Yesunaadhuni Seva Yipudu Maakabbenu Lyrics in Telugu & English
Chorus
యేసునాధుని సేవ యిపుడు మాకబ్బెను వెఱవము వెఱవము యేసు
దాసులతో బొత్తు భక్తి మా కమరెను జడియము జడియము
||యేసు||
Yesunaadhuni Seva Yipudu Maakabbenu Veravamu Veravamu Yesu
Daasulato Bottu Bhakti Maa Kamarenu Jadiyamu Jadiyamu
||Yesu||
Verse 1
లోక జ్ఞానములోని లోతుఁ దెలిసి మేము లొంగము లొంగము
యేసు రాకడకొఱకు సంత సించి యెల్లప్పు డుండెద ముండెదము
||యేసు||
Loka Jnyaanamuloni Lotun Delisi Memu Longamu Longamu
Yesu Raakadakoraku Santa Sinchi Yellappu Dundeda Mundedamu
||Yesu||
Verse 2
దైవజనుల మని ధైర్యముతో మేము పల్కెదము పల్కెదము పాప
భారమంతయు యేసు ప్రభున కప్పగించి బ్రతుకుచు బ్రతుకుచు
||యేసు||
Daivajanula Mani Dhairyamuto Memu Palkedamu Palkedamu Paapa
Bhaaramantayu Yesu Prabhuna Kappaginchi Bratukuchu Bratukuchu
||Yesu||
Verse 3
శుభవర్తమానము సొంపుగా నరులకుఁ జెప్పెదము జెప్పెదము లోక
వైభవములను వాంఛించక యేసుని పలికెదము పలికెదము
||యేసు||
Shubhavartamaanamu Sompugaa Narulakun Jeppedamu Jeppedamu Loka
Vaibhavamulanu Vaanchhinchaka Yesuni Palikedamu Palikedamu
||Yesu||
Verse 4
నీతికవచంబును నెనరుతో ధరియించి నిలిచెదము నిలిచెదము లోక
ఘాతకుఁడైన పి శాచిని యెదిరించి కట్టెదము కట్టెదము
||యేసు||
Neetikavachambunu Nenaruto Dhariyinchi Nilichedamu Nilichedamu Loka
Ghaatakundaina Pi Shaachini Yedirinchi Kattedamu Kattedamu
||Yesu||
Verse 5
శోక మొందక యేసు రాకడ కాశించి రంజిల్లు చుండెదము దూత
మూఁకలతో గూడి మోద మొప్ప యేసుని పొగడెదము పొగడెదము
||యేసు||
Shoka Mondaka Yesu Raakada Kaashinchi Ranjillu Chundedamu Doota
Moonkalato Goodi Moda Moppa Yesuni Pogadedamu Pogadedamu
||Yesu||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.