Skip to content
ThuthiThuthiThuthi

Yesu Devuni Aashrayinchumaa Sodaraa Sodaree Ee Kshaname Song Lyricsయేసు దేవుని ఆశ్రయించుమా సోదరా సోదరీ ఈ క్షణమే

Yesu Devuni Aashrayinchumaa Sodaraa Sodaree Ee Kshaname Lyrics in Telugu & English

Present

Chorus

యేసు దేవుని ఆశ్రయించుమా

సోదరా సోదరీ ఈ క్షణమే

విశ్వసించుమా తండ్రిని వేడుమా

గొప్పకార్యాలు జరుగును నీ యెదుటే

స్వస్థత లేక... సహాయము లేక...

Yesu Devuni Aashrayinchumaa

Sodaraa Sodaree Ee Kshaname

Vishvasinchumaa Tandrini Vedumaa

Goppakaaryaalu Jarugunu Nee Yedute

Svasthata Leka... Sahaayamu Leka...

Verse 1

సోలిపోయావా?

యేసు నామములోనే స్వస్థత – యేసు కృపలోనే భద్రత

యేసు రక్తములోనే విమోచన – యేసే నడిపించును జీవమార్గాన

రోగియైన దాసుని కొరకు

శతాధిపతి యేసు ప్రభుని వేడుకొనెను

మాట మాత్రం సెలవిమ్మనగా

విశ్వసించిన ప్రకారమే స్వస్థతను పొందెను

విశ్వసించి అడుగుము అద్భుతాలు జరుగును (2)

యేసు నందు విశ్వాసముంచుము (2)

||యేసు నామములోనే||

Solipoyaavaa?

Yesu Naamamulone Svasthata – Yesu Krupalone Bhadrata

Yesu Raktamulone Vimochana – Yese Nadipinchunu Jeevamaargaana

Rogiyaina Daasuni Koraku

Shataadhipati Yesu Prabhuni Vedukonenu

Maata Maatram Selavimmanagaa

Vishvasinchina Prakaarame Svasthatanu Pondenu

Vishvasinchi Adugumu Adbhutaalu Jarugunu (2)

Yesu Nandu Vishvaasamunchumu (2)

||Yesu Naamamulone||

Verse 2

దు:ఖ స్థితిలో హన్నా తన ఆత్మను

దేవుని సన్నిధిని కుమ్మరించుకొనెను

మొక్కుబడి చేసి ప్రార్థించెను

దీవింపబడెను కుమారుని పొందెను

నీవు అడుగుము నీకివ్వబడును (2)

యేసుని ప్రార్థించుము (2)

||యేసు నామములోనే||

Du:kha Sthitilo Hannaa Tana Aatmanu

Devuni Sannidhini Kummarinchukonenu

Mokkubadi Chesi Praarthinchenu

Deevimpabadenu Kumaaruni Pondenu

Neevu Adugumu Neekivvabadunu (2)

Yesuni Praarthinchumu (2)

||Yesu Naamamulone||

Verse 3

శోధనలనైనా సమస్తమును కోల్పోయిన

యోబువంటి విశ్వాసం గమనించుమా

యధార్ధతతో నిరీక్షించెను

రెండంతల దీవెనలు పొందుకొనెను

సహనము చూపుము సమకూడి జరుగును (2)

యేసు నందు నిరీక్షించుము (2)

||యేసు నామములోనే||

Shodhanalanainaa Samastamunu Kolpoyina

Yobuvanti Vishvaasam Gamaninchumaa

Yadhaardhatato Nireekshinchenu

Rendantala Deevenalu Pondukonenu

Sahanamu Choopumu Samakoodi Jarugunu (2)

Yesu Nandu Nireekshinchumu (2)

||Yesu Naamamulone||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with Y