Skip to content
ThuthiThuthiThuthi

Randi Maanavulaaraa Rakshakuni Nammandi Vegamu Song Lyricsరండి మానవులారా రక్షకుని నమ్మండి వేగము

Randi Maanavulaaraa Rakshakuni Nammandi Vegamu Lyrics in Telugu & English

Present

Chorus

రండి మానవులారా రక్షకుని నమ్మండి వేగము ప్రియులారా రండి

పాపుల బ్రోచుటకు పర మండలంబును విడిచి యీ భువి మండలంబున

కరుగుదెంచిన మహాత్మున్ గనుగొని సుఖింపను

||రండి||

Randi Maanavulaaraa Rakshakuni Nammandi Vegamu Priyulaaraa Randi

Paapula Brochutaku Para Mandalambunu Vidichi Yee Bhuvi Mandalambuna

Karugudenchina Mahaatmun Ganugoni Sukhimpanu

||Randi||

Verse 1

ఇలలో మానవులందరు పలువిధ పాపా శలలో మునిగి యుండిరి

తులువయగు సాతాను చెడ్డ వలను జిక్కినవారలన్ దన బలముతో విడి

పింప బ్రాణము బలిగబెట్టిన ప్రభుని యొద్దకు

||రండి||

Ilalo Maanavulandaru Paluvidha Paapaa Shalalo Munigi Yundiri

Tuluvayagu Saataanu Chedda Valanu Jikkinavaaralan Dana Balamuto Vidi

Pimpa Braanamu Baligabettina Prabhuni Yoddaku

||Randi||

Verse 2

పరముండు నరులందరికై మరణంబయ్యొ కరుణతోడను కొరతపై

మరలి మూడవదినమునందున మహిమతో నా ప్రభువులేచి తెరవజేసెను

మోక్షమార్గము శరణు జొచ్చినవారలకును

||రండి||

Paramundu Narulandarikai Maranambayyo Karunatodanu Koratapai

Marali Moodavadinamunanduna Mahimato Naa Prabhuvulechi Teravajesenu

Mokshamaargamu Sharanu Jochchinavaaralakunu

||Randi||

Verse 3

పాపభారంబు నుండి విడుదలనొంద ప్రాపుగోరినవారలు ప్రాప

కుండగు క్రీస్తునాధుని దాపుజేరి తపంబు జేసిన పాపభారము దీసి శాంతిని

గూర్చు యా ప్రభు నొద్దకిపుడే

||రండి||

Paapabhaarambu Nundi Vidudalanonda Praapugorinavaaralu Praapa

Kundagu Kreestunaadhuni Daapujeri Tapambu Jesina Paapabhaaramu Deesi Shaantini

Goorchu Yaa Prabhu Noddakipude

||Randi||

Verse 4

భావమందున దెలియుడి మీరలు నిత్య జీవమార్గము గనుడీ పావ

నుండగు క్రీస్తు మిమ్మును పావనులుగా జేసి నూతన జీవము నొసంగి పర

మున జేర్చు మిమ్మును నిశ్చయముగా

||రండి||

Bhaavamanduna Deliyudi Meeralu Nitya Jeevamaargamu Ganudee Paava

Nundagu Kreestu Mimmunu Paavanulugaa Jesi Nootana Jeevamu Nosangi Para

Muna Jerchu Mimmunu Nishchayamugaa

||Randi||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with R