1 Chronicles · chapter 16 · verse 29
1 Chronicles 16:29 in Telugu
యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించుడి నైవేద్యములు చేత పుచ్చుకొని ఆయన సన్నిధిని చేరుడి పరిశుద్ధాలంకారములగు ఆభరణములను ధరించుకొని ఆయన యెదుట సాగిలపడుడి.
Yehovaa naamamunaku tagina mahimanu aayanaku chellinchudi naivedyamulu cheta puchchukoni aayana sannidhini cherudi parishuddhaalankaaramulagu aabharanamulanu dharinchukoni aayana yeduta saagilapadudi.
1 Chronicles 16:29 in English
- King James Version (KJV)
- Give unto the LORD the glory [due] unto his name: bring an offering, and come before him: worship the LORD in the beauty of holiness.
- World English Bible (WEB)
- Ascribe to the LORD the glory due to his name. Bring an offering, and come before him. Worship the LORD in holy array.
- American Standard Version (ASV)
- Ascribe unto Jehovah the glory due unto his name: Bring an offering, and come before him; Worship Jehovah in holy array.
- Bible in Basic English (BBE)
- Give to the Lord the glory of his name; take with you an offering and come before him; give worship to the Lord in holy robes.
- Darby Translation (DBY)
- Give unto Jehovah the glory of his name! Bring an oblation, and come before him: Worship Jehovah in holy splendour.
- Webster's Bible (WBS)
- Give to the LORD the glory [due] to his name: bring an offering, and come before him: worship the LORD in the beauty of holiness.
- Young's Literal Translation (YLT)
- Ascribe to Jehovah the honour of His name, Lift up a present, and come before Him. Bow yourselves to Jehovah, In the beauty of holiness.
Read in context
- 27ఘనతాప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి బలమును సంతోషమును ఆయనయొద్ద ఉన్నవి.
- 28జనముల కుటుంబములారా, యెహోవాకు చెల్లించుడి. మహిమాబలమును యెహోవాకు చెల్లించుడి.
- 29యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించుడి నైవేద్యములు చేత పుచ్చుకొని ఆయన సన్నిధిని చేరుడి పరిశుద్ధాలంకారములగు ఆభరణములను ధరించుకొని ఆయన యెదుట సాగిలపడుడి.
- 30భూజనులారా, ఆయన సన్నిధిని వణకుడి అప్పుడు భూలోకము కదలకుండును అప్పుడది స్థిరపరచబడును.
- 31యెహోవా ఏలుచున్నాడని జనములలో చాటించుడి. ఆకాశములు ఆనందించునుగాక భూమి సంతోషించునుగాక
Cross references
- Psalm 100:4 కీర్తనలు 100:4కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి ఆయనను స్తుతించుడి ఆయన నామమును ఘనపరచుడి.
- Psalm 96:9 కీర్తనలు 96:9పరిశుద్ధాలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి సర్వభూజనులారా, ఆయన సన్నిధిని వణకుడి.
- Isaiah 6:3 యెషయా 6:3వారుసైన్యముల కధిపతియగు యెహోవా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు; సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి.
- Psalm 96:6 కీర్తనలు 96:6ఘనతాప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి బలసౌందర్యములు ఆయన పరిశుద్ధస్థలములో ఉన్నవి.
- Psalm 108:3–5 కీర్తనలు 108:3–5జనులమధ్య నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రజలలో నిన్ను కీర్తించెదను యెహోవా, నీ కృప ఆకాశముకంటె ఎత్తయినది నీ సత్యము మేఘములంత ఎత్తుగానున్నది. దేవా, ఆకాశముకంటె అత్యున్నతుడవుగా నిన్ను కనుపరచుకొనుము.
- Psalm 95:2 కీర్తనలు 95:2కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చెదము కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయుదము.
- Psalm 29:2 కీర్తనలు 29:2యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి ప్రతిష్ఠితములగు ఆభరణములను ధరించుకొని ఆయన యెదుట సాగిలపడుడి.
- Psalm 72:15 కీర్తనలు 72:15అతడు చిరంజీవియగును, షేబ బంగారము అతనికి ఇయ్యబడును. అతని క్షేమమునకై జనులు నిత్యము ప్రార్థన చేయు దురు దినమంతయు అతని పొగడుదురు.
- Psalm 89:5–8 కీర్తనలు 89:5–8యెహోవా, ఆకాశవైశాల్యము నీ ఆశ్చర్యకార్యములను స్తుతించుచున్నది పరిశుద్ధదూతల సమాజములో నీ విశ్వాస్యతను బట్టి నీకు స్తుతులు కలుగుచున్నవి. మింటను యెహోవాకు సాటియైనవాడెవడు? దైవపుత్రులలో యెహోవా వంటివాడెవడు? పరిశుద్ధదూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు తన చుట్టునున్న వారందరికంటె భయంకరుడు. యెహోవా, సైన్యములకధిపతివగు దేవా, యెహోవా, నీవంటి బలాఢ్యుడెవడు? నీ విశ్వాస్యతచేత నీవు ఆవరింపబడియున్నావు.
- Revelation 4:9–11 ప్రకటన 4:9–11ఆ సింహాసనము నందు ఆసీనుడైయుండి యుగయుగములు జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులును కలుగునుగాకని ఆ జీవులు కీర్తించుచుండగా ఆ యిరువది నలుగురు పెద్దలు సింహాసనమునందు ఆసీనుడై యుండువాని యెదుట సాగిలపడి, యుగయుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు ప్రభువా, మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి; నీ చిత్తమునుబట్టి అవి యుండెను; దానిని బట్టియే సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవని చెప్పుచు, తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేసిరి.
- Psalm 110:3 కీర్తనలు 110:3యుద్ధసన్నాహదినమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చెదరు. నీ ¸యౌవనస్థులలో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులైమంచు వలె అరుణోదయగర్భములోనుండి నీయొద్దకువచ్చెదరు
- 2 Chronicles 20:21 2 దినవృత్తాంతములు 20:21మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరచి, వారు పరిశుద్ధాలంకారములు ధరించి సైన్యము ముందర నడచుచుయెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించెను.