Skip to content
ThuthiThuthiThuthi

Matti Bommanu Manishigaa Maarchina Maa Devaa Song Lyricsమట్టి బొమ్మను మనిషిగా మార్చిన మా దేవా

Matti Bommanu Manishigaa Maarchina Maa Devaa Lyrics in Telugu & English

Present

Verse 1

మట్టి బొమ్మను మనిషిగా మార్చిన మాదేవా (2)

మట్టి బొమ్మను మనిషిగా మార్చిన మాదేవా (2)

అందమైన నీ సుందర వనములో

నన్ను నిలిపిన నా యేసయ్యా (2)

అంతులేని నీ ప్రేమామృతము

నా ప్రాణమై ప్రవహించెనా

Matti Bommanu Manishigaa Maarchina Maadevaa (2)

Matti Bommanu Manishigaa Maarchina Maadevaa (2)

Andamaina Nee Sundara Vanamulo

Nannu Nilipina Naa Yesayyaa (2)

Antuleni Nee Premaamrutamu

Naa Praanamai Pravahinchenaa

Verse 2

ఏమని వర్ణింపను నా ప్రభువా

ఎంతని వివరింపను నా దేవా

మట్టి నుండి నన్ను లేపితివి

నీ స్వరూపముగా మలిచితివి

ఆశకు పోయి హద్దులు దాటితిని

పాపకూపములో కూరుకొంటిని

కటిక చీకటిలో చిక్కుబడితిని

దిక్కులేకనే పడియుంటిని

Emani Varnimpanu Naa Prabhuvaa

Entani Vivarimpanu Naa Devaa

Matti Nundi Nannu Lepitivi

Nee Svaroopamugaa Malichitivi

Aashaku Poyi Haddulu Daatitini

Paapakoopamulo Koorukontini

Katika Cheekatilo Chikkubaditini

Dikkulekane Padiyuntini

Verse 3

కరుణించవా ఓ కరుణామయా

కాపాడరావా కృపామయా

కన్నీళ్లతో నీ పాదములకే

వేడుకొంటున్నా నా యేసయ్యా

మట్టి బొమ్మను మనిషిగా మార్చిన మాదేవా

(మాదేవా… మా యేసయ్యా…

పాడెదను నీ ప్రేమగీతము

పొగడెదను నా జీవమంతా

Karuninchavaa O Karunaamayaa

Kaapaadaraavaa Krupaamayaa

Kanneellato Nee Paadamulake

Vedukontunnaa Naa Yesayyaa

Matti Bommanu Manishigaa Maarchina Maadevaa

(Maadevaa… Maa Yesayyaa…

Paadedanu Nee Premageetamu

Pogadedanu Naa Jeevamantaa

Verse 4

మట్టి బొమ్మను మనిషిగా మార్చిన మాదేవా

(స్తుతి ఘనత నీకే ప్రభువా…)

చేతులు ఎత్తి ఆరాధింతును

నిత్యము నిన్నే స్తుతింతును

Matti Bommanu Manishigaa Maarchina Maadevaa

(Stuti Ghanata Neeke Prabhuvaa…)

Chetulu Etti Aaraadhintunu

Nityamu Ninne Stutintunu

Verse 5

మాయగాడి చేతిలో మోసపోతిని

లోకాశలలో పడి మునిగిపోతిని

ఈదలేకనే అలసియున్నాను

మరణ భయము నన్ను వెంటాడుచున్నది

అయినా నీ ప్రేమ విడువలేదయ్యా

నీ కృప నన్ను విడిచిపెట్టలేదయ్యా

చీకటి లోయలో నడిపితివి

వెలుగుగా నన్ను నిలిపితివి

Maayagaadi Chetilo Mosapotini

Lokaashalalo Padi Munigipotini

Eedalekane Alasiyunnaanu

Marana Bhayamu Nannu Ventaaduchunnadi

Ayinaa Nee Prema Viduvaledayyaa

Nee Krupa Nannu Vidichipettaledayyaa

Cheekati Loyalo Nadipitivi

Velugugaa Nannu Nilipitivi

Verse 6

రక్షించరావా నా యేసయ్యా

నీ చేతితో నను బ్రతికించవా

శిలువ ప్రేమే నా ఆశ్రయము

నీ రక్తమే నా విజయం

యేసయ్యా… యేసయ్యా…

యేసయ్యా… నా ప్రాణ ప్రియుడా…

మట్టి బొమ్మను మనిషిగా మార్చిన మాదేవా

స్తుతి మహిమ నీకే యేసయ్యా

Rakshincharaavaa Naa Yesayyaa

Nee Chetito Nanu Bratikinchavaa

Shiluva Preme Naa Aashrayamu

Nee Raktame Naa Vijayam

Yesayyaa… Yesayyaa…

Yesayyaa… Naa Praana Priyudaa…

Matti Bommanu Manishigaa Maarchina Maadevaa

Stuti Mahima Neeke Yesayyaa

Verse 7

ప్రాణం ఉన్నంతవరకూ

నీ నామమే నేను ఘోషింతును

మట్టి బొమ్మను మనిషిగా మార్చిన మాదేవా

సర్వం నీకే నా యేసయ్యా

ఆకాశము భూమి పాడగా

నీ ప్రేమను ప్రకటింతును

మట్టి బొమ్మను మనిషిగా మార్చిన మాదేవా

మాదేవా…

Praanam Unnantavarakoo

Nee Naamame Nenu Ghoshintunu

Matti Bommanu Manishigaa Maarchina Maadevaa

Sarvam Neeke Naa Yesayyaa

Aakaashamu Bhoomi Paadagaa

Nee Premanu Prakatintunu

Matti Bommanu Manishigaa Maarchina Maadevaa

Maadevaa…

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with M