Skip to content
ThuthiThuthiThuthi

Sukha Michchegada Maaku Prabhu Yesuvaa Song Lyricsసుఖ మిచ్చెగద మాకు ప్రభు యేసువా

Sukha Michchegada Maaku Prabhu Yesuvaa Lyrics in Telugu & English

Present

Chorus

సుఖ మిచ్చెగద మాకు ప్రభు యేసువా నీ సురుచిరమగు వాక్కు

నిఖిలకల్మష వనమునకు దవ శిఖి శిఖిలవలె గాల్చు నీదగు ముఖవికాసిత

వాక్యములు బహు సుఖము లొసఁగు తవాశ్రితాళికి

||సుఖ మిచ్చె||

Sukha Michchegada Maaku Prabhu Yesuvaa Nee Suruchiramagu Vaakku

Nikhilakalmasha Vanamunaku Dava Shikhi Shikhilavale Gaalchu Needagu Mukhavikaasita

Vaakyamulu Bahu Sukhamu Losangu Tavaashritaaliki

||Sukha Michche||

Verse 1

జగతిలోపల మెండుగ నుండిన వివిధ మగు శాస్త్రములు జూడఁగ

మిగుల గందరగోళమై మరి యొకటి కొకటి విరుద్ధముగ మ ర్త్యగణ కల్పిత

మగుచు నున్నవి తగని వని ద్రోచితిమి వాటిని

||సుఖ మిచ్చె||

Jagatilopala Menduga Nundina Vividha Magu Shaastramulu Joodanga

Migula Gandaragolamai Mari Yokati Kokati Viruddhamuga Ma Rtyagana Kalpita

Maguchu Nunnavi Tagani Vani Drochitimi Vaatini

||Sukha Michche||

Verse 2

నీ వాక్యముల భావము నమ్మిన పాపి జీవుల కది జీవము కేవలం బగు

ధర్మశాస్త్రము దేవుఁ డిచ్చిన దొకటి బైబిలు ఈ వసుధఁగల సర్వ పాపులఁ

బ్రోవ వచ్చిన నిన్నుఁ జూపెను

||సుఖ మిచ్చె||

Nee Vaakyamula Bhaavamu Nammina Paapi Jeevula Kadi Jeevamu Kevalam Bagu

Dharmashaastramu Devun Dichchina Dokati Baibilu Ee Vasudhangala Sarva Paapulan

Brova Vachchina Ninnun Joopenu

||Sukha Michche||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with S