1 Chronicles · chapter 13 · verse 2
1 Chronicles 13:2 in Telugu
ఈ యోచన మీ దృష్టికి అనుకూలమై మన దేవుడైన యెహోవా వలన కలిగిన యెడల ఇశ్రాయేలీయుల నివాసప్రదేశముల యందంతట శేషించియున్న మన సహోదరులును తమ పట్టణములలోను పల్లెలలోను కాపురమున్న యాజకులును లేవీయులును మనతో కూడుకొనునట్లు వారియొద్దకు పంపి
Ee yochana mee drushtiki anukoolamai mana devudaina yehovaa valana kaligina yedala ishraayeleeyula nivaasapradeshamula yandantata sheshinchiyunna mana sahodarulunu tama pattanamulalonu pallelalonu kaapuramunna yaajakulunu leveeyulunu manato koodukonunatlu vaariyoddaku pampi
1 Chronicles 13:2 in English
- King James Version (KJV)
- And David said unto all the congregation of Israel, If [it seem] good unto you, and [that it be] of the LORD our God, let us send abroad unto our brethren every where, [that are] left in all the land of Israel, and with them [also] to the priests and Levites [which are] in their cities [and] suburbs, that they may gather themselves unto us:
- World English Bible (WEB)
- David said to all the assembly of Israel, “If it seems good to you, and if it is of the LORD our God, let’s send word everywhere to our brothers who are left in all the land of Israel, with whom the priests and Levites are in their cities that have pasture lands, that they may gather themselves to us.
- American Standard Version (ASV)
- And David said unto all the assembly of Israel, If it seem good unto you, and if it be of Jehovah our God, let us send abroad every where unto our brethren that are left in all the land of Israel, with whom the priests and Levites are in their cities that have suburbs, that they may gather themselves unto us;
- Bible in Basic English (BBE)
- And David said to all the men of Israel who had come together there, If it seems good to you and if it is the purpose of the Lord our God, let us send to all the rest of our brothers, everywhere in the land of Israel, and to the priests and the Levites in their towns and the country round them, and get them to come together here to us;
- Darby Translation (DBY)
- And David said to all the congregation of Israel, If it seem good to you, and it be of Jehovah our God, let us send abroad to our brethren everywhere, that are left in all the lands of Israel, and with them to the priests and Levites in their cities and suburbs, that they may gather themselves to us;
- Webster's Bible (WBS)
- And David said to all the congregation of Israel, If [it seemeth] good to you, and [that it is] of the LORD our God, let us send abroad to our brethren every where, [that are] left in all the land of Israel, and with them [also] to the priests and Levites [who are] in their cities [and] suburbs, that they may assemble to us:
- Young's Literal Translation (YLT)
- and David saith to all the assembly of Israel, 'If unto you it be good, and from Jehovah our God it hath broken forth — we send unto our brethren, those left in all the lands of Israel, and with them the priests and the Levites, in the cities of their suburbs, and they are gathered unto us,
Read in context
- 1దావీదు సహస్రాధిపతులతోను శతాధిపతులతోను అధిపతులందరితోను ఆలోచనచేసి, సమాజముగా కూడిన ఇశ్రాయేలీయులందరితో ఈలాగు సెలవిచ్చెను
- 2ఈ యోచన మీ దృష్టికి అనుకూలమై మన దేవుడైన యెహోవా వలన కలిగిన యెడల ఇశ్రాయేలీయుల నివాసప్రదేశముల యందంతట శేషించియున్న మన సహోదరులును తమ పట్టణములలోను పల్లెలలోను కాపురమున్న యాజకులును లేవీయులును మనతో కూడుకొనునట్లు వారియొద్దకు పంపి
- 3మన దేవుని మందసమును మరల మనయొద్దకు కొనివత్తము రండి; సౌలు దినములలో దానియొద్ద మనము విచారణ చేయకయే యుంటిమి.
- 4ఈ కార్యము సమా జకులందరి దృష్టికి అనుకూలమాయెను గనుక జనులందరును ఆ ప్రకారము చేయుదుమనిరి.
Cross references
- 1 Samuel 31:1 1 సమూయేలు 31:1అంతలో ఫిలిష్తీయులు ఇశ్రాయేలీ యులతో యుద్ధముచేయగా ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల యెదుటనుండి పారిపోయిరి. గిల్బోవ పర్వతమువరకు ఫిలిష్తీయులు వారిని హతము చేయుచు
- Numbers 4:4–20 సంఖ్యాకాండము 4:4–20అతి పరిశుద్ధమైన దాని విషయములో ప్రత్య క్షపు గుడారమునందు కహాతీయులు చేయవలసిన సేవ యేదనగా దండు ప్రయాణమైనప్పుడు అహరోనును అతని కుమారులును లోపలికి వచ్చి అడ్డతెరను దించి దానితో సాక్ష్యపు మందసమును కప్పి దానిమీద సముద్రవత్సల చర్మమయమైన కప్పునువేసి దానిమీద అంతయు నీలవర్ణముగల బట్టను పరచి దాని మోతకఱ్ఱలను దూర్చవలెను. సన్నిధిబల్లమీద నీలిబట్టను పరచి దాని మీద గిన్నెలను ధూపార్తులను పాత్రలను తర్పణ పాత్ర లను ఉంచవలెను. నిత్యముగా ఉంచవలసిన రొట్టెలును దానిమీద ఉండవలెను. అప్పుడు వారు వాటిమీద ఎఱ్ఱ బట్ట పరచి దానిమీద సముద్రవత్సల చర్మపు కప్పువేసి దాని మోతకఱ్ఱలను దూర్చవలెను. మరియు వారు నీలి బట్టను తీసికొని దీపవృక్షమును దాని ప్రదీపములను దాని కత్తెరను దాని కత్తెర చిప్పలను దాని సేవలో వారు ఉప యోగపరచు సమస్త తైలపాత్రలను కప్పి దానిని దాని ఉపకరణములన్నిటిని సముద్రవత్సల చర్మమయమైన కప్పులో పెట్టి దండెమీద ఉంచవలెను. మరియు బంగారుమయమైన బలిపీఠముమీద నీలిబట్టనుపరచి సముద్రవత్సల చర్మముతో దానిని కప్పి దాని మోతకఱ్ఱలను దూర్చవలెను. మరియు తాము పరిశుద్ధస్థలములో సేవ చేయు ఆ ఉపకరణములన్నిటిని వారు తీసికొని నీలిబట్టలో ఉంచి సముద్రవత్సల చర్మముతో కప్పి వాటిని దండెమీద పెట్టవలెను. వారు బలిపీఠపు బూడిద యెత్తి దానిమీద ధూమ్రవర్ణముగల బట్టను పరచి దానిమీద తమ సేవోప కరణములన్నిటిని, అనగా ధూపార్తి ముండ్లు గరిటెలు గిన్నెలునైన బలిపీఠపు ఉపకరణములన్నిటిని దానిమీద పెట్టి, సముద్రవత్సల చర్మమయమైన కప్పును దానిమీద పరచి, దాని మోతకఱ్ఱలను తగిలింపవలెను. దండు ప్రయాణమైనప్పుడు అహరో నును అతని కుమారులును పరిశుద్ధస్థలమును పరిశుద్ధస్థలముయొక్క ఉపకరణములన్ని టిని కప్పుట ముగించిన తరువాత కహాతీయులు దాని మోయ రావలెను. అయితే వారు చావకయుండునట్లు పరిశుద్ధ మైనదానిని ముట్టకూడదు. ఇవి ప్రత్యక్షపు గుడారములో కహాతీయుల భారము. యాజకుడగు అహరోను కుమారుడైన ఎలియాజరు పైవిచారణలోనికి వచ్చునవి ఏవనగాదీపతైలము పరిమళ ధూపద్రవ్యములు నిత్య నైవేద్యము అభిషేకతైలము. మందిరమంతటి పైవిచారణ పరిశుద్ధస్థలములోనేమి, దాని ఉపకరణములలోనేమి, దానిలోనున్న అంతటి పై విచారణలోనికి అతని భారము. మరియు యెహోవా మోషే అహరోనులకు ఈలాగు సెలవిచ్చెను మీరు కహాతీయుల గోత్ర కుటుంబములను లేవీయులలోనుండి ప్రత్యేకింపకుడి. వారు అతి పరిశుద్ధమైనదానికి సమీపించినప్పుడు వారు చావక బ్రదికి యుండునట్లు మీరు వారినిగూర్చి చేయవలసినదేదనగా అహరోనును అతని కుమారులును లోపలికి వచ్చి ప్రతి వానికి వాని వాని పనియు వాని వాని బరువును నియమింపవలెను. వారు చావకయుండునట్లు పరిశుద్ధస్థలమును రెప్పపాటు సేపైనను చూచుటకు లోపలికి రాకూడదు.
- 2 Kings 9:15 2 రాజులు 9:15అయితే యెహోరాము సిరియా రాజైన హజాయేలుతో యుద్ధము చేయుచుండగా సిరియనులవలన తాను పొందిన గాయములను బాగు చేసి కొనుటకై యెజ్రెయేలు ఊరికి తిరిగి వచ్చియుండెను. అంతట యెహూనీకనుకూలమైతే ఈ సంగతి తెలియ బడకుండునట్లు ఈ పట్టణములోనుండి యెవనినైనను యెజ్రెయేలు ఊరికి తప్పించుకొని పోనియ్యకుమని ఆజ్ఞ ఇచ్చి
- Exodus 18:23 నిర్గమకాండము 18:23దేవుడు ఈలాగు చేయుటకు నీకు సెలవిచ్చినయెడల నీవు ఈ పని చేయుచు దాని భారమును సహింపగలవు. మరియు ఈ ప్రజలందరు తమ తమ చోట్లకు సమాధానముగా వెళ్లుదురని చెప్పెను.
- 2 Chronicles 31:4–21 2 దినవృత్తాంతములు 31:4–21మరియు యెహోవా ధర్మశాస్త్రమును బట్టి యాజకులును లేవీయులును ధైర్యము వహించి తమ పని జరుపుకొనునట్లు ఎవరి భాగములను వారికి ఇయ్య వలసినదని యెరూషలేములో కాపురమున్న జనులకు అతడు ఆజ్ఞాపించెను. ఆ యాజ్ఞ వెల్లడియగుటతోడనే ఇశ్రాయేలీయులు ప్రథమఫలములైన ధాన్య ద్రాక్షారసములను నూనెను తేనెను సస్యఫలములను విస్తారముగా తీసికొని వచ్చిరి. సమస్తమైన వాటిలోనుండియు పదియవ వంతులను విస్తారముగా తీసికొని వచ్చిరి. యూదా పట్టణములలో కాపురమున్న ఇశ్రాయేలు వారును యూదా వారును ఎద్దులలోను గొఱ్ఱెలలోను పదియవవంతును, తమ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠితములైన వస్తువులలో పదియవ వంతును తీసికొని వచ్చి కుప్పలుగా కూర్చిరి. వారు మూడవ మాసమందు కుప్పలువేయ నారంభించి ఏడవ మాసమందు ముగించిరి. హిజ్కియాయును అధి పతులును వచ్చి ఆ కుప్పలను చూచి యెహోవాను స్తుతించి ఆయన జనులైన ఇశ్రాయేలీయులను దీవించిరి. హిజ్కియా ఆ కుప్పలనుగూర్చి యాజకులను లేవీయులను ఆలోచన యడిగినందుకు సాదోకు సంతతివాడును ప్రధానయాజ కుడునగు అజర్యా యెహోవా మందిరములోనికి జనులు కానుకలను తెచ్చుట మొదలుపెట్టినప్పటినుండి మేము సమృద్ధిగా భోజనముచేసినను చాలా మిగులుచున్నది; యెహోవా తన జనులను ఆశీర్వదించినందున ఇంత గొప్పరాశి మిగిలినదని రాజుతోననగా హిజ్కియా యెహోవా మందిరములో కొట్లను సిద్ధపరచవలసినదని ఆజ్ఞ ఇచ్చెను. వారు వాటిని సిద్ధపరచి ఏమియు అపహరింపకుండ కానుకలను పదియవ భాగములను ప్రతి ష్ఠితములుగా తేబడిన వస్తువులను లోపల చేర్చిరి; లేవీయు డైన కొనన్యా వాటిమీద విచారణకర్తగా నియమింపబడెను; అతని సహోదరుడైన షిమీ అతనికి సహకారిగా ఉండెను. మరియు యెహీయేలు అజజ్యాహు నహతు అశాహేలు యెరీమోతు యోజాబాదు ఎలీయేలు ఇస్మ క్యాహు మహతు బెనాయాలనువారు రాజైన హిజ్కియా వలనను, దేవుని మందిరమునకు అధిపతియైన అజర్యావలనను, తాము పొందిన ఆజ్ఞచొప్పున కొనన్యా చేతిక్రిందను, అతని సహోదరుడగు షిమీ చేతిక్రిందను కనిపెట్టువారై యుండిరి. తూర్పుతట్టు ద్వారమునొద్ద పాల కుడును ఇమ్నా కుమారుడునగు లేవీయుడైన కోరే యెహోవా కానుకలను అతిపరిశుద్ధమైనవాటిని పంచి పెట్టుటకు దేవునికి అర్పింపబడిన స్వేచ్ఛార్పణలమీద నియమింపబడెను. అతని చేతిక్రింద ఏదెను మిన్యామీను యేషూవ షెమయా అమర్యా షెకన్యా అనువారు నమ్మకమైనవారు గనుక యాజకుల పట్టణములందు పిన్న పెద్దలైన తమ సహోదరులకు వంతులచొప్పున భాగము లిచ్చుటకు నియమింపబడిరి. ఇదియుగాక గోత్రములలో మూడు సంవత్సరములు మొదలుకొని అంతకు పైవయస్సు గలవారై జనసంఖ్య సరిచూడబడిన మగవారికందరికిని, వంతులచొప్పున సేవచేయుటకై ప్రతిదినము యెహోవా మందిరములోనికి వచ్చువారందరికిని, ఇరువది సంవత్సర ములు మొదలుకొని అంతకు పైవయస్సు గలవారై వంతుల చొప్పున సేవచేయుటకు తమ తమ పితరుల వంశములచొప్పున యాజకులలో సరిచూడబడిన లేవీయులకు, అనగా నమ్మకమైనవారై తమ్మును ప్రతిష్ఠించుకొనిన లేవీ యులకును, తమ పిల్లలతోను భార్యలతోను కుమారులతోను కుమార్తెలతోను సమాజమంతటను సరిచూడబడిన వారికిని, ఆయా పట్టణములకు చేరిన గ్రామములలో నున్న అహరోను వంశస్థులైన యాజకులకును, వంతులు ఏర్పరచుటకు వారు నియమింపబడి యుండిరి. పేళ్లచేత చెప్పబడిన ఆ జనులు యాజకులలో పురుషులకందరికిని, లేవీయులలో వంశములచొప్పున సరిచూడబడిన వారికందరికిని వంతులు ఏర్పరచుటకు నియమింపబడిరి. హిజ్కియా యూదా దేశమంతటను ఈలాగున జరిగించి, తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పనిచేయుచు వచ్చెను. తన దేవుని ఆశ్ర యించుటకై దేవుని మందిర సేవవిషయమందేమి ధర్మశాస్త్ర విషయమందేమి ధర్మమంతటివిషయమందేమి తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకముగా జరిగించి వర్ధిల్లెను.
- 1 Chronicles 15:2–14 1 దినవృత్తాంతములు 15:2–14మందసమును ఎత్తుటకును నిత్యము తనకు సేవ చేయుటకును యెహోవా లేవీయులను ఏర్పరచుకొనెనని చెప్పివారు తప్ప మరి ఎవరును దేవుని మందసమును ఎత్తకూడదని దావీదు ఆజ్ఞ ఇచ్చెను. అంతట దావీదు తాను యెహోవా మందసమునకు సిద్ధపరచిన స్థలమునకు దాని తీసికొనివచ్చుటకై ఇశ్రాయేలీయులనందరిని యెరూషలేమునకు సమాజముగా కూర్చెను. అహరోను సంతతివారిని లేవీయులైన కహాతు సంతతివారి అధిపతియగు ఊరీయేలును వాని బంధువులలో నూట ఇరువదిమందిని, మెరారీయులలో అధిపతియైన అశాయాను వాని బంధువులలో రెండువందల ఇరువది మందిని, గెర్షోను సంతతివారికధిపతియగు యోవే లును వాని బంధువులలో నూట ముప్పదిమందిని, ఎలీషాపాను సంతతివారికధిపతియగు షెమయాను వాని బంధు వులలో రెండువందలమందిని, హెబ్రోను సంతతివారి కధిపతియగు ఎలీయేలును వాని బంధువులలో ఎనుబది మందిని ఉజ్జీయేలు సంతతివారికధిపతియగు అమ్మినా దాబును వాని బంధువులలో నూట పండ్రెండుగురిని దావీదు సమకూర్చెను. అంతట దావీదు యాజకులైన సాదోకును అబ్యాతారును లేవీయులైన ఊరియేలు అశాయా యోవేలు షెమయా ఎలీయేలు అమ్మినాదాబు అనువారిని పిలిపించి వారితో ఇట్లనెను. లేవీయుల పితరుల సంతతులకుమీరు పెద్దలై యున్నారు. ఇంతకుముందు మీరు ఇశ్రా యేలీయుల దేవుడైన యెహోవా మందసమును మోయక యుండుటచేతను, మనము మన దేవుడైన యెహోవా యొద్ద విధినిబట్టి విచారణచేయకుండుటచేతను, ఆయన మనలో నాశనము కలుగజేసెను; కావున ఇప్పుడు మీరును మీవారును మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొని, నేను ఆ మందసమునకు సిద్ధపరచిన స్థలమునకు దాని తేవలెను. అప్పుడు యాజకులును లేవీయులును ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మందసమును తెచ్చుటకై తమ్మును తాము ప్రతిష్ఠించుకొనిరి.
- Proverbs 15:22 సామెతలు 15:22ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశములు వ్యర్థమగును ఆలోచన చెప్పువారు బహుమంది యున్నయెడల ఉద్దేశములు దృఢపడును.
- Numbers 35:2–9 సంఖ్యాకాండము 35:2–9ఇశ్రాయేలీయులు తాము పొందు స్వాస్థ్యములో లేవీయులు నివసించుటకు వారికి పురములను ఇయ్యవలెనని వారి కాజ్ఞాపించుము; ఆ పురముల చుట్టునున్న పల్లెలను లేవీయులకియ్యవలెను. వారు నివసించుటకు ఆ పురములు వారివగును. వాటి పొలములు వారి పశువులకును వారి మందలకును వారి సమస్త జంతు వులకును ఉండవలెను. మీరు లేవీయులకిచ్చు పురముల పల్లెల ప్రతి పురముయొక్క గోడ మొదలుకొని చుట్టు వెయ్యి మూరలు మరియు మీరు ఆ పురముల వెలుపల నుండి తూర్పు దిక్కున రెండువేల మూరలను, దక్షిణ దిక్కున రెండువేల మూరలను, పడమటి దిక్కున రెండు వేల మూరలను, ఉత్తర దిక్కున రెండువేల మూరలను కొలవవలెను. ఆ నడుమ పురముండవలెను. అది వారి పురములకు పల్లెలుగా నుండును. మరియు మీరు లేవీ యులకిచ్చు పురములలో ఆరు ఆశ్రయపురములుండవలెను. నరహంతుకుడు వాటిలోనికి పారిపోవునట్లుగా వాటిని నియమింపవలెను. అవియుగాక నలువదిరెండు పురములను ఇయ్యవలెను. వాటి వాటి పల్లెలతోకూడ మీరు లేవీయులకు ఇయ్యవలసిన పురములన్నియు నలువదియెని మిది. మీరు ఇచ్చు పురములు ఇశ్రాయేలీయుల స్వాస్థ్య ములో నుండియే ఇయ్యవలెను. మీరు ఎక్కువైనదానిలో ఎక్కువగాను, తక్కువైనదానిలో తక్కువగాను ఇయ్యవలెను. ప్రతి గోత్రము తాను పొందు స్వాస్థ్యము చొప్పున, తన తన పురములలో కొన్నిటిని లేవీయులకు ఇయ్య వలెను. మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము
- Isaiah 37:4 యెషయా 37:4జీవముగల దేవుని దూషించు టకై అష్షూరురాజైన తన యజమానునిచేత పంపబడిన రబ్షాకే పలికిన మాటలు నీ దేవుడైన యెహోవా ఒకవేళ ఆలకించి, నీ దేవుడైన యెహోవాకు వినబడియున్న ఆ మాటలనుబట్టి ఆయన అష్షూరురాజును గద్దించునేమో. కాబట్టి నిలిచిన శేషముకొరకు నీవు హెచ్చుగా ప్రార్థన చేయుము.
- 2 Samuel 7:2–5 2 సమూయేలు 7:2–5నేను దేవదారుమ్రానుతో కట్టిన నగరియందు వాసము చేయుచుండగా దేవుని మందసము డేరాలో నిలిచియున్నదనగా నాతానుయెహోవా నీకు తోడుగా నున్నాడు, నీకు తోచినదంతయు నెరవేర్చుమనెను. అయితే ఆ రాత్రి యెహోవా వాక్కు నాతానునకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా నీవు పోయి నా సేవకుడగు దావీదుతో ఇట్లనుముయెహోవా నీకాజ్ఞ ఇచ్చునదేమనగానాకు నివాసముగా ఒక మందిరమును కట్టింతువా?
- 1 Kings 12:7 1 రాజులు 12:7వారుఈ దినముననే నీవు ఈ జనులకు దాసుడవై వారికి సేవచేసి మృదువైన మాటలతో వారికి ప్రత్యుత్తర మిచ్చినయెడల వారు సదాకాలము నీకు దాసులగుదురనిరి.
- Philemon 1:8–9 ఫిలేమోనుకు 1:8–9కావున యుక్తమైనదానినిగూర్చి నీ కాజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహు ధైర్యము కలిగియున్నను, వృద్ధుడను ఇప్పుడు క్రీస్తుయేసు ఖైదీనైయున్న పౌలను నేను ప్రేమనుబట్టి వేడుకొనుట మరి మంచిదనుకొని,
Original words (Hebrew)
- David · H1732דָּוִד Dâvid
- said · H559אָמַר ʼâmar
- congregation · H6951קָהָל qâhâl
- Israel · H3478יִשְׂרָאֵל Yisrâʼêl
- good · H2895טוֹב ṭôwb
- God · H430אֱלֹהִים ʼĕlôhîym
- send · H7971שָׁלַח shâlach
- abroad · H6555פָּרַץ pârats
- brethren · H251אָח ʼâch
- left · H7604שָׁאַר shâʼar
- land · H776אֶרֶץ ʼerets
- Israel · H3478יִשְׂרָאֵל Yisrâʼêl
- priests · H3548כֹּהֵן kôhên
- Levites · H3881לֵוִיִּי Lêvîyîy
- cities · H5892עִיר ʻîyr
- suburbs · H4054מִגְרָשׁ migrâsh
- gather · H6908קָבַץ qâbats