Skip to content
ThuthiThuthiThuthi

Parishuddhaatma Prabhuni Varadivyashaktibam Dhuramu Song Lyricsపరిశుద్ధాత్మ ప్రభుని వరదివ్యశక్తిబం ధురము

Also searched as: parishudda

Parishuddhaatma Prabhuni Varadivyashaktibam Dhuramu Lyrics in Telugu & English

Present

Chorus

పరిశుద్ధాత్మ ప్రభుని వరదివ్యశక్తిబం ధురము ధరణికిజీవ సంజీవము

పరమౌన్నత్యంబైన పరలోక సువిశేష పరమార్థములు దెలుపు నెఱిమార్గము

||పరి||

Parishuddhaatma Prabhuni Varadivyashaktibam Dhuramu Dharanikijeeva Sanjeevamu

Paramaunnatyambaina Paraloka Suvishesha Paramaarthamulu Delupu Nerimaargamu

||Pari||

Verse 1

ఆపత్కాలమునందు ప్రాపయి మానవజాతి కాపయి సంరక్షించి

ఏపారును పాపాంధకారమున బడి మ్రగ్గి శోకించు పాపజాతికి దీప

రాశియై రహియించు కృపయు కనికరములు గుంఫించి మధురాతి

ప్రభగా భాసిల్లెడు పరమార్థము అపభ్రంశకార్యముల కెపుడు తావీయక

సుపురోగతిని జూపి శోధించును

||పరి||

Aapatkaalamunandu Praapayi Maanavajaati Kaapayi Sanrakshinchi

Epaarunu Paapaandhakaaramuna Badi Mraggi Shokinchu Paapajaatiki Deepa

Raashiyai Rahiyinchu Krupayu Kanikaramulu Gumphinchi Madhuraati

Prabhagaa Bhaasilledu Paramaarthamu Apabhranshakaaryamula Kepudu Taaveeyaka

Supurogatini Joopi Shodhinchunu

||Pari||

Verse 2

బండలనుపమించు గుండియల కదలించు నిండుశక్తి ఘటించు నీతి

బెంచు ఎండిన యెదలను నిండించు రక్షణో ద్దండ విలసిత భాగ్య దానమ్ములు

దండిగానసమాన ధైర్యోత్సాహములిచ్చి మెండుగా నాదరము మేళవించి

మండుచున్న పాప మరణాగ్ని జ్వాలల నుండి పాపిని గాచు నండయౌచు

||పరి||

Bandalanupaminchu Gundiyala Kadalinchu Nindushakti Ghatinchu Neeti

Benchu Endina Yedalanu Nindinchu Rakshano Ddanda Vilasita Bhaagya Daanammulu

Dandigaanasamaana Dhairyotsaahamulichchi Mendugaa Naadaramu Melavinchi

Manduchunna Paapa Maranaagni Jvaalala Nundi Paapini Gaachu Nandayauchu

||Pari||

Verse 3

శాంతి సమాధాన సౌజన్యభావమ్ము కాంతిమంతము గల్గు కారుణ్యము

అంతములేనట్టి ఆనంద శుద్ధాత్మ శాంతిదాంతియొసంగి సంరక్షించు ఎంతో

సంతోషముతో అంతుబొంతులేని వి క్రాంతి బలత్యాగముల గావింప

జేయు చింతా ధ్వాంతములోన చెదరికొట్టుకపోవు శాంతిలేని జనతకు

సౌఖ్యాస్పదము

||పరి||

Shaanti Samaadhaana Saujanyabhaavammu Kaantimantamu Galgu Kaarunyamu

Antamulenatti Aananda Shuddhaatma Shaantidaantiyosangi Sanrakshinchu Ento

Santoshamuto Antubontuleni Vi Kraanti Balatyaagamula Gaavimpa

Jeyu Chintaa Dhvaantamulona Chedarikottukapovu Shaantileni Janataku

Saukhyaaspadamu

||Pari||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with P