Peruke Unnaanayyaa Lyrics in Telugu & English
Chorus
పేరుకే ఉన్నానయ్యా
ప్రేమ లేని దాననయ్యా (2)
పేరు పెట్టి పిలిచినావయ్యా
ప్రేమతోనే నడిపినావయ్యా (2)
భూమికే భారమని పుట్టడమే వ్యర్థమని (2)
అవమానాలే నాకు అన్నపానాలు
అయినా నీ కృప నాకు ఉన్న చాలు (2)
Peruke Unnaanayyaa
Prema Leni Daananayyaa (2)
Peru Petti Pilichinaavayyaa
Prematone Nadipinaavayyaa (2)
Bhoomike Bhaaramani Puttadame Vyarthamani (2)
Avamaanaale Naaku Annapaanaalu
Ayinaa Nee Krupa Naaku Unna Chaalu (2)
Verse 1
తగిన అర్హత నాకు లేదని
తలవంచుకున్న సమయాన నీవు
తల్లి కడుపులో కనుమూసిన మేలని
కలత చెందిన సమయాన నీవు (2)
కన్న తండ్రివై నన్ను కౌగిలించినావు
కౌగిలించి నాకు ఘనతనిచ్చినావు (2) || పేరుకే ||
Tagina Arhata Naaku Ledani
Talavanchukunna Samayaana Neevu
Talli Kadupulo Kanumoosina Melani
Kalata Chendina Samayaana Neevu (2)
Kanna Tandrivai Nannu Kaugilinchinaavu
Kaugilinchi Naaku Ghanatanichchinaavu (2) || Peruke ||
Verse 2
కపట ప్రేమలో నటన నీడలో
మోసపోతిని చేతకాని దానిని
కరుణ కోసము ప్రేమ కోసము
పడిగాపులు గాచా పనికిరాని దానిని (2)
విలువలేని నాకై సిలువ మోసినావు
సిలువ మోసి నాకై విలువనిచ్చినావు (2) || పేరుకే ||
Kapata Premalo Natana Needalo
Mosapotini Chetakaani Daanini
Karuna Kosamu Prema Kosamu
Padigaapulu Gaachaa Panikiraani Daanini (2)
Viluvaleni Naakai Siluva Mosinaavu
Siluva Mosi Naakai Viluvanichchinaavu (2) || Peruke ||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.