Yesukreestu Prabhuvaa Memu Nee Mokshamun Bondutaku Lyrics in Telugu & English
Chorus
యేసుక్రీస్తు ప్రభువా మేము నీ మోక్షముఁ బొందుటకు దోసపు
లోకము లోనికి వచ్చితి దోషులఁ బ్రోచుటకు
||యేసు||
Yesukreestu Prabhuvaa Memu Nee Mokshamun Bondutaku Dosapu
Lokamu Loniki Vachchiti Doshulan Brochutaku
||Yesu||
Verse 1
పరిశుద్ధుఁడ వీవు ఇలలో పాపుల నందరిని పరిపరివిధ కృప
వాక్కులతోడను పిలిచితి వెల్లప్పుడు
||యేసు||
Parishuddhunda Veevu Ilalo Paapula Nandarini Pariparividha Krupa
Vaakkulatodanu Pilichiti Vellappudu
||Yesu||
Verse 2
సత్యపు నడతలతో జగతిని సర్వాద్భుతములను నిత్యముఁ జేయుచు
నీ కృప చాల యిలలోఁ దెల్పితివే
||యేసు||
Satyapu Nadatalato Jagatini Sarvaadbhutamulanu Nityamun Jeyuchu
Nee Krupa Chaala Yilalon Delpitive
||Yesu||
Verse 3
అతి పుణ్యాత్ముఁడవే క్షితిలో వెతలను బొందితివే మృతిని బొందియు
మూఁడవ దినమున బ్రతికియు లేచితివే
||యేసు||
Ati Punyaatmundave Kshitilo Vetalanu Bonditive Mrutini Bondiyu
Moondava Dinamuna Bratikiyu Lechitive
||Yesu||
Verse 4
పాపుల మని తెలిసి నీదగు దాపున జేరఁగనే పాపముఁ బాపుచు
ప్రాపుగ నుండెడి ప్రభుఁడవు నీవెగదా
||యేసు||
Paapula Mani Telisi Needagu Daapuna Jerangane Paapamun Baapuchu
Praapuga Nundedi Prabhundavu Neevegadaa
||Yesu||
Verse 5
దురిత వితతి దూరా నమ్మిన దురితుల స్నేహితుఁడా నిరతము
మమ్మును నీ కృప లోపల నిలకడగాఁ బెంచు
||యేసు||
Durita Vitati Dooraa Nammina Duritula Snehitundaa Niratamu
Mammunu Nee Krupa Lopala Nilakadagaan Benchu
||Yesu||
Verse 6
నోరు నిండ నెదలో నీ కృప ప్రేరేపణఁగలిగి సారెకు వేఁడెద
ముర్వికి రక్షణ కారకుఁడా నిన్ను
||యేసు||
Noru Ninda Nedalo Nee Krupa Prerepanangaligi Saareku Vendeda
Murviki Rakshana Kaarakundaa Ninnu
||Yesu||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.