1 Chronicles · chapter 15 · verse 26
1 Chronicles 15:26 in Telugu
యెహోవా నిబంధన మందసమును మోయు లేవీయులకు దేవుడు సహాయముచేయగా వారు ఏడు కోడె లను ఏడు గొఱ్ఱెపొట్టేళ్లను బలులుగా అర్పించిరి.
Yehovaa nibandhana mandasamunu moyu leveeyulaku devudu sahaayamucheyagaa vaaru edu kode lanu edu gorrepottellanu balulugaa arpinchiri.
1 Chronicles 15:26 in English
- King James Version (KJV)
- And it came to pass, when God helped the Levites that bare the ark of the covenant of the LORD, that they offered seven bullocks and seven rams.
- World English Bible (WEB)
- When God helped the Levites who bore the ark of the LORD’s covenant, they sacrificed seven bulls and seven rams.
- American Standard Version (ASV)
- And it came to pass, when God helped the Levites that bare the ark of the covenant of Jehovah, that they sacrificed seven bullocks and seven rams.
- Bible in Basic English (BBE)
- And when God gave help to the Levites who were lifting up the ark of the agreement of the Lord, they made an offering of seven oxen and seven sheep.
- Darby Translation (DBY)
- And it came to pass, when God helped the Levites that bore the ark of the covenant of Jehovah, that they sacrificed seven bullocks and seven rams.
- Webster's Bible (WBS)
- And it came to pass, when God helped the Levites that bore the ark of the covenant of the LORD, that they offered seven bullocks and seven rams.
- Young's Literal Translation (YLT)
- and it cometh to pass, in God's helping the Levites bearing the ark of the covenant of Jehovah, that they sacrifice seven bullocks and seven rams.
Read in context
- 24షెబన్యా యెహోషాపాతు నెతనేలు అమాశై జెకర్యా బెనాయా ఎలీయెజెరు అను యాజకులు దేవుని మందసమునకు ముందు బూరలు ఊదువారుగాను, ఓబేదెదోమును యెహీయాయును వెనుకతట్టు కనిపెట్టువారుగాను నియమింపబడిరి.
- 25దావీదును ఇశ్రాయేలీయుల పెద్దలును సహస్రాధిపతులును యెహోవా నిబంధన మందసమును ఓబేదెదోము ఇంటిలోనుండి తెచ్చుటకై ఉత్సాహముతో పోయిరి.
- 26యెహోవా నిబంధన మందసమును మోయు లేవీయులకు దేవుడు సహాయముచేయగా వారు ఏడు కోడె లను ఏడు గొఱ్ఱెపొట్టేళ్లను బలులుగా అర్పించిరి.
- 27దావీదును మందసమును మోయు లేవీయులందరును పాటకులును పాటకుల పనికి విచారణకర్తయగు కెనన్యాయును సన్నపునారతో నేయబడిన వస్త్రములు ధరించుకొని యుండిరి, దావీదును సన్నపు నారతో నేయబడిన ఏఫోదును ధరించియుండెను.
- 28ఇశ్రాయేలీయులందరును ఆర్బా éటము చేయుచు, కొమ్ములు బూరలు ఊదుచు, తాళములు కొట్టుచు, స్వరమండలములు సితారాలు వాయించుచు యెహోవా నిబంధన మందసమును తీసికొనివచ్చిరి.
Cross references
- Numbers 23:29 సంఖ్యాకాండము 23:29బిలాముఇక్కడ నాకు ఏడు బలి పీఠములను కట్టించి, యిక్కడ ఏడు కోడెలను ఏడు పొట్టేళ్లను సిద్ధపరచుమని బాలాకుతో చెప్పెను.
- Psalm 66:13–15 కీర్తనలు 66:13–15దహనబలులను తీసికొని నేను నీ మందిరములోనికి వచ్చెదను. నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మ్రొక్కుబడులను నా నోరు వచించిన మ్రొక్కుబడులను నేను నీకు చెల్లించెదను పొట్టేళ్లను ధూపమును క్రొవ్విన గొఱ్ఱెలను తీసికొని నీకు దహనబలులు అర్పించెదను. ఎద్దులను పోతుమేకలను అర్పించెదను. (సెలా).
- 1 Chronicles 29:14 1 దినవృత్తాంతములు 29:14ఈ ప్రకారము మనఃపూర్వకముగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు నేనెంత మాత్రపువాడను? నా జనులెంత మాత్రపువారు? సమస్తమును నీవలననే కలిగెను గదా? నీ స్వసంపాద్యములో కొంత మేము నీకిచ్చియున్నాము.
- Job 42:8 యోబు 42:8కాబట్టి యేడు ఎడ్లను ఏడు పొట్టేళ్లను మీరు తీసికొని, నా సేవకుడైన యోబునొద్దకు పోయి మీ నిమిత్తము దహనబలి అర్పింపవలెను. అప్పుడు నా సేవకుడైనయోబు మీ నిమిత్తము ప్రార్థనచేయును. మీ అవివేకమునుబట్టి మిమ్మును శిక్షింపక యుండునట్లు నేను అతనిని మాత్రము అంగీకరించెదను; ఏలయనగా నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్నుగూర్చి యుక్తమైనది పలుక లేదు.
- Numbers 23:1–4 సంఖ్యాకాండము 23:1–4అప్పుడు బిలాముఇక్కడ నేను బలి అర్పించు టకు ఏడు బలిపీఠములను కట్టించి, ఇక్కడ ఏడు కోడెలను ఏడు పొట్టేళ్లను సిద్ధపరచుమని బాలాకుతో చెప్పెను. బిలాము చెప్పినట్లు బాలాకు చేయగా, బాలాకును బిలా మును ప్రతి బలిపీఠముమీద ఒక కోడెను ఒక పొట్టేలును దహనబలిగా అర్పించిరి. మరియు బిలాము బాలాకుతోబలిపీఠము మీది నీ దహనబలియొద్ద నిలిచియుండుము, నేను వెళ్లెదను; ఒకవేళ యెహోవా నన్ను ఎదుర్కొనునేమో; ఆయన నాకు కనుపరచునది నీకు తెలియచేసెదనని చెప్పి మెట్టయెక్కెను. దేవుడు బిలాముకు ప్రత్యక్షము కాగా అతడునేను ఏడు బలిపీఠములను సిద్ధపరచి ప్రతి దానిమీదను ఒక కోడెను ఒక పొట్టేలును అర్పించితినని ఆయనతో చెప్పగా,
- Numbers 29:32 సంఖ్యాకాండము 29:32ఏడవ దినమున నిత్యమైన దహనబలియు దాని నైవేద్య మును పానార్పణమును గాక నిర్దోషమైన యేడు దూడ లను రెండు పొట్టేళ్లను ఏడాదివైన పదునాలుగు గొఱ్ఱె పిల్లలను విధి ప్రకారముగా, వాటి వాటి లెక్కచొప్పున,
- Acts 26:22 అపొస్తలుల కార్యములు 26:22అయినను నేను దేవుని వలననైన సహాయము పొంది నేటివరకు నిలిచియుంటిని; క్రీస్తు శ్రమపడి మృతుల పునరుత్థానము పొందువారిలో మొదటివాడగుటచేత, ఈ ప్రజలకును అన్యజనులకును వెలుగు ప్రచురింపబోవునని
- 2 Corinthians 2:16 2 కొరింథీయులకు 2:16నశించువారికి మరణార్థమైన మరణపు వాసనగాను రక్షింప బడువారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాము.
- Ezekiel 45:23 యెహెజ్కేలు 45:23మరియు ఏడు దినములు అతడు నిర్దోషమైన యేడు ఎడ్లను ఏడు పొట్టేళ్ళను తీసికొని, దినమొక టింటికి ఒక యెద్దును ఒక పొట్టేలును దహనబలిగా యెహోవాకు అర్పింపవలెను; మరియు అనుదినము ఒక్కొక్క మేకపిల్లను పాపపరిహారార్థబలిగా అర్పింప వలెను.
- 1 Samuel 7:12 1 సమూయేలు 7:12అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దానిని నిలిపియింతవరకు యెహోవా మనకు సహాయము చేసెనని చెప్పి దానికి ఎబెనెజరు అను పేరు పెట్టెను.
- 2 Corinthians 3:5 2 కొరింథీయులకు 3:5మావలన ఏదైన అయినట్లుగా ఆలోచించుటకు మాయంతట మేమే సమర్థులమని కాదు; మా సామర్థ్యము దేవుని వలననే కలిగియున్నది.
- 2 Samuel 6:13 2 సమూయేలు 6:13ఎట్లనగా యెహోవా మందసమును మోయువారు ఆరేసి యడుగులు సాగగా ఎద్దు ఒకటియు క్రొవ్విన దూడ ఒకటియు వధింపబడెను,