడై ఉదయించెను

సర్వోన్నత స్థలములలో - మహిమయు దేవునికే

ప్రియమైన మనకిలలో - శాంతి సమాధానమే (2)

Mana Praana Rakshakudu - Kreestesu Devudu

Manalan - Vimochimpanu - Rakshakudai Udayinchenu

Sarvonnata Sthalamulalo - Mahimayu Devunike

Priyamaina Manakilalo - Shaanti Samaadhaaname (2)

Verse 2

పాపమున్ - శాపమున్ తొలగించ ఏతెంచెను

నమ్మిన వారిని నిత్యము జీవింపజేయును

ఇమ్మానుయేలను నామము - నిత్యము మన తోడుగా!

యేసు నామమే రక్షణ - స్వస్థత - విడుదల (2)

Paapamun - Shaapamun Tolagincha Etenchenu

Nammina Vaarini Nityamu Jeevimpajeyunu

Immaanuyelanu Naamamu - Nityamu Mana Todugaa!

Yesu Naamame Rakshana - Svasthata - Vidudala (2)

Verse 3

చీకటైన బ్రతుకులకు - తారగా వెలసెను

చెరలోనున్న వారికి - విడుదలనివ్వ దరిచేరేను

నిజమైన వెలుగు ఆయనే - వెలిగించె లోకమును!

యేసు నామమే వెలుగును - రక్షణ - జీవము (2)

Cheekataina Bratukulaku - Taaragaa Velasenu

Cheralonunna Vaariki - Vidudalanivva Daricherenu

Nijamaina Velugu Aayane - Veliginche Lokamunu!

Yesu Naamame Velugunu - Rakshana - Jeevamu (2)

Verse 4

వాక్యమే శరీరమై - మన మధ్య నివసించెను

ఆత్మయు శక్తిగా - మనలో వసియింప వచ్చెను

చేర్చుకో ప్రభు యేసుని - హృదయములో నేడు!

చెంత చేరిన వారిని - విడువని దేవుడు (2)

Vaakyame Shareeramai - Mana Madhya Nivasinchenu

Aatmayu Shaktigaa - Manalo Vasiyimpa Vachchenu

Cherchuko Prabhu Yesuni - Hrudayamulo Nedu!

Chenta Cherina Vaarini - Viduvani Devudu (2)

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with M