Maruvani Needu Premato Kaachitive Kanupaapagaa Lyrics in Telugu & English
Chorus
మరువని నీదు ప్రేమతో కాచితివే కనుపాపగా
విడువని స్నేహ బంధమై నడిచితివే నా తోడుగా (2)
ఇంతవరకు ఉన్న ఊపిరి నీదు దయకు సాక్ష్యమేగా
పొందుకున్న మేలులన్ని నీదు ఎన్నిక ఫలితమేగా (2)
||మరువని||
Maruvani Needu Premato Kaachitive Kanupaapagaa
Viduvani Sneha Bandhamai Nadichitive Naa Todugaa (2)
Intavaraku Unna Oopiri Needu Dayaku Saakshyamegaa
Pondukunna Melulanni Needu Ennika Phalitamegaa (2)
||Maruvani||
Verse 1
కరుగుతున్న కాలమంతా నీదు కృపలో నన్ను తడిపె
వెలుగు పంచే నీదు వాక్యం నీదు మార్గము నాకు తెలిపె (2)
పాడెదను నూతన గీతములు ఎల్లవేళల స్తుతిగానములు
ఘనత మహిమ ఆరోపణము నాదు జీవితమే అర్పితము (2)
||మరువని||
Karugutunna Kaalamantaa Needu Krupalo Nannu Tadipe
Velugu Panche Needu Vaakyam Needu Maargamu Naaku Telipe (2)
Paadedanu Nootana Geetamulu Ellavelala Stutigaanamulu
Ghanata Mahima Aaropanamu Naadu Jeevitame Arpitamu (2)
||Maruvani||
Verse 2
నిన్న నేడు ఎన్నడైనా మారిపోని మనసు నీది
తల్లి మరచినా మరచి పోక కాపు కాసే ప్రేమ నీది (2)
పొందుకున్న జన్మ దినము నీవు ఇచ్చే దయా కిరీటము
నీవు ఇచ్ఛే వాగ్ధానాలు చేయు అధికము బ్రతుకు దినములు (2)
||మరువని||
Ninna Nedu Ennadainaa Maariponi Manasu Needi
Talli Marachinaa Marachi Poka Kaapu Kaase Prema Needi (2)
Pondukunna Janma Dinamu Neevu Ichche Dayaa Kireetamu
Neevu Ichchhe Vaagdhaanaalu Cheyu Adhikamu Bratuku Dinamulu (2)
||Maruvani||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.