1 Chronicles · chapter 10 · verse 3
1 Chronicles 10:3 in Telugu
యుద్ధములో సౌలు ఓడిపోవుచుండెను. అతడు అంబులు వేయువారి కంటబడి వారిచేత బహు గాయముల నొందెను.
Yuddhamulo saulu odipovuchundenu. Atadu ambulu veyuvaari kantabadi vaaricheta bahu gaayamula nondenu.
1 Chronicles 10:3 in English
- King James Version (KJV)
- And the battle went sore against Saul, and the archers hit him, and he was wounded of the archers.
- World English Bible (WEB)
- The battle went hard against Saul, and the archers overtook him; and he was distressed by reason of the archers.
- American Standard Version (ASV)
- And the battle went sore against Saul, and the archers overtook him; and he was distressed by reason of the archers.
- Bible in Basic English (BBE)
- And the fight was going against Saul, and the archers came across him, and he was wounded by the archers.
- Darby Translation (DBY)
- And the battle went sore against Saul, and the archers came up with him, and he was terrified by the archers.
- Webster's Bible (WBS)
- And the battle prevailed against Saul, and the archers hit him, and he was wounded by the archers.
- Young's Literal Translation (YLT)
- And the battle [is] heavy on Saul, and those shooting with the bow find him, and he is wounded by those shooting,
Read in context
- 1ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధముచేయగా ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులయెదుట నిలువలేక పారిపోయి హతులై గిల్బోవ పర్వతమందు పడిరి.
- 2ఫిలిష్తీ యులు సౌలును అతని కుమారులను తరిమి సౌలు కుమారులైన యోనాతానును, అబీనాదాబును మల్కీషూవను హతముచేసిరి.
- 3యుద్ధములో సౌలు ఓడిపోవుచుండెను. అతడు అంబులు వేయువారి కంటబడి వారిచేత బహు గాయముల నొందెను.
- 4అప్పుడు సౌలుఈ సున్నతి లేని జనులు వచ్చి నాకు మానభంగము చేయకుండ నీవు నీ కత్తిదూసి నన్ను పొడిచివేయుమని తన ఆయుధములను మోయువానితోననగా, వాడు బహుగా భయపడి ఆలాగు చేయుటకు ఒప్పలేదు గనుక సౌలు తన కత్తిమీదపడెను.
- 5సౌలు చనిపోయెనని ఆయుధములను మోయువాడు తెలిసి కొని తానును కత్తిని పట్టుకొని దానిమీదపడి చచ్చెను.
Cross references
- 1 Samuel 31:3–6 1 సమూయేలు 31:3–6యుద్ధములో సౌలు ఓడిపోవుచుండగా అతడు అంబులువేయువారి కంటబడి వారిచేత బహు గాయముల నొందెను. అప్పుడు సౌలు సున్నతిలేని వీరు వచ్చి నన్ను పొడిచి అపహాస్యము చేయకుండునట్లు నీకత్తి దూసి దానిచేత నన్ను పొడువుమని తన ఆయుధములను మోయువానితో చెప్పగా అతడు భయముచేత ఆలాగు చేయనొల్లకుండెను గనుక సౌలు తన కత్తి పట్టుకొని దానిమీద పడెను. సౌలు మరణమాయెనని అతని ఆయుధములను మోయువాడు తానును తన కత్తిమీద పడి అతనితో కూడ మరణమాయెను. ఈలాగున సౌలును అతని ముగ్గురు కుమారులును అతని ఆయుధములను మోయువాడును అతని వారందరును ఒక దినముననే మరణమైరి.
- 2 Samuel 1:4–10 2 సమూయేలు 1:4–10జరిగిన సంగతులేవో నాతో చెప్పుమని దావీదు సెలవియ్యగా వాడుజనులు యుద్ధమందు నిలువ లేక పారిపోయిరి. అనేకులు పడి చచ్చిరి, సౌలును అతని కుమారుడైన యోనాతానును మరణమైరి అనెను. సౌలును అతని కుమారుడైన యోనాతానును మరణమైరని నీ కేలాగు తెలిసినది అని దావీదు వాని నడుగగా వాడిట్లనెను గిల్బోవ పర్వతమునకు నేను అకస్మాత్తుగా వచ్చినప్పుడు సౌలు తన యీటెమీద ఆనుకొనియుండెను. అతడు రథములును రౌతులును తనను వెనువెంట తగులు చుండుట చూచి వెనుక తిరిగి నన్ను కనుగొని పిలిచెను. అందుకుచిత్తము నా యేలినవాడా అని నేనంటిని. నీవెవడవని అతడు నన్నడుగగానేను అమాలేకీయుడనని చెప్పితిని. అతడునా ప్రాణము ఇంక నాలో ఉన్నదిగాని తల త్రిప్పుచేత నేను బహు బాధ పడుచున్నాను; నీవు నా దగ్గర నిలువబడి నన్ను చంపుమని సెలవియ్యగా, ఈలాగు పడినతరువాత అతడు బ్రదుకడని నేను నిశ్చయించుకొని అతనిదగ్గర నిలిచి అతని చంపితిని; తరువాత అతని తలమీదనున్న కిరీటమును హస్తకంకణము లను తీసికొని నా యేలినవాడవైన నీయొద్దకు వాటిని తెచ్చియున్నాను అనెను.
- Amos 2:14 ఆమోసు 2:14అప్పుడు అతివేగియగు వాడు తప్పించుకొన జాలకపోవును, పరాక్రమశాలి తన బలమునుబట్టి ధైర్యము తెచ్చుకొన జాలక పోవును, బలాఢ్యుడు తన ప్రాణము రక్షించుకొన జాలకుండును.
- Genesis 49:23–24 ఆదికాండము 49:23–24విలుకాండ్రు అతని వేధించిరి వారు బాణములను వేసి అతని హింసించిరి. యాకోబు కొలుచు పరాక్రమశాలియైనవాని హస్తబలమువలన అతని విల్లు బలమైనదగును. ఇశ్రాయేలునకు బండయు మేపెడివాడును ఆయనే. నీకు సహాయము చేయు నీ తండ్రి దేవునివలనను పైనుండి మింటి దీవెనలతోను